ఆర్థిక మంత్రిత్వ శాఖ

జమ్మూలో 145 మంది లబ్ధిదారులకు రూ.306 కోట్ల విలువ చేసే రుణ మంజూరు లేఖలను అందజేసిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


- మహిళా పారిశ్రామికవేత్తలు, హోటల్ & టూర్ మరియు టూరిజం పరిశ్రమ కోసం కొత్త పథకాలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి

Posted On: 23 NOV 2021 4:02PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మ‌రియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ త‌న రెండో రోజు జమ్మూ & కాశ్మీర్ పర్యటనలో భాగంగా 145 మంది లబ్ధిదారులకు రూ.306 కోట్ల రూపాయల విలువ చేసే రుణ మంజూరు లేఖలను అందజేశారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), ముద్ర పథకం, మ‌హిళ స్వయం-సహాయ సమూహాలు (ఎస్‌హెచ్‌జీలు), జాయింట్-లయబిలిటీ గ్రూప్‌లు (జేఎల్‌జీలు) వంటి  వివిధ రుణ సంబంధిత ప‌థకాల కింద రుణ మంజూరు లేఖలను అంద‌జేశారు. వివిధ బ్యాంకుల నుంచి ఆయా ప‌థ‌కాల కింద ఈ రుణ మంజూరు లేఖ‌ల‌ను అంద‌జేశారు. జమ్మూ & కాశ్మీర్ కోసం అనేక కొత్త పథకాలు మరియు కార్యక్రమాలను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో జే అండ్ కే బ్యాంక్ యొక్క తేజస్విని & హౌసాల పథకాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శిఖర్ & షికార పథకాలు మరియు రూ.200 కోట్ల‌తో కూడి సిడ్బి క్లస్టర్ డెవలప్‌మెంట్ ఫండ్, తేజస్విని పథకం ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి సారిస్తుంది. ఇది వ్యాపారం ప్రారంభించడానికి  గాను 18-35 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలకు రూ.5 లక్షల ఆర్ధిక స‌హాయాన్ని అందిస్తుంది. శిఖ‌ర్ పథకం హోటల్, టూర్ & టూరిజం పరిశ్రమలోని వారికి  రూ.2 కోట్ల వ‌ర‌కు వరకు అవ‌స‌ర‌మైన రుణ స‌హాయం అందిస్తుంది. శిఖ‌రా పథకం కాశ్మీర్ లోయలో అందించే వివిధ ర‌కాల శిఖ‌రాల కొనుగోలు/ మరమ్మత్తు కోసం రూ.15 లక్షల వ‌ర‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించడానికి సంబంధించినది. శ్రీమతి సీతారామన్ షోపియాన్ & బారాముల వద్ద గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థల (ఆర్ఎస్ఈటీఐ)  భవనానికి శంకుస్థాపన చేశారు. రియాసి జిల్లాలోని సలాల్, బగ్గా & బుధాన్‌ల‌లో జ‌మ్ము కాశ్మీర్‌ బ్యాంక్ శాఖలను ప్రారంభించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో
5 ఎఫ్‌పీఓలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు ఆశా ఎస్‌హెచ్‌జీల‌రే రూరల్ మార్ట్ మంజూరు పత్రాన్ని అందజేశారు.
శ్రీమతి నిర్మ‌లా సీతారామ‌న్ జమ్మూ యూనివర్శిటీలోని జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియం కాంప్లెక్స్‌లో జమ్మూ & కాశ్మీర్ యూనియన్ టెరిటరీ (యూటీఎల్‌బీసీ ఆఫ్ జే&కే) బ్యాంకర్స్ కమిటీ  నిర్వహించిన వివిధ  కార్యక్రమాల‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల‌లో జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాతో పాటు భారత ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు మరియు జమ్మూ & కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జమ్మూ & కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ స్వాగతోప‌న్యాసం చేశారు. ఈ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధికి  యూటీ పరిపాలన యంత్రాంగం  చేస్తున్న ప్రయత్నాల గురించి సభకు వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ & కాశ్మీర్  విష‌య‌మై త‌న  నిబద్ధతను చాటుతూ  నాబార్డ్   2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్‌) కేటాయింపును పెంచింది. దీనిని రూ. 787 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల‌కు పెంచిన‌ట్టుగా ప్ర‌కటించింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి కోసం గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ఇది సహాయప‌డుతుంది. ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, బ్యాంకులు జమ్మూ
& కాశ్మీర్‌లో తమ గ్రౌండ్ లెవల్ క్రెడిట్ స్థాయిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మునుపటి సంవత్సరం స్థాయి రూ.14,735 కోట్ల నుంచి రూ. 16,000 కోట్ల‌కు పెంచ‌నున్నాయి. జే&కే బ్యాంక్, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, జే&కే గ్రామీణ బ్యాంక్ మరియు నాబార్డ్‌ల నుండి రుణం పొంది ఆయా లబ్ధిదారులు ఏర్పాటు చేసిన అనేక సంస్థ‌ల‌ను  ఆర్థిక మంత్రి సందర్శించారు. ఈ సంద‌ర్భంగా  శ్రీమతి సీతారామన్ లబ్ధిదారులతో సంభాషించారు.వారి వ్యవస్థాపక ప్రయాణంలో బ్యాంక్ క్రెడిట్ చేసిన పరివర్తన ప్రభావాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవేత్తలు తయారు చేసే ఉత్పత్తులపై ఆర్థిక మంత్రి కూడా ఆసక్తి కనబరిచారు.

***



(Release ID: 1774728) Visitor Counter : 177