ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
“ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్”
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో
29నుంచి డిసెంబరు 5వరకూ వేడుకలు..
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో
భారత్ విజయాలను, భావి ప్రణాళికను ప్రతిఫలించేలా,
వారంరోజుల పాటు సదస్సులు, పలు కార్యకలాపాలు...
Posted On:
28 NOV 2021 2:25PM by PIB Hyderabad
స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణంపై తన కలలను, దార్శనికతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుసార్లు ఇతరులతో పంచుకొన్నారు. దేశం ఒకవైపు,.. 75సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటూ అమృత గడియల్లోకి అడుగిడుతున్న వేళలో,–ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయి సారథిగా ఎదగగలిగిన తన శక్తి సామర్థ్యాలను గురించి మన జాతి యావత్తూ అవగాహన చేసుకోవలసిన తరుణం ఆసన్నమైంది.–గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన,..– ‘యేహీ సమయ్ హై, యేహీ సమయ్ హై, సహీ సమయ్ హై. అన్న మాటలను అందరూ గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది.
స్వాతంత్ర్య అమృత్ మహోత్సవంలో భాగంగా, – ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ పేరిట వారం రోజులపాటు పలు కార్యక్రమాలను, కార్యకలాపాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భవిష్యత్తు కోసం చేపట్టే కార్యక్రమాల ప్రణాళికను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించబోతోంది. మన ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఎలా పరివర్తన చెందిస్తున్నదో, మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆర్థిక అస్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నదో, డిజిటల్ పరిజ్ఞాన రంగంలో స్వావలంబనా స్ఫూర్తిని ఎలా రగిలిస్తున్నదో పేర్కొంటూ, ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారంరోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వివిధ శాఖల సీనియర్ అధికారులు, పారిశ్రామికరంగ ప్రముఖులు పాల్గొంటారు.
స్థూలంగా చెప్పాలంటే, భారతదేశాన్ని డిజిటల్ పరిజ్ఞాన రంగంలో సాధికారిక సమాజంగా, అధునాతన ఆర్థిక వ్యవస్థగా రూపొందించి, సాంకేతిక పరిజ్ఞాన, కమ్యూనికేషన్ రంగాల్లో దేశానికి స్వావలంబను సాధించిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా, భారతదేశపు డిజిటల్ పరిజ్ఞాన పరివర్తనాక్రమాన్ని వివరిస్తూ నవంబరు 29నుంచి పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారం రోజులపాటు జరిగే సదస్సుల సందర్భంగా డిజిటల్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ రూపకల్పన-తయారీ, ఉమ్మడి సేవా కేంద్రాలకు (సి.ఎస్.సి.లకు) సాధికారత, స్వదేశీ కంప్యూట్ డిజైనింగ్ ప్రక్రియలో దేశాన్ని ఆత్మనిర్భర భారత్.గా తీర్చిదిద్దడం, మైగవ్ పోర్టల్, డిజిటల్ చెల్లింపుల ఉత్సవం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్లీనరీ సమావేశాలు, ప్యానెల్ చర్చా కార్యక్రమాలు, ఎగ్బిషన్లు నిర్వహిస్తారు.
వారం రోజుల ఉత్సవాల్లో రోజువారీ కార్యక్రమాలు ఈ కింది విధంగా ఉంటాయి.
మొదటి రోజు: నపంబరు 29వ తేదీ..
అకమ్ వీక్ పేరిట జరిగే వారం రోజుల కార్యక్రమాలను, కార్యకలాపాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి తొలిరోజున ప్రారంభిస్తారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్,, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సమక్షంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాణిజ్య విభాగంగా ఎ.ఎస్.హెచ్. తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. ఉమంగ్ సేవల బట్వాడా విధానంపై ప్రకటన కూడా ఉంటుంది. ‘సుపరిపాలనా ప్రక్రియకు దోహదపడే పబ్లిక్ డిజిటల్ వేదికలు’ అన్న అంశంపై సదస్సును నిర్వహిస్తారు. ఈ-గవర్నెన్స్ పేరిట జరిగే కార్యక్రమాలపై అధ్యయన పత్రాల సమర్ఫణ, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో చర్చాగోష్టి నిర్వహిస్తారు.
2వ రోజు: నవంబరు 30.
రెండవ రోజున, ‘జనాభా పెరుగుదల సమస్యపై పరిష్కారాలకోసం కృత్రిమ మేధో పరిజ్ఞానాన్ని సానుకూలంగా వినియోగించడం –బ్లాక్ చెయిన్, ఎ.ఆర్./వి.ఆర్., డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’, ‘కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం అనంతరకాలంలో స్టార్టప్ సానుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడం’, కొత్త కోణం, కొత్తగా ఆవిర్భవిస్తున్న ధోరణులు తదితర అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు. యువతకోసం బాధ్యతాయుతమైన కృత్రిమ మేథోపరిజ్ఞానం- ప్రభుత్వ పాఠశాలలకోసం జాతీయ కార్యక్రమం అన్న అంశంపై గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా 20 ఉత్తమ ప్రాజెక్టులకు అవార్డులను ప్రదానం చేస్తారు. భూమి-బి.ఎస్.ఎఫ్. గ్రాండ్ చాలెంజ్ విజేతలకు కూడా అవార్డుల ప్రదానం జరుగుతుంది.
3వరోజు: డిసెంబరు 1.
3వ రోజున పలు ప్యానెల్స్.తో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘ఎలక్ట్రానిక్స్ సిస్టమ్, డిజైన్, తయారీలో దేశాన్ని ఆత్మనిర్భర భారత్.గా తీర్చిదిద్దడం -2025-26నాటికి 250 బిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయిని చేరుకునేలా ప్రణాళిక’పై చర్చా కార్యక్రమం. అలాగే,.. ‘మొబైల్ ఫోన్లు, ఐ.టి. హార్డ్.వేర్ పరికరాల ఉత్పత్తిని పెంచి, దేశాన్ని ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడం.’, ‘ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీలో దేశాన్ని ఆత్మనిర్భర భారత్.గా తీర్చిదిద్దడం’, ‘ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, కొత్త యుగపు పరికరాల విషయంలో స్వావలంబన’, ‘భారతదేశంలో సెమీ కండక్టర్ రూపకల్పన, ఇకో సిస్టమ్ ప్రదర్శన’ వంటి అంశాలపై ప్యానెల్ చర్చా కార్యక్రమాలు ఉంటాయి. “మేక్ ఇన్ ఇండియా” లక్ష్య సాధనకోసం సేవలందించిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలకు తగిన గుర్తింపునిచ్చి, అవార్డులు ప్రదానం చేయడం.
4వ రోజు: డిసెంబరు 2.
“కామన్ సర్వీస్ సెంటర్ (సి.ఎస్.సి.)-డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద పౌరులకు సాధికారత కల్పించడం” అన్న అంశంపై సదస్సు జరుగుతుంది. సి.ఎస్.సి.ల పాత్రపై చలన చిత్ర ప్రదర్శన, కీలకమైన అధికారుల ప్రసంగాలు, వివిధ కార్యక్రమాలపై జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)తో కేంద్ర పాఠశాల విద్య, ఆక్షరాస్యతా శాఖ అవగాహనా ఒప్పందాలు, సి.ఎస్.సి. కిసాన్ క్రెడిట్ కార్డుకోసం హెచ్.డి.ఎఫ్.సి.తో ఒప్పందం ఉంటాయి. సి.ఎస్.సి. పే అనే వ్యవస్థ ప్రారంభంపై కార్యక్రమం. అగ్రశ్రేణిలో సేవలందించిన 10 సి.ఎస్.సి.లకు/పి.ఎం.జి. దిశా వి.ఎల్.ఇ.లకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తారు.
5వ రోజు: డిసెంబరు 3.
‘స్వదేశీ కంప్యూట్ డిజైన్లలో దేశాన్ని ఆత్మనిర్భర భారత్ గా తీర్చిదిద్దడం’ అనే అంశం ఇతివృత్తంగా 3వ రోజు కార్యక్రమాలు ఉంటాయి. ‘స్వదేశీపరిజ్ఞానంతో మైక్రో ప్రాసెసర్ల తయారీలో భారతదేశాన్ని ఆత్మనిర్భర భారత్.గా తీర్చిదిద్దడం’ అనే అంశంపై వివిధ ప్యానెల్స్ మధ్య చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వదేశీ మైక్రోప్రాసెసర్ చాలెంజ్ కార్యక్రమం కింద ఫైనల్ దశకు చేరుకున్న 30 సంస్థల స్టాల్స్.ను ప్రదర్శిస్తారు. విజేతలుగా నిలిచిన పదిమంది ప్రతినిధులకు అవార్జుల ప్రదానం కార్యక్రమం ఉంటుంది.
6వ రోజు: డిసెంబు 4.
6వ రోజు, “మైగవ్ కార్యక్రమంతో ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్” పేరిట రోజు పొడవునా పౌరుల ప్రమేయంతో కూడిన మేళా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, మొదడకు మేతగా పనిచేసే భావనలతో వినోదంతో కూడిన కార్యకలాపాలను, కార్యక్రమాలను నిర్వహిస్తారు. పలువురు ప్రముఖులు, పారిశ్రామిక రంగ భాగస్వామ్య ప్రతినిధుల ప్రసంగాలు, మై గవ్ సాథీస్.తో ప్రధాన చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక ప్రముఖులు, మై గవ్ పోర్టల్ భాగస్వామ్య ప్రతినిధులు, సాథీస్ ప్రతినిధులు తదితరులతో ప్యానెల్ చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.
7వ రోజు: డిసెంబరు 5.
చివరి రోజున “డిజిటల్ చెల్లింపు ఉత్సవ్” పేరిట చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. ‘డిజీపే: విజన్ 2030’ అన్న అంశంపై జరిగే ఈ చర్చలో భారతీయ రిజర్వ్ బ్యాంకు, డి.ఎఫ్.ఎస్., భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్.పి.సి.ఐ.), భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ.), ఐ.సి.ఐ.సి.ఐ./హెచ్.డి.ఎఫ్.సి., పి.సి.ఐ., ఫోన్.పే, పేటీఎం సంస్థల ప్రముఖ అధికారులు పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా, స్టార్టప్ కంపెనీల ప్రెజెంటేషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, డిజిటల్ పేమెంట్స్ యాత్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిజిటల్ చెల్లింపుల దిశగా సాగుతున్న పయనం గురించి ఈ సందర్భంగా వివరిస్తారు. చుట్కీ బజకే గీతం ఆవిష్కరణతోపాటుగా, పి.ఎం. స్వానిధి, భారత్ బిల్ పే సిస్టమ్ (బి.బి.పి.ఎస్.) వంటి ప్రోత్సాహక పథకాలపై కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇక వివిధ అంశాల్లో ప్రతిభావంతమైన సేవలందించినందుకుగాను బ్యాంకర్లకు, ఫిన్ టెక్ కంపెనీలకు అవార్డుల ప్రదానంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారం రోజుల కార్యక్రమం ముగుస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ముగింపు ప్రసంగం కూడా ఉంటుంది.
డిజిటల్ ఇండియా పథకాలను వివరించే ఎగ్బిబిషన్ స్టాళ్లను ఈ సందర్భంగా నిర్వహిస్తారు. యువతకోసం బాధ్యతాయుతమైన కృత్రిమ మేధోపరిజ్ఞానం కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థుల ప్రాజెక్టులు, సి.ఎస్.సి. ప్రాజెక్టులు, పేమెంట్ సొల్యూషన్స్,.. రోబోలు, డ్రోన్లు, అటానమస్ బాట్స్, ఎ.ఆర్. /వి.ఆర్. సొల్యూషన్స్ వంటి సార్టప్ కంపెనీల సృజనాత్మక ప్రాజెక్టులు, ఇతర అంశాలను కూడా ప్రదర్శిస్తారు.
సృజనాత్మక సాంస్కృతిక విశేషంగా, ప్రధానమంత్రి కలలుగన్న ఆత్మనిర్భర భారత్ దార్శనికతను సాకారం చేసే ప్రధాన కార్యక్రమంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఈ వారం రోజుల వేడుకలు జరుగుతాయి.
ఈ కార్యక్రమాల వివరాలను ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. https://amritmahotsav.negd.in/
డిజిటల్ ఇండియా అధికారిక యూ ట్యూబ్ చానెల్ ద్వారా ఈ వేడుకలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు: https://www.youtube.com/DigitalIndiaofficial/
****
(Release ID: 1776020)
Visitor Counter : 168