ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 01 DEC 2021 9:30AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 124.10 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల లక్ష కంటే తగ్గి, 99,023కు చేరుకున్నాయి. ఇది 547 రోజుల కనిష్ట స్థాయి.  

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.29% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.36% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 10,207 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,40,28,506 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,954 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.81%) గత 58 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.84%) గత 17 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 64.24 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1776713) Visitor Counter : 193