హోం మంత్రిత్వ శాఖ

కేంద్రపాలిత ప్రాంతం దాద్ రా & నగర్ హవేలీ మరియు దమన్ & దీవ్ లో విద్యుత్తు పంపిణీ, రిటైల్ సప్లయ్ బిజినెస్ ల ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 24 NOV 2021 3:44PM by PIB Hyderabad

కేంద్ర పాలిత దాద్ రా & నగర్ హవేలీ మరియు దమన్ & దీవ్ (డిఎన్ హెచ్ & డిడి) లో విద్యుత్తు పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేటు పరం చేయడం కోసం ఒక కంపెనీ ని (స్పెశల్ పర్పస్ వెహికల్) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారు కు కొత్త గా ఏర్పాటైన కంపెనీ తాలూకు ఎక్విటి శేర్ లను విక్రయించడం తో పాటు ఉద్యోగుల బాధ్యతల ను నెరవేర్చడం కోసం ట్రస్టు ( ట్రస్టు ల) ఏర్పాటు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్రస్తావిత ప్రైవేటీకరణ ప్రక్రియ, డిఎన్ హెచ్ & డిడి కి చెందిన 1.45 లక్షల కు పైగా వినియోగదారుల కు ఉత్తమ సేవల ను అందించడమే కాక పంపిణీ లో కార్యకలాపాల పరం గా కార్య కుశలత సంబంధి వాంఛనీయ పరిణామాలను పూర్తి చేస్తుంది. దేశం అంతటా ఇతర సేవా ప్రదాత కంపెనీల కై అనుకరించడానికి వీలు ఉండేటటువంటి ఒక నమూనా ను ప్రసాదిస్తుంది. దీని ద్వారా విద్యుచ్ఛక్తి పరిశ్రమ లో పోటీ మరింత పెరుగుతుంది కూడా. విద్యుత్తు పరిశ్రమ కు బలం అందుతుంది. దీనికి అదనం గా, బకాయి పడ్డ ధనరాశి ని వసూలు చేసుకోవడం లో సైతం తోడ్పాటు లభిస్తుంది.

నిర్మాణాత్మకమైన సంస్కరణ ల మాధ్యమం ద్వారా భారతదేశాన్ని స్వయంసమృద్ధం గా తీర్చిదిద్దడం కోసం భారత ప్రభుత్వం 2020వ సంవత్సరం మే నెల లో ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ను ప్రకటించింది. విద్యుత్తు పంపిణీ సేవా ప్రదాత కంపెనీ ల ప్రైవేటీకరణ మార్గం లో ముందుకుపోతూ కేంద్ర పాలిత ప్రాంతాల లో విద్యుత్తు పంపిణీ, ఇంకా రిటైల్ సప్లయ్ లను మెరుగుపరచడం అనేది సంస్కరణల పరం గా ప్రముఖమైన ఉపాయాల లో ఒకటి గా ఉంది. దీని ద్వారా విద్యుత్తు వితరణ లో ప్రైవేటు రంగాని కి ఉన్నటువంటి దక్షత తాలూకు ప్రయోజనాల ను పొందడం వీలుపడుతుంది.

పూర్ణ యాజమాన్యం ప్రభుత్వాని కి ఉండేటట్లు ఒక సింగల్ డిస్ట్రిబ్యూశన్ కంపెనీ ని డిఎన్ హెచ్-డిడి పవర్ డిస్ట్రిబ్యూశన్ కార్పొరేశన్ లిమిటెడ్ పేరు తో నెలకొల్పడం జరుగుతుంది. అలాగే కొత్త గా ఏర్పాటు చేసిన కంపెనీ లోకి బదిలీ అయ్యే ఉద్యోగుల సేవ ల, ప్రయోజనాల నిర్వహణ కు గాను ట్రస్టు (ట్రస్టు ల) ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాద్ రా & నగర్ హవేలీ మరియు దమన్ & దీవ్ విద్యుత్తు (పునర్ వ్యవస్థీకరణ మరియు సంస్కరణ ల) బదిలీ పథకం, 2020 ప్రకారం కొత్త గా ఏర్పాటు అయిన కంపెనీ కి ఆస్తుల ను, అప్పుల ను, ఉద్యోగులు మొదలైన వాటి ని బదిలీ చేయడం జరుగుతుంది.

 

****



(Release ID: 1774740) Visitor Counter : 160