వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వేర్ హౌసింగ్ రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత, ఎఫ్.పి.ఒలు పిఎసిసిఎస్‌లకు ఇ- ఎన్ డబ్ల్యుఆర్ ప్రయోజనాలు అనే అంశంపై వెబినార్ నిర్వహించిన డిపార్టమెంట్ ఆఫ్ ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి చెందిన డబ్ల్యుడిఆర్ ఎ
ఈ వెబినార్ కు 120 మంది హాజరయ్యారు.
డబ్ల్యుడిఆర్ ఎ వద్ద రిజిస్ట్రేషన్‌కు ఫీజును ఎఫ్‌పిఒలు పిఎసిఎస్, ఎస్‌హెచ్‌జిలకు గణనీయంగా తగ్గించడం జరిగింది. ఇతర సంప్రదాయ వేర్ హౌస్‌లకు 5000 నుంచి 30,000 వరకు ఉన్న ఫీజును 500 రూపాయలకు తగ్గించడం జరిగింది.
Posted On:
21 NOV 2021 5:10PM by PIB Hyderabad
డిపార్టమెంట్ ఆఫ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డిఎఫ్‌పిడి) ఆజాదికా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేర్ హౌసింగ్ డవలప్‌మెంట్, రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు డి ఆర్ ఎ) ఈరోజు వెబినార్ ను నిర్వహించింది. ఈ సంస్థ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్.పి.ఒలు) , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిఎస్) నాబార్డ్, ఎస్ ఎఫ్ ఎ సిల ప్రతినిధులతో ఈ వెబినార్ నిర్వహించింది.
ఈ వెబినార్‌లో వివిధ రాష్ట్రాలనుంచి 120 మంది పాల్గొన్నారు..
వివిధ రాష్ట్రాలనుంచి వెబినార్ లో పాల్గొన్న పిఎసిఎస్, ఎఫ్ పి ఒ లను ఉద్దేశించి ఛైర్ పర్సన్ హర్ ప్రీత్ సింగ్ మాట్లాడారు. ఫామ్ గేట్ వద్ద వేర్ హౌసింగ్ సదుపాయాలు కల్పించడంలో పిఎసిఎస్, ఎఫ్‌పిఒలకు గల సహజ ప్రయోజనాల ప్రాధాన్యత గురించి ఆయన వివరించారు. పిఎసిఎస్, ఎఫ్‌పిఒల సమష్టిసేవలకు సంబంధించిన బిజినెస్ నమూనాను ఆయన వివరించారు. సార్టింగ్, గ్రేడింగ్, ఆర్థిక సంస్థల ద్వారా తనఖా ఫైనాన్స్ , అత్యుత్తమ ఫలితాల కోసం సమష్టితత్వంతో తగిన సమయంలో అమ్మకాలు, తద్వారా రైతుల రాబడి పెంపు వంటి వాటి గురించి ప్రస్తావించారు. పిఎసిఎస్, ఎఫ్‌పిఒలు తమకు వేర్‌హౌస్ లు లేనట్టయితే తమ తమ ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్న వేర్‌హౌస్‌లను అద్దెకుతీసుకోవచ్చు. రైతులకు ప్రయోజనాలు కల్పించడానికి వాటిని డబ్ల్యుడిఆర్ ఎ ప్రమాణాల స్థాయికి పెంచవచ్చు.
డబ్ల్యుడిఆర్ ఎ వద్ద రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రక్రియ, రాయితీలు, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీప్ట్ ( ఈ- ఎన్ డబ్ల్యు ఆర్) ప్రక్రియ ప్రయోజనాలను పిఎసిఎస్, ఎఫ్‌పి ఒ ల గురించి సవివరమైన ప్రెజెంటేషన్‌ను డబ్ల్యుడిఆర్ ఎ ఇచ్చింది. ఎఫ్‌పిఒలు పిఎసిఎస్, ఎస్‌హెచ్‌జిలకు ఫీజును చెప్పుకోదగిన స్థాయిలో 500 రూపాయలకు తగ్గించిన విషయం ప్రస్తావించారు. సంప్రదాయ వేర్ హౌస్‌లకు 5 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ఉండేది. ఇతర చార్జీలను కూడా వీరికి తగ్గించారు.
వేర్ హౌసింగ్ రంగం అభివృద్ధి, ఈ- ఎన్ డబ్ల్యుఆర్ కు సంబంధించిన ప్రయోజనాల విషయమై లఘు చిత్రాన్ని ప్రారంభించారు. మెస్సర్స్ ఎన్.ఇ.ఆర్.ఎల్ , రిపాజిటరీ ఎకో సిస్టమ్ పై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
పిఎసిఎస్, ఎఫ్.పి.ఒలను ప్రమోట్ చేసేందుకు గల వివిధ కేంద్రప్రభుత్వ పథకాలపై నాబార్డ్ కు చెందిన శ్రీ జితేంద్ర అలోరియా విస్తృత ప్రెజెంటేషన్ ఇచ్చారు. నాబార్డ్ వేర్ హౌస్ ల నిర్మాణానికి అందించే సహాయం, వివిధ సబ్సిడీలను ఆయన వివరించారు.
***
(Release ID: 1773830)