శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జాతీయస్థాయిలో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న కేరళకు చెందిన స్టార్టప్
Posted On:
29 NOV 2021 2:35PM by PIB Hyderabad
కేరళకు చెందిన మెడికల్ టెక్నాలజీ స్టార్టప్ , మెడికల్ పరికరాల కేటగిరిలో భారతప్రభుత్వానికి చెందిన 2021 సంవత్సరానికి స్టార్టప్ ఇండియా గ్రాండ్ ఛాలెంజ్ విజేతగా నిలిచింది.
సాస్కాన్ మెడిటెక్ స్టార్టప్ కంపెనీ. ఇది ఎస్‌సిటిఐఎంఎస్‌టి -టిఐమెడ్ వద్ద గల టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్.శ్రీ చిత్రతిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ ,తిరువనంతపురానికి చెందిన స్వతంత్ర సంస్థకు చెందినది. ఇది డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తోంది. ఈ సంస్థ భారతప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ ఫార్మసూటికల్స్ , స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన గ్రాండ్ ఛాలెంజ్‌లో 15,00,000ల నగదు బహుమతి గెలుచుకుంది.
ఈ అవార్డును నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాత్ ప్రకటించారు. క్లిష్టమైన పరిశీలన ప్రక్రియ అనంతరం ఈ అవార్డుకు పోటీపడిన 310 స్టార్టప్ కంపెనీల నుంచి సస్కాన్ ను గ్రాండ్ ఛాలెంజ్‌లో ఎంపిక చేశారు.
సస్కాన్ మెడిటెక్ ఓరల్ స్కాన్‌ను అభివృద్ధి చేసింది. ఇది నోటిలో కాన్సర్ కు ముందు ఏర్పడే గాయాలను ముందస్తుగా ఖచ్చితమైన రీతిలో తక్కువ ఖర్చుతో తొలిదశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే చేతిలో ఇమిడే పరికరాన్ని అభివృద్ది చేసింది. ఇది బయోఫోటోనిక్స్ టెక్నాలజీ ఆధారిత పరికరం. ఈ పరికరం క్లినికల్ ప్రయోగాల ఫలితాలు సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఓరల్ స్కాన్‌ను 2020 అక్టోబర్ లో ఆవిష్కరించారు. దీనిని 8 రాష్ట్రాలలో ఉపయోగిస్తున్నారు.
సాస్కాన్ రెండో ఉత్పత్తి సెర్విస్కాన్, ఇది కూడా చేతిలో ఇమిడే పరికరం. ఇది తొలి దశలోనే సర్వైకల్ కాన్సర్ లక్షణాలను తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది. దీనిని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ స్టార్టప్ 2021 సంవత్సరానికి అంజనీ మషేల్కర్ ఇన్ క్లూసివ్ ఇన్నొవేషన్ అవార్డ్ 2021 కి అంజనీ మషేల్కర్ ఫౌండేషన్ చేత ఎంపికైంది.సమాజానికి ఉపకరించే శాస్త్ర సాంకేతిక విజ్క్షానం, నూతన ఆవిష్కరణల రంగంలో కృషి చేస్తున్న సంస్థలను గుర్తించి వారిని ప్రోత్సహించడం, ఈ సంస్థ లక్ష్యం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రముఖులు అవార్డుకు ఎంపిక చేస్తారు.
సస్కాన్ ను డాక్టర్ సుభాష్ నారాయణన్ నెలకొల్పారు. సుభాష్ నారాయణన్ శాస్త్రవేత్త. ఆ తర్వాత వారు ఎంటర్‌ప్రెన్యుయర్ గా ఈ సంస్థను నెలకొల్పారు. అందరికీ అందుబాటు ధరలో ఆరోగ్య ఉత్పత్తులు,పరికరాల తయారీ , కాన్సర్ నివారణకు పరిష్కారాలు, స్క్రీనింగ్ ఆధారిత బయో ఫోటోనిక్స్, ఇతర అనుబంధ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సంస్థ బిఐఆర్ ఎ సి కి చెందిన బయోటెక్నాలజీ ఇగ్నినిషన్ గ్రాంట్ (బిఐజి), డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ వారిచే ఓరల్ స్కాన్ అభివృద్దికి గాను నిధి సీడ్ సపోర్ట్ పొందింది.
***
(Release ID: 1776711)
Visitor Counter : 127