జౌళి మంత్రిత్వ శాఖ
ఎంఎంఎఫ్ టెక్స్‌టైల్స్ విలువ గొలుసుపై విలోమ పన్ను వ్యవస్థను తొలగించి ఏకరూపత విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వస్త్ర రంగానికి ఉపశమనం
ఎంఎంఎఫ్ టెక్స్‌టైల్స్ రంగంలో మొత్తం విలువ గొలుసుపై 12% ఏకరీతి రేటు పన్నుతో పరిశ్రమపై తగ్గనున్న ఆర్థిక భారం
ప్రభుత్వ నిర్ణయంతో ఎంఎంఎఫ్ టెక్స్‌టైల్స్ రంగంలో పెట్టుబడి మూలధన వ్యయం తగ్గుతుంది
పన్ను విధానంపై స్పష్టత : విలోమ పన్ను వ్యవస్థ ఏర్పడిన సమస్య పరిష్కారం.. అభివృద్ధిపై దృష్టి
Posted On:
22 NOV 2021 4:33PM by PIB Hyderabad
ఎంఎంఎఫ్ వస్త్ర విలువ గొలుసు వ్యవస్థలో విలోమ పన్ను విధానాన్ని తొలగించి ఏకరీతి పన్నును అమల్లోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వస్త్ర రంగానికి భారీ ఉపశమనం లభిస్తుంది. ఎంఎంఎఫ్, ఎంఎంఎఫ్ నూలు, ఎంఎంఎఫ్ బట్టలు మరియు దుస్తులపై విధిస్తున్న విలోమ పన్ను విధానాన్ని రద్దు చేసి వీటిపై 12% ఏకరీతి వస్తువులు మరియు సేవల పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ 2022 జనవరి ఒకటవ తేదీ నుంచి అమలు లోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ రంగం మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
దేశంలో దుస్తులు, వస్త్రాల రంగం పన్ను సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నది. సమస్యలు ఎంతోకాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. తొలుత అమ్మకపు పన్ను ఆ తర్వాత వ్యాట్, జీఎస్టీ సంబంధిత అంశాలు రంగాన్ని వేధించాయి. దీనితో చేతితో చేసే వస్త్రాలపై ( ఎంఎంఎఫ్) విధిస్తున్న విలోమ పన్నువిధానాన్ని రద్దు చేయాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. పూర్తయిన ఉత్పత్తుల విలువ కంటే ముడి పదార్ధాలపై పన్ను విధించడం వల్ల రుణ భారం ఎక్కువ కావడంతో పాటు ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. వివిధ దశల్లో పన్ను చెల్లింపులు పేరుకుపోవడంతో పరిశ్రమ ముఖ్యమైన మూలధన పెట్టుబడి సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది.
వినియోగించని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మొత్తాన్ని రిఫండ్ రూపంలో తిరిగి పొందడానికి జీఎస్టీ చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. అయితే, ఇతర సమస్యలతో పరిశ్రమ అదనపు భారాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. విలోమ పన్ను విధానం( ఇన్వర్టెడ్ టాక్స్) ఈ రంగంపై ఎక్కువ పన్ను భారాన్ని మోపింది. ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఎంఎంఎఫ్ కు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ దశలో భారతదేశంలో ఎంఎంఎఫ్ రంగం పన్ను సంబంధిత వివిధ కారణాల వల్ల ఆశించిన రీతిలో పురోగతి సాధించడం లేదు.
ఈ నేపథ్యంలో ఎంఎంఎఫ్ పై 12% ఏకరీతి జీఎస్టీ పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంఎంఎఫ్ రంగానికి ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.
i) ఏకరీతి 12% పన్ను రేటుతో ఎంఎంఎఫ్ వస్త్ర రంగం ప్రయోజనం పొందుతుంది, ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడి మూలధన అవసరాలను తగ్గిస్తుంది. ఇది పరిశ్రమ వర్గాల భారాన్ని తగ్గిస్తుంది. ఎలాంటి విలోమం లేకుండా పన్ను విధంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి.
ii) జీఎస్టీ రేట్ల ఏకరూపత పన్ను విధానం వల్ల గతంలో విలోమ పన్ను వ్యవస్థ కారణంగా పేరుకుపోయిన ఐటీసీ సమస్యలు పరిష్కారం అవుతాయి.
iii) డైయింగ్, ప్రింటింగ్ సేవలపై సంబంధించిన ఏకరూపత 12% జీఎస్టీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల వినియోగించని ఐటీసీని తిరిగి పొందే సౌకర్యం పరిశ్రమకు కలుగుతుంది. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుంది.
iv) ఎంఎంఎఫ్ ఉత్పత్తులలో గణనీయమైన భాగం ఎగుమతి అవుతాయి. దీనితో ఇది వరకు ఉన్న ఐటీసీని నగదు రూపంలో తిరిగి పొందడానికి ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ముడి పదార్ధాలపై విధిస్తున్న పన్ను రీఫండ్ చేయబడుతుంది, దీనితో తయారైన ఉత్పత్తుల (ఎగుమతులు )పై ఎటువంటి పన్ను ఉండదు. ఉత్పత్తి వ్యయం తగ్గడంతో ఎగుమతులను ఎక్కువ చేయడానికి వీలవుతుంది.
v) ఏకరీతి 12%జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తరువాత భారీగా పేరుకుపోయిన ఐటీసీ నిధులను దశలవారీగా నగదుగా పొందడానికి వీలు కలుగుతుంది.
దేశంలో అమలులో ఉన్న పన్ను విధానానికి లోబడి వస్త్రాలపై విధించే భిన్నమైన పన్ను రేట్లు సమస్యలను సృష్టిస్తాయి. సుల పన్ను భంగా గుర్తించడం సాధ్యం కాని ఎంఎంఎఫ్ ఉత్పత్తులపై విభిన్న పన్ను విధించడం సమంజసం కాదు. దీనికి ఏకరీతి రేటు అవసరం. ఏకరీతి రేటు పన్ను విధానాన్ని సులభతరం చేస్తుంది. దీనివల్ల వస్త్ర రంగంలో విలువ జోడింపు సమస్య పరిష్కారం అవుతుంది. విలోమ పన్ను వ్యవస్థ వల్ల ఏర్పడిన అన్ని సమస్యలను ఏకరీతి పన్ను విధానం పరిష్కరించి పన్నులపై వస్త్ర రంగానికి స్పష్టత వస్తుంది.
***
(Release ID: 1774143)
Visitor Counter : 225