వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ లో భాగంగా, మేక్ ఇన్ ఇండియా- బొమ్మ‌ల‌తో సురక్షిత ఆట‌లు పేరుతో వెబినార్ నిర్వ‌హించిన బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్.


పిల్ల‌ల‌లో వివిధ వ‌య‌సుల వారిలో అభ్య‌స‌న సామ‌ర్ధ్యాలు పెంచ‌డంలో ఆట‌బొమ్మ‌లు, వాటి డిజైన్ల ప్రాధాన్య‌త‌ను వివరించిన వ‌క్త‌లు
ఆట‌బొమ్మ‌ల సుర‌క్షిత‌త్వం,వాటి ర‌క్ష‌ణ వంటి అంశాల‌ను కూడా ఈ వెబినార్ లో చ‌ర్చించ‌డం జ‌రిగింది.

ఆట బొమ్మ‌ల రంగంలో నిబంధ‌న‌లు, భార‌తీయ ప్ర‌మాణాల బ్యూరో ప్ర‌మాణాలు, వాటి ప్ర‌మాణీక‌ర‌ణ గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింది.

Posted On: 25 NOV 2021 9:36AM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని , 75 సంవ‌త్స‌రాల భార‌త‌దేశ ప్ర‌గ‌తి, ఇక్క‌డి ప్ర‌జ‌ల విశిష్ఠ‌సంస్కృతి, వారు సాధించిన విజ‌యాల‌కు గుర్తుగా భార‌త ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. ఆజాదీకా అమృత్ హోత్స‌వ్‌@ 75 లో బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ కూడా పాలుపంచుకుంటున్న‌ది. ఇందుకు అనుగుణంగా ఈ సంస్థ సెమినార్లు, వెబినార్ల‌ను వివిధ అంశాల‌పై నిర్వ‌హిస్తున్న‌ది.
ఈ సెమినార్లు, వెబినార్ల‌లో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్, మేక్ ఇన్ ఇండియా- ప్లేయింగ్ సేఫ్ విత్ టాయిస్ అనే అంశంపై 2021 నవంబ‌ర్ 23న  వెబినార్ నిర్వ‌హించింది.

 ఈ వెబ‌నార్‌లో ఆట‌బొమ్మ‌ల త‌యారీదారులు, ఫిక్కీ, టిఎఐటిఎంఎ, టిఎఐ త‌దిత‌ర సంస్థ‌లు, ఎన్‌.ఐ.డి, విట్ట ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌, సిఎస్ ఐఆర్‌-ఐఐటిఆర్‌, ప‌రీక్షా ప్ర‌యోగశాల‌లైన టియువి, ఐఆర్ ఎం ఎ , ఎస్ జిఎస్ తోపాటు ప‌లు సంస్థ‌లు పాల్గొన్నాయి.

 

ఆట‌బొమ్మ‌ల త‌యారీలో, ఆట‌ల‌లో వాటి డిజైన్ల ప్రాధాన్య‌త గురించి వ‌క్త‌లు వివ‌రించారు. అలాగే పిల్ల‌లో అభ్య‌స‌న సామ‌ర్థ్యాల‌ను పెంపొందించ‌డంలో వాటి పాత్ర ను వివ‌రించారు. అలాగే ఆట‌బొమ్మ‌ల ప‌రీక్షలోసేఫ్టీ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలన్నారు.


ఈ వెబినార్ లో బొమ్మ‌ల త‌యారీలో ప్ర‌మాణాల స్థిరీక‌ర‌ణ‌, బిఐఎస్ ప్ర‌మాణాలు, ఆట‌బొమ్మ‌ల రంగంలో నిబంధ‌న‌లు, దేశంలో త‌యారైన బొమ్మ‌ల ఎగుమ‌తులు, ఆట‌బొమ్మ‌ల తయారీలో ఇటీవ‌లి కాలంలో వ‌చ్చిన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, ఆధునిక పోక‌డ‌లు వంటి అంశాల‌ను ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు.

 

***

 


(Release ID: 1774992) Visitor Counter : 165