పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
'మోడల్ రిటైల్ అవుట్‌లెట్ పథకం'ను ప్రారంభించిన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
Posted On:
27 NOV 2021 5:44PM by PIB Hyderabad
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 'మోడల్ రిటైల్ అవుట్‌లెట్ పథకం'ను ప్రారంభించాయి. దీనికి తోడు డిజిటల్ రూపంలో సంస్థల వినియోగదారుల నుండి ఫీడ్‌బ్యాక్‌ను పొందేందుకు గాను 'దర్పన్@పెట్రోల్‌పంప్' అనే డిజిటల్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ నెట్‌వర్క్‌లలో వినియోగదారుల సేవా ప్రమాణాలను మెరుగు పరచేందుకు మోడల్ రిటైల్ అవుట్‌లెట్‌లను ప్రారంభించేందుకు చేతులు కలిపాయి, వీటి ద్వారా ప్రతిరోజూ దాదాపు 6 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.ఈ కార్యక్రమాన్ని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు & గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి ప్రారంభించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు & కార్మిక మరియు ఉపాధి శాఖల సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖల కార్యదర్శి శ్రీ తరుణ్ కపూర్ సమక్షంలో శ్రీ హర్దీప్ సింగ్ పురి ఈ పథకాలను ప్రారంభించారు. వేగంగా మారుతున్న వినియోగదారుల ప్రవర్తనకు అనుగుణంగా మరియు రిటైల్ అవుట్‌లెట్‌లలో ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ కార్యక్రమాల ద్వారా ప్రామాణికమైన కస్టమర్ సౌకర్యాలను నిర్ధారించడానికి రిటైల్ అవుట్‌లెట్ ప్రమాణాలను బెంచ్‌మార్క్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకం దేశంలోని 70000కు పైగా రిటైల్ అవుట్‌లెట్‌ల యొక్క తీవ్రమైన 5 స్థాయిల మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ప్రధానమైన సేవలు, సౌకర్యాల పారమితలు అలాగే వినియోగదారుల సౌకర్యాల ప్రమాణాలు అందించనున్నాయి. ఉదాహరణకు శుభ్రమైన, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, వినియోగదారు కేంద్రంగా అందించే వినూత్న ఆఫర్లు మొదలైనవి ఇందులో ఉంటాయి. డిజిటల్ ఇండియా ఆవశ్యకతకు అనుగుణంగా విక్రయాల పనితీరు, అందించే సౌకర్యాలు మరియు విక్రయ సమయంలో డిజిటల్ లావాదేవీల శాతం ఆధారంగా రిటైల్ అవుట్‌లెట్‌లు 4 వర్గాలుగా విభజించబడ్డాయి. అత్యుత్తమ పని తీరు కనబరిచిన వారికి పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ద్వారా "శ్రేష్ఠ్" మరియు "ఉత్తమ్" అవార్డులు మరియు సంబంధిత చమురు కంపెనీలచే "రాజ్య సర్వ్ ప్రథమం" అవార్డులు అందజేయబడతాయి. డిజిటల్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కార్యక్రమం 'దర్పన్@పెట్రోల్‌పంప్', ఒక విశిష్టమైన, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించబడింది. దీని ద్వారా రిటైల్ అవుట్‌లెట్‌లలో సేవా ప్రమాణాలను పెంపొందించడంలో తమ విలువైన అభిప్రాయాన్ని అందించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తారు.
*****
(Release ID: 1775833)
Visitor Counter : 187