సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యునెస్కో-ఏబీయు పీస్ మీడియా అవార్డ్స్ 2021 - దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోకు అవార్డులు
Posted On:
22 NOV 2021 4:31PM by PIB Hyderabad
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇటీవల జరిగిన ఏబీయు- యునెస్కో పీస్ మీడియా అవార్డ్స్ 2021లో ప్రసార భారతి తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. నాణ్యమైన కంటెంట్ క్రియేషన్‌లో ప్రసార భారతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన అద్భుతమైన ఫీట్‌లో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో నిర్మించిన టీవీ మరియు రేడియో షోలకు వరుసగా పలు అవార్డులు లభించాయి. దూరదర్శన్ ప్రోగ్రాం 'డీఫినిట్లీ లీడింగ్ ది వే' 'లివింగ్ వెల్ విత్ సూపర్ డైవర్సిటీ' విభాగంలో తన అవార్డును గెలుచుకోగా, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం 'లివింగ్ ఆన్ ద ఎడ్జ్ – ది కోస్టల్ లైవ్స్స 'ఎతికల్ & సస్టైనబుల్ రిలేషన్ షిప్ విత్ నేచర్ విభాగంలో మరో అవార్డును గెలుచుకుంది. ‘టుగెదర్ ఫర్ పీస్’ (టి4పి) చొరవ కింద ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ఏబీయు) సహకారంతో యునెస్కో ఈ అవార్డులను అందించింది. నవంబర్ 17, 2021న మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 5 ఖండాల్లోని 33 దేశాల నుండి వందకు పైగా వ్యక్తులు మరియు సంఘాల నుంచి స్ఫూర్తిదాయకమైన కథనాలు అవార్డుల కోసం పోటీకి వచ్చాయి. రేడియో, టీవీ మరియు డిజిటల్ ప్లాట్‌ఫాంల కోసం పోటీ తెరవబడింది. కార్యక్రమంలో ముందుకు వచ్చిన 'డీఈఏఫినెట్లీ లీడింగ్ ది వార్' ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ యొక్క ఉద్దేశ్యం ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తులను వారి జీవితాన్ని గౌరవంగా జీవించేలా ప్రేరేపించడం. ఈ డాక్యుమెంటరీని శ్రీ ప్రదీప్ అగ్నిహోత్రి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, దూరదర్శన్, ఢిల్లీ నిర్మించి మరియు దర్శకత్వం వహించారు. ఆల్ ఇండియా రేడియో సిరీస్ 'లివింగ్ ఆన్ ది ఎడ్జ్ – ది కోస్టల్ లైవ్స్' బంగాళా ఖాతం ఒడ్డున ఉన్న తీరప్రాంత పట్టణమైన విశాఖపట్నంలో అంచున నివసిస్తున్న మత్స్యకారలు వారి సంఘాల జీవితాన్ని అన్వేషిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి మోనికా గులాటి రూపొందించి, నిర్మించారు. ఏబీయు-యునెస్కో టీ4పీ మీడియా అవార్డులు మానవ మనస్సులలో సానుకూల శాంతిని పెంపొందించడానికి స్వతంత్ర, నైతిక జర్నలిజం మరియు పౌరులలో మీడియా అక్షరాస్యత యొక్క కీలక పాత్రను హైలైట్ చేస్తూ ప్రోత్సహిస్తాయి.
సానుకూల శాంతి అంటే ఘర్షణలు మరియు యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, పర్యావరణంతో గౌరవప్రదమైన మరియు స్థిరమైన సంబంధాలను కలిగి ఉన్న సమానమైన మరియు న్యాయమైన సమాజాల కోసం ప్రయత్నించడం. ఈ అవార్డ్‌లు వినూత్నమైన మరియు సృజనాత్మక కంటెంట్‌ను గౌరవిస్తాయి, ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మరియు కోవిడ్-19 మహమ్మారి నుండి మెరుగైన పునరుద్ధరణలో ఆవశ్యకతను పెంచే సానుకూల శాంతిని నెలకొల్పడానికి ఉత్తమ అభ్యాసాల గురించి ప్రేక్షకులకు తెలియజేసి అవగాహన కల్పిస్తుంది.
*****
(Release ID: 1774090)
Visitor Counter : 199