గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశం రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకుంటున్న వేళ గిరిజ‌న సంక్షేమంపై ప్ర‌త్యేక దృష్టి


పిఇఎస్ ఎ, అమ‌లును బ‌లోపేతం చేయాల్సిందిగా పిలుపు, అట‌వీ హ‌క్కుల చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్న జ‌మ్ము కాశ్మీర్‌

Posted On: 26 NOV 2021 11:43AM by PIB Hyderabad

షెడ్యూలు తెగ‌ల వారు జాతీయ ప్రధాన స్రవంతిలో చేరడానికి వీలుగా వివిధ రంగాలలో షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను , హక్కులను పరిరక్షించడానికి వారిని ప్రోత్సహించడానికి రాజ్యాంగంలో అనేక నిబంధనలు పొందుపరచబడ్డాయి.  దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 75 వ‌సంతాలకు గుర్తుగా ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్  ఉత్సవాలు జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో  గిరిజ‌న సంక్షేమం, గిరిజ‌నుల‌కు సంబంధించిన రాజ్యాంగ నిబంధ‌న‌ల అమ‌లుపై మ‌రింత ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం జ‌రుగుతోంది.
 రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 46 కింద రాజ్యం స‌మాజంలోని బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌త్యేకించి షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల ప్ర‌జ‌ల విద్య‌, ఆర్ధిక ప్ర‌యోజ‌నాలను ప్రత్యేక శ్ర‌ద్ధ‌తో ప్రోత్స‌హించ‌వ‌ల‌సి ఉంది. అలాగే వారికి అన్యాయం జ‌ర‌గ‌కుండా వారు ఏ ర‌క‌మైన దోపిడీకి గురికాకుండా వారిని ర‌క్షించ‌వ‌ల‌సి ఉంది.
రాజ్యాంగంలోని ఆర్ఘిక‌ల్ 15 (4) కింద విద్యా సంస్థ‌ల‌లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం జ‌రిగింది. అలాగే రాజ్యాంగంలోని ఆర్ఠిక‌ల్ 16 (4),16(4ఎ) , 16 (4 బి)  కింద పోస్టులు, స‌ర్వీసుల‌లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం జ‌రిగింది.

మాన‌వ అక్ర‌మ ర‌వాణాను , భిక్షాట‌న‌ను , ఇత‌ర రూపాల‌లోని బ‌ల‌వంతపు చాకిరీని  ఆర్టిక‌ల్ 23 నిషేదం విధిస్తున్న‌ది. షెడ్యూలు తెగ‌ల విష‌యంలో దీనికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంది. వెట్టిచాకిరీ నిర్మూల‌న చ‌ట్టం 1976ను పార్ల‌మెంటు తీసుకువ‌చ్చింది. అలాగే 14 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌ను ఏదైనా ఫ్యాక్ట‌రీ, గ‌నుల‌లో, లేదా ప్ర‌మాద‌క‌ర కార్య‌క‌లాపాల‌లో ప‌నికి కుదుర్చుకోవ‌డాన్ని ఆర్టిక‌ల్ 24 నిషేధిస్తున్న‌ది. షెడ్యూలు తెగ‌ల వారి విష‌యంలో ఇది కూడా ఎంతో కీల‌క‌మైన‌ది.
షెడ్యూల్డు తెగ‌ల‌కు పంచాయ‌తీల‌లో రిజ‌ర్వేష‌న్ల‌ను రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 243 డి క‌ల్పిస్తుంది.
ఆర్టిక‌ల్ 330 పార్ల‌మెంటోలో షెడ్యూలు తెగ‌ల‌కు సీట్ల రిజ‌ర్వేష‌న్ కు వీలు క‌ల్పిస్తుంది.
రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల‌లో షెడ్యూలు తెగ‌ల‌కు ఆర్టిక‌ల్  332 రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తుంది.

ఆర్టిక‌ల్ 334 కింద షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగ‌ల‌కు లోక్‌స‌భ‌, విధాన స‌భ‌ల‌లో (ఆంగ్లో ఇండియ‌న్ క‌మ్యూనిటీకి లోక్‌స‌భ‌,రాష్ట్రాల విధాన స‌భ‌ల‌లో నామినేట్ చేయ‌డం ద్వారా)  2020 జ‌న‌వ‌రి వ‌ర‌కు ప్రాతినిధ్యం  క‌ల్పింప‌బ‌డుతుంది.
రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 244 కింద ప్ర‌త్యేక ర‌క్ష‌ణ‌లు క‌ల్పించ‌బ‌డ్డాయి. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూళ్ల‌లో ప్రొవిజ‌న్లు ఉన్నాయి.
అట‌వీప్రాంతంలోని వారి హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు 2016లో షెడ్యూలు తెగ‌లు, ఇత‌ర సంప్ర‌దాయంగా అట‌వీ ప్రాంత నివాసితుల( అట‌వీ హ‌క్కుల గుర్తింపు ) చ‌ట్టం 2006 (ఎఫ్‌.ఆర్‌.ఎ)ని తీసుకు రావ‌డం జ‌రిగింది. ఎఫ్‌.ఆర్‌.ఎ చ‌ట్టాన్ని గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ అమ‌లు చేస్తుంది.ఇది త‌ర‌త‌రాలుగా అట‌వీ ప్రాంతంలో నివ‌శిస్తున్న తెగ‌ల హ‌క్కుల‌ను పరిరక్షిస్తుంది.  ఇది అట‌వీ హ‌క్కుల‌ను రికార్డు చేసేందుకు ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను క‌ల్పిస్తుంది. అలాగే ఇలాంటి గుర్తింపు పొందేందుకు అవ‌స‌ర‌మైన సాక్ష్యాల‌ను  రికార్డు చేసేందుకు ఫ్రేమ్ వ‌ర్క్ కలిగి ఉంటుంది. ఈ చ‌ట్టం 1-1-1008 నాటి నోటిఫికేష‌న్ లో పొందుప‌ర‌చిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అమ‌లులోకివ‌చ్చింది.2014 మే నుంచి 2021 ఆగ‌స్టు వ‌ర‌కు 5,03,709 క్లెయిమ్‌లు ( వ్య‌క్తిగ‌తం 4,36,644, క‌మ్యూనిటీ 67,065 క్లెయిమ్‌లు) స్వీక‌రించ‌డం జ‌రిగింది.  5.65,515 టైటిల్స్ (వ్య‌క్తిగ‌తం 5,11,681 టైటిల్స్‌,క‌మ్యూనిటీ ప‌రంగా 53,834 టైటిల్స్ పంపిణీ చేయ‌డం జ‌రిగింది.

ఈ చ‌ట్టం అమ‌లులో క్షేత్ర‌స్థాయ‌లో మ‌రింత మెరుగైన స‌మ‌న్వ‌యం  ఉండేందుకు గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ‌శాఖ‌తో క‌లిసి కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించి ఉమ్మ‌డి అంశాల‌ను గుర్తించ‌నుంది.ఇలాంటి స‌మ‌న్వ‌యానికి గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌, అట‌వీ , ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ‌శాఖ 2021 జూలై 6న సంయుక్తంగా ఒక లేఖ‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు పంపాయి. అట‌వీ హ‌క్కుల గుర్తింపు, వాటిని క‌ల్పించ‌డానికి సంబంధించి చ‌ట్టం స‌త్వ‌ర అమ‌లుకు అట‌వీ విభాగం ఉన్న‌త స్థాయి మ‌ద్ద‌తు నివ్వ‌వ‌ల‌సి ఉంటుంద‌ని పేర్కొంది.

పంచాయ‌త్ (షెడ్యూలు ఏరియాల‌విస్త‌ర‌ణ‌)చ‌ట్టం, 1996 (పిఇఎస్ఎ)ను కేంద్ర ప్ర‌భుత్వం  షెడ్యూలు ప్రాంతాల‌లో నివ‌శిస్తున్న ప్ర‌జ‌ల‌కు స్వ‌యం పాల‌న‌కు గ్రామ స‌భ‌ల ద్వారా స్వ‌యం పాల‌న‌కు వీలు క‌ల్పించేందుకు దీనిని తీసుకువ‌చ్చింది. దీనిని భార‌త‌ప్ర‌భుత్వానికి చెందిన పంచాయ‌తి రాజ్ మంత్రిత్వ‌శాఖ అమ‌లు చేస్తోంది. ఇది గిరిజ‌న క‌మ్యూనిటీల హ‌క్కుల‌ను చ‌ట్ట‌బ‌ద్దంగా గుర్తిస్తుంది. షెడ్యూలు ఏరియాలోని ప్ర‌జ‌లు త‌మ పాల‌న‌ను తామే నిర్వ‌హించుకునేందుకు , వారి సంప్ర‌దాయ హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు స‌హ‌జ‌వ‌న‌రుల‌పై వారి సంప్ర‌దాయ హ‌క్కుల‌ను కాపాడేందుకు ఉప‌క‌రిస్తుంది. ఈ ల‌క్ష్యానికి అనుగుణంగా పిఇఎస్ ఎ గ్రామ‌స‌భ‌కు అధికారాల‌ను క‌ల్పిస్తున్న‌ది. ఈ చ‌ట్టం ల‌క్ష్యాల‌కు అనుగుణంగా అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల ఆమోదం, అమ‌లులో గ్రామ‌స‌భ కు పిఇఎస్ె అధికారాల‌ను క‌ల్పిస్తున్న‌ది.

పంచాయితీలు (షెడ్యూల్డ్ ఏరియా విస్త‌ర‌ణ )చ‌ట్టం 1996 లోని ప్రొవిజ‌న్ల‌పై ఒక రోజు జాతీయ స‌ద‌స్సును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. 75 వ‌సంతాల ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ ,  పెసా చ‌ట్టం తీసుకువ‌చ్చి 25 సంవత్స‌రాలు అయిన సంద‌ర్బంగా  పంచాయ‌తి రాజ్ మంత్రిత్వ‌శాఖ గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌, నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డ‌వ‌ల‌ప్‌మెంట్‌, పంచాయ‌తిరాజ్  ఆధ్వర్యంలో జాతీయ స‌ద‌స్సును న‌వంబ‌ర్ 18న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ స‌ద‌స్సును గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తి రాజ్ శౄఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు. కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ మొండా, పంచాయ‌తి రా్ శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ క‌పిల్ మోరేశ్వ‌ర్ పాటిల్‌, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ భ‌గ‌త్‌సింగ్ కోషియారి  ఈ స‌ద‌స్సులోని వారినుద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌స్తుతం  ఆరు రాష్ట్రాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలు పెసా నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేశాయి. ఈ స‌ద‌స్సులో నాలుగు రాష్ట్రాలు, చ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్‌, మ‌ధ్య‌ప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాల‌ను పెసాను అమ‌లు చేయాల్సిందిగా కోర‌డం జ‌రిగింది. పంచాయ‌తిరాజ్ , గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ కేంద్ర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. చ‌ట్టం అమ‌లులో ఎదురౌతున్న ఇబ్బందుల‌ను , వివిధ రాష్ట్రాలు అమ‌లు చేస్తున్న అత్యుత్త‌మ విధానాల‌ను ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు.

జ‌మ్ము కాశ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంః
షెడ్యూలు తెగ‌లు, ఇత‌ర సంప్ర‌దాయ ఆవాసం క‌లిగిన వారి (హ‌క్కుల ర‌క్ష‌ణ‌) చ‌ట్టాన్ని 2020 డిసెంబ‌ర్ లో జ‌మ్ముకాశ్మీర్‌లో అమ‌లుకు నోటిఫై చేయ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. దీనిని 2021 సెప్టెంబ‌ర్ 13న జ‌మ్ములో లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ శ్రీ మ‌నోజ్ సిన్హా శ్రీ‌న‌గ‌ర్‌లో , 2021 సెప్టెంబ‌ర్ 18న జ‌మ్ములో ప్రారంభించారు. 2600 మందికిపైగా వ్య‌క్తుల‌కు సంబంధించి అలాగే క‌మ్యూనిటీ హ‌క్కుల‌కు సంబంధించి అధికారులు వారికి హక్కులు క‌ల్పించారు. దీనివ‌ల్ల 7000 మంది గిరిజ‌న కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం జ‌రిగింది. కేంద్ర పాలిత ప్రాంతం లోని గిరిజ‌న సంక్షేమ విభాగ‌వంద్ద 20 వేల ద‌ర‌ఖాస్తులు వివిధ ద‌శ‌ల‌లో త‌మ హ‌క్కుల కోసం పెండింగ్ లో ఉన్నాయి.

పంచాయ‌తి రాజ్ సంస్థ‌ల‌కు చెందిన ఎస్‌టి ప్ర‌తినిధుల‌కు శిక్ష‌ణః
గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ రాష్ట్ర టిఆర్ ఐ స‌మ‌న్వ‌యంతో ఈ చ‌ట్టాల అమ‌లుకు బాధ్యులైన రాష్ట్ర‌ప్ర‌భుత్వ అధికారుల‌కు, పంచాయ‌తిరాజ్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ది. రాజ్యాంగ ప‌రంగా వారికి గ‌ల హక్కుల‌ను తెలియ‌జేసేందుకు ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వెబ్ సైట్ (tribal.nic.in), మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప‌నితీరుకు సంబంధించిన డాష్ బోర్డు (dashboard.tribal.gov.in) గిరిజ‌నుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌లుఉ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను,  రాజ్యాంగ‌ప‌రంగా వారి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తున్నాయి. స్వాతంత్రం సాధించిన 75 సంవ‌త్స‌రాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హిస్తున్న‌ ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న వివిధ కార్య‌క్ర‌మాల‌ను  మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఆది- ప్ర‌సార‌ణ్ (adiprasara.tribal.gov.in)  పోర్ట‌ల్‌లో చూడ‌వ‌చ్చు.

 

***

 


(Release ID: 1775471) Visitor Counter : 319