పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన.
ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంత పారిశ్రామిక మౌలిక సదుపాయాల సమగ్రాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వస్తూత్పత్తి, ఎగుమతులకు ప్రోత్సాహం
Posted On:
25 NOV 2021 4:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి నవంబరు 25 న శంకుస్థాపన చేశారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుధ నగర్ జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA)ప్రాంతంలోని జెవార్ వద్ద 1334 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రణాళిక రచించారు. విమానాశ్రయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 72 కి.మీ, నోయిడా నుండి 52 కి.మీ, ఆగ్రా నుండి 130 కి.మీ మరియు దాద్రీలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ నుండి 90 కి.మీ.ల దూరంలో ఉంది.
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL). వివిధ ప్రభుత్వ రంగసంస్థల సంయుక్త నిర్మాణం లో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. కంపెనీలో యూపీ ప్రభుత్వవాటా 37.5 శాతం. ఇతర వాటాదారులు నోయిడా - 37.5 శాతం, గ్రేటర్ నోయిడా - 12.5 శాతం YEIDA - 12.5 శాతం. (YEIDA ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ అభివృద్ధికి నియమించిన నోడల్ విభాగం.)
ప్రణాళిక ప్రకారం ప్రాజెక్ట్ 4 దశల్లో పూర్తవ్వాలి. మొదటి దశలో సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్రయాణికులకు సౌలభ్యం అయ్యేటట్లు 29.9.2024 తేదీ నుండి 1095 రోజులలోపు పని పూర్తి అయ్యేట్టు, కార్యాచరణను ప్రారంభించాలి.
విమానాశ్రయానికి కేటాయించిన అన్ని దిశల నుంచి అనువైన మార్గాల అనుసంధానంగా వ్యూహాత్మకంగా ఉంది. గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రాను కలుపుతూ 100 మీటర్లరహదారి యమునా ఎక్స్‌ప్రెస్ వే ఒకవైపు, మరోవైపు 100 మీటర్ల వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే పాల్వాల్, మనేసర్, ఘజియాబాద్, బాగ్‌పట్, మీరట్‌లను కలుపుతూ ఫార్ములా-1 ట్రాక్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వెళుతుంది.
జేవార్ విమానాశ్రయం కోసం అన్ని అనుమతులు మరియు లభించాయి. భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్ట్ రాయితీ ఒప్పందంపై 7 అక్టోబర్, 2020న సంతకం అయింది. 10 ఆగస్టు, 2021న ఆర్థిక అనుమతులు తో పాటు విమానాశ్రయం అభివృద్ధికి నిర్మాణ ప్రణాళిక ఆమోదం పొంది, నిర్వాసితులకు పునరావాసం ప్రక్రియ పూర్తయింది.
ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ అమలు ద్వారా, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సమగ్రాభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తయారీ ఎగుమతులకు అనుకూలమౌతుంది. ఈ విమానాశ్రయం టూరిజంలో వేగవంతమైన వృద్ధితో పాటు విమాన రాకపోకలకు వీలుగా ఉంటుంది.
***
(Release ID: 1775285)
Visitor Counter : 145