నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో 'విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వం -2021' ముగింపు

నాడు పోస్టు చేయడమైనది: 02 DEC 2021 11:20AM by PIB Hyderabad

వి.ఒ.చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో 'విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వం -2021' ముగింపు స‌మావేశం జ‌రిగింది. వి.ఒ.చిదంబరనార్  పోర్ట్ ట్రస్ట్‌లో  'విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వం -2021'  వేడుక‌ల సందర్భంగా పోర్ట్ ట్రస్ట్‌లో 29 నవంబర్ 2021న వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల‌ను పంపిణీ చేశారు. అక్టోబరు 26 నుండి నవంబర్ 1వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్స‌వం  సందర్భంగా పాఠశాల & కళాశాల విద్యార్థులు మరియు పోర్టు ఉద్యోగులకు  ఈ పోటీల‌ను నిర్వహించారు. పోర్ట్ నిర్వహించిన పోటీలలో 150 మందికి పైగా పాఠశాల/కళాశాల విద్యార్థులు మరియు ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు. వి.ఒ.చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్  చైర్మెన్ శ్రీ టి.కె. రామచంద్రన్ ఈ వారోత్స‌వం  ముగింపు స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు.  దేశంలోని ప్రతి పౌరుడు వివిధ ప్రభుత్వ సంస్థలతో పెద్ద సంఖ్యలో పరస్పర వివిధ ప‌నుల‌ను కలిగి ఉంటారని అన్నారు. సంస్థాగత లక్ష్యాలను చేరుకోవడానికి అత్యున్నత స్థాయి విశ్వ‌స‌నీయ‌త‌ను  కొనసాగించేలా ఈ పరస్పర చర్యలు ప్రక్రియను నిర్వహించడం చాలా ముఖ్యమ‌ని  నొక్కి చెప్పారు. ఈ సంద‌ర్భంగా వీఓసీ పోర్ట్ ట్రస్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ జె. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ .. పాఠశాలలు, కళాశాలలో  పోర్ట్ నిర్వహించే విజిలెన్స్ అవ‌గాహ‌న పోటీలు దేశ నిర్మాణ ప్రక్రియలో
అవినీతి వల్ల ఎదురవుతున్న అవరోధాల యువకులలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దోహ‌దం చేస్తాయ‌ని అన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 1777211) సందర్శకుల సూచీ సంఖ్య : : 180
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil