ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఈక్వలైజేషన్ లెవీ-2020'పై పరివర్తన విధానం అవ‌లంభించేందుకు భార‌త్‌, అమెరికా అంగీకారం

प्रविष्टि तिथि: 24 NOV 2021 6:01PM by PIB Hyderabad

ఆర్థిక వ్యవస్థ యొక్క డిజిటలైజేషన్  వ‌ల‌న ఉత్పన్నమయ్యే పన్ను సవాళ్ల విష‌య‌మై రెండు స్తంభాల (టు పిల్ల‌ర్‌) పరిష్కారానికి గాను భార‌త్‌, యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ఒక‌  ఒప్పందం కుదుర్చుకున్నాయి. అక్టోబర్ 8, 2021న, భారత్‌, యునైటెడ్ స్టేట్స్ ఓఈసీడీ/జీ20 ఇన్‌క్లూజివ్ ఫ్రేమ్‌వర్క్‌లోని (ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా) 134 ఇతర సభ్యులతో కలిసి రెండు స్తంభాల (టు పిల్ల‌ర్‌) పరిష్కారంపై ప్రకటనపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అక్టోబర్ 21, 2021న, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్ పిల్లర్-1ని అమలు చేస్తున్నప్పుడు.. ఇప్పటికే ఉన్న ఏకపక్ష చర్యలకు పరివర్తన విధానంపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం స‌ద‌రు తేదీన ఆ ఆరు దేశాలు జారీ చేసిన ఉమ్మడి ప్రకటనను ప్రతిబింబిస్తుంది ("అక్టోబర్ 21 ఉమ్మడి ప్రకటన").  ఈ-కామర్స్ సేవల సరఫరా మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క వాణిజ్య చర్యపై భారత దేశం యొక్క 2 శాతం ఈక్వలైజేషన్ లెవీకి సంబంధించి అక్టోబర్ 21 జాయింట్ స్టేట్‌మెంట్ కింద వర్తించే అదే నిబంధనలను ఈక్వలైజేషన్ లెవీకి సంబంధించి. యునైటెడ్ స్టేట్స్, భారతదేశం మధ్య వర్తింపజేయాలని ఇరు దేశారు అంగీకరించాయి. ఏదేమైనప్పటికీ, మధ్యంతర కాలం 1 ఏప్రిల్ 2022 నుండి పిల్లర్ వన్ అమలు వరకు లేదా 31 మార్చి 2024 వరకు, ఏది ముందుగా అయితే అది వర్తించబడుతుంది. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ సంబంధిత కట్టుబాట్లపై ఉమ్మడి అవగాహన ఉండేలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి.నిర్మాణాత్మక చర్చల ద్వారా ఈ విషయంపై ఏవైనా అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి. ఒప్పందం యొక్క చివరి నిబంధనలు 1 ఫిబ్రవరి 2022 నాటికి ఖరారు చేయబడతాయి.
                                                                           

****


(रिलीज़ आईडी: 1774852) आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada