గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వన్ ధన్ యోజనతో నాగాలాండ్ గిరిజనులకు సాధికారత!


ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య తత్వాన్ని
పెంపొందిస్తున్న వోఖా వన్ ధన్ క్లస్టర్లు...

జున్.హెబోటో, వోఖా, త్యూన్సాంగ్, ఫెక్, మోకోక్చుంగ్ జిల్లాల్లో
తొమ్మిది వన్ ధన్ వికాస్ కేంద్రాల సేవలు

Posted On: 26 NOV 2021 11:14AM by PIB Hyderabad

  గిరిజనుల్లో ఔత్సాహిక వాణిజ్య, పారిశ్రామిక తత్వాన్ని ప్రోత్సహించడంలో నాగాలాండ్ రాష్ట్రం,.. దేశానికే ఆదర్శంగా నిలిచింది. సమూహ (క్లస్టర్) అభివృద్ధి, ఉత్పాదనలకు విలువల జోడింపు తదితర అంశాలు సమూహ సభ్యులకు ఎలా సహాయపడతాయో, వారు మరింత ఆదాయం సంపాదించేందుకు ఎలా దోహదపడతాయో వివరించడంలో యావద్దేశానికి నాగాలాండ్ ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రధానమంత్రి వన్ ధన్ యోజన (పి.ఎం.వి.డి.వై.) పథకం కింద అభివృద్ధి చేసిన పలు సమూహాలతో ఈ క్లస్టర్లను రూపొందించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్),..వివిధ రాష్ట్రాల ప్రభుత్వ శాఖల సహకారంతో ఈ క్లస్టర్లను ప్రవేశపెట్టింది. పెట్టుబడి సహాయం అందించడం, శిక్షణ ఇవ్వడం, వారిని కార్యోన్ముఖం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గిరిజనులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పి.ఎం.వి.డి.వై. పథకాన్ని రూపొందించారు. గిరిజనులు తమ వాణిజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ పథకం తీసుకువచ్చారు.

https://ci6.googleusercontent.com/proxy/Y7QN8-RQo15wV2UaUeQ7wH-H2G33UrvHx13iEYVMDdvJIO5i_Hzv_10eB6R6Mkrzt7AjAiZ-ahQ5yEFqerkAPeSWfjWCD7kC6GBcbdoZl0QHZ1pUat3mxv0ojw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C3GI.jpg

నాగాలాండ్.లోని నోక్లక్ జిల్లానుంచి,  #పి.ఎం.వన్ ధన్ యోజన విజయగాథ... తేనె, తేనెగూళ్ల మైనం ఉత్పత్తిలో గిరిజనులు సాధించిన విజయమిది. నాగాలాండ్.లో వన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేయడంలో నాగాలాండ్ తేనెటీగల పెంపకం, తేనె పథకం (ఎన్.బి.హెచ్.ఎం.) ఎంతో దోహదపడింది.

#AmritMahotsav https://t.co/PE5WI6ySDG

— పి.ఐ.బి. గిరిజన వ్యవహారాలు (@PIB_MoTA) నవంబరు 24, 2021

నాగాలాండ్.లోని వోఖా జిల్లాకు చెందిన చుకితాంగ్ నుంచి #పి.ఎం. వన్ ధన్ Yయోజన విజయగాథ. వోఖా జిల్లాలోని వన్ ధన్ క్లస్టర్ అడవి తేనె, ఉసిరి, మాచికాయ, అల్లం, పసుపు, కొండచీపుర్లు, ఓస్టెర్ పుట్టగొడుగులు వంటి ఉత్పత్తులను ఈ వన్ ధన్ క్లస్టర్ ఉత్పత్తి చేస్తోంది. చిన్న తరహా అటవీ ఉత్పత్తులుగా వీటిని తయారు చేస్తున్నారు. క్లస్టర్.లోని 5,700మంది సభ్యులు దీనితో

 ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. #AmritMahotsavhttps://t.co/yxp01YJrrw

— పి.ఐ.బి. గిరిజన వ్యవహారాలు (@PIB_MoTA) నవంబరు 24, 2021

-------------------------------------------------------------------------------------------------------

నాగాలాండ్ రాష్ట్రంలో తేనె ఉత్పత్తికి ఎన్.బి.హెచ్.ఎం. సంస్థ, ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. పైన ఉదహరించిన క్లస్టర్లకు సంబంధించి పథకం అమలు ప్రక్రియను పర్యవేక్షించే ఏజెన్సీగా ఎన్.బి.హెచ్.ఎం. పనిచేస్తోంది. తొలిదశలో కేవలం తేనెటీగల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే వన్ ధన్ యోజన కార్యక్రమాన్ని అమలు చేసింది. తొలుత నాలుగు జిల్లాల్లో, 5 వన్ ధన్ వికాస్ కేంద్రాల సమూహాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. తేనె ఉత్పత్తి అనేది కేవలం ఒక సీజన్లో జరిగే వ్యాపకం కావడంతో సీజన్ కానపుడు వన్ ధన్ స్వయం సహాయక గ్రూపుల సభ్యులు ఏమీ పనిలేకుండా గడిపేవారు. ఈ నేపథ్యంలో వన్ ధన్ వికాస్ కేంద్రాల సమూహాలను సంవత్సరమంతా తీరికలేకుండా పనుల్లో నిమగ్నం చేసేందుకు ఇతర చిన్న తరహా అటవీ ఉత్పత్తుల ఉత్పాదనకోసం ఒక కార్యక్రమాన్ని ఎన్.బి.హెచ్.ఎం. రూపొందించింది. కొండచీపుర్లు, అల్లం, ఓస్టెర్ పుట్టగొడుగులు, మాచికాయలు వంటివాటి ఉత్పత్తిలో సభ్యులను నిమగ్నం చేసింది. నిజానికి,.. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో కొన్ని స్వయం సహాయక గ్రూపులతో ప్రయోగాత్మకంగా ఓస్టెర్ పుట్టగొడుగుల సాగు మొదలైంది. ఫలితాలను బట్టి, ఈ సాగును విస్తృత స్థాయిలో చేపట్టాలని ఎన్.బి.హెచ్.ఎం. నిర్ణయించుకుంది. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి జరగడం, మార్కెటింగ్ సదుపాయాలకు అవకాశాలు ఏర్పడటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వన్ ధన్ వికాస్ కేంద్రాల సమూహాలు ఇపుడు చాలా విస్తృత స్థాయి ఓస్టెర్ పుట్టగొడుగులను సాగు చేస్తున్నాయి. రానున్న కొన్ని నెలల్లోనే గులాబి, తెలుపు రంగుల రకాల ఓస్టెర్ పుట్టగొడుగులు దాదాపు 5 మెట్రిక్ టన్నుల వరకూ ఉత్పత్తి కావచ్చని అంచనా.

https://ci5.googleusercontent.com/proxy/kZkWcbK7Qi63ZdCUfPNsQxjqqD3yvG2SS6AvlypKZm4IyzPJCNT98Ks0NA-97eNG-MaIr9NKvOVgoyAQaj50MLnFov68YX5wYy_0LTnzgz-st0uptot9GQEF_g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ACGL.jpg

    ట్రైఫెడ్ చేస్తున్న కృషి, కనీస మద్దతు ధర పథకం ద్వారా చిన్న తరహా అటవీ ఉత్పత్తులకోసం రూపొందించిన మార్కెటింగ్ యంత్రాంగం, చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు విలువల జోడింపు వ్యవస్థ.. ఇవన్నీ గిరిజన జీవన పరిస్థితుల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి. దీనితో అటవీ ఉత్పత్తుల సేకరణ రూ. 30కోట్లనుంచి 1,843కోట్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులను, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వినియోగించుకోవడంతో ఇది సాధ్యమైంది. ఇదే పథకంలో భాగంగా వన్ ధన్ ట్రైబల్ స్టార్టప్ కంపెనీలు కూడా ఆవిర్భవించాయి.  గిరిజన సమూహాలకు, అటవీ వాసులకు, ఇళ్లలో గడిపే గిరిజన పనివారికి,. ఉపాధి వనరులుగా ఇవి రూపుదిద్దుకున్నాయి.

  కేవలం ఒక్క నాగాలాండ్ రాష్ట్రంలోనే, 285 వన్ ధన్ స్వయం సహాయక బృందాలు, 19 వన్ దన్ వికాస కేంద్రాల సమూహాలు (వి.డి.వికె.లు)గా రూపుదాల్చాయి. వాటిలో 9 వి.డి.వి.కె.లను (అంటే 135 వన్ ధన్ స్వయం సహాయక బృందాలను) ఉత్పత్తి కార్యకలాపాలకోసం కార్యోన్ముఖం చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలోని జున్.హెబోటో, వోఖా, త్యూన్సాంగ్, ఫెక్, మోకోక్చుంగ్ జిల్లాల పరిధిలో ఇవి తమ సేవలందించాయి. అడవి తేనె, ఉసిరి ఉత్పత్తులు, మాచికాయలు, జాంతోజైలమ్, ఎర్ర గోంగూర, అల్లం, పసుపు, కొండ చీపుర్లు, ఓస్టెర్ పుట్టగొడుగులు వంటి ఉత్పత్తులను వన్ ధన్ వికాస్ కేంద్రాల సమూహాలు ఇపుడు ఉత్పత్తి చేస్తున్నాయి. చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు విలువల జోడింపు ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యకలాపాలతో 5,700మంది గిరిజన సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇప్పటివరకూ, రూ. 35.32 లక్షల వరకూ అమ్మకాలు జరిగాయి. తద్వారా నాగాలాండ్.లోని గిరిజన కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి, సాధికారతకు వన్ ధన్ వికాస కేంద్రాల సమూహాలు ఎంతగానో కృషిచేస్తున్నాయి.

  ఇక వన్ ధన్ గిరిజన స్టార్టప్ కంపెనీలు కూడా గిరిజనుల ఉపాధి కల్పనకు తగిన మార్గాలుగా ఆవిర్భవించాయి. తొలి వన్ ధన్ కేంద్రాన్ని 2018 ఏప్రిల్ 14వ తేదీన చత్తీస్ గఢ్.లోని బిజాపూర్.లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గిరిజనుల ఉత్పత్తులకు విలువల జోడింపు కేంద్రంగా దీనికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత కేవలం రెండేళ్లలోగానే, 37,362 వన్ ధన్ స్వయం సహాయక బృందాలు, 2,240 వన్ ధన్ వికాస్ కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. ఒక్కొక్క వన్ ధన్ వికాస కేంద్రానికి  300మంది చొప్పున అటవీ నివాసులను ట్రైఫెడ్ కేటాయించింది. వన్ ధన్ యోజన పథకం ప్రారంభమైననాటినుంచి, గిరిజన సాధికారతకోసం ట్రైఫెడ్ ఎంతో కృషి చేసింది. దాదాపు 50,000 వన్ ధన్ స్వయం సహాయక బృందాల ఏర్పాటుకోసం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఒక ఉద్యమం తరహాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ట్రైఫెడ్, గత అక్టోబరు 15వ తేదీన ఒక మైలురాయిని అధిగమించింది. ఆ రోజున, ఏకంగా 50,000 వన్ ధన్ స్వయం సహాయక బృందాలను మంజూరు చేసింది. ప్రస్తుతం వీటి సంఖ్య 52,976కు చేరుకుంది. అవన్నీ 3,110 వన్ ధన్ వికాస కేంద్రాల సమూహాలుగా రూపొంతరం చెందాయి.

  గిరిజన జీవన పరిస్థితులను మెరుగు పరిచే ఒక వెలుగు రేఖగా, మార్పునకు నిదర్శనంగా ఈ పథకం ఇప్పటికే తగిన ఫలితాలను అందించింది. గిరిజనుల ఉపాధి కల్పనకు ప్రధాన వనరుగా నిలిచింది. విలువల జోడింపు ద్వారా జరిగే అటవీ ఉత్పత్తుల అమ్మకాలతో ఆదాయం నేరుగా గిరిజనులకు చేరే ఏర్పాటు ఉండటమే ఈ పథకం గొప్పతనం.

 

***


(Release ID: 1775475) Visitor Counter : 190