కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 2021లో 15.41 లక్షల నికర చందాదారులను చేర్చుకున్న ఇపిఎఫ్ఒ
పెద్ద సంఖ్యలో వ్యవస్థీకృత రంగ శ్రామిక శక్తిలో చేరడం ద్వారా సెప్టెంబర్‌లో మొత్తం నికర చందాదారులలో 47%నికి దోహదం చేసిన తొలి ఉద్యోగ అన్వేషకులు
Posted On:
20 NOV 2021 5:31PM by PIB Hyderabad
ఇపిఎఫ్ఒ శనివారం విడుదల చేసిన తాత్కాలిక వేతనదారుల పట్టీ ప్రకారం సెప్టెంబర్ 2021 నాటికి దాదపు 15.41 లక్షల చందాదారులు అదనంగా జతకూడారు. ఆగస్టు 2021లో ఉన్న 13.60 లక్షలతో పోలిస్తే సెప్టెంబర్ 2021లో నికర చందాదారుల చేరికలు 1.81 లక్షలు పెరిగింది.
మొత్తం 15.41 లక్షల నికర చందాదారులలో, దాదాపు 8.95 లక్షల నూతన సభ్యులు ఇపిఎఫ్& ఎంపి చట్టం, 1952 కింద నమోదు చేసుకున్నారు. దాదాపు 6.46 లక్షల మంది చందాదారులు నిష్క్రమించారు. అయితే, వారు ఇపిఎప్& ఎంపి చట్టం, 1952 పరిధిలోకి వచ్చే సంస్థలలోకి ఉద్యోగం మారి, తమ నిధులను మొత్తంగా ఉపసంహరించుకునే బదులుగా వాటిని బదిలీ చేసి ఇపిఎఫ్ఒ సభ్యత్వాన్ని కొనసాగించేందుకు ఎంచుకున్నారు.
వేతన పట్టికను వయసులవారీగా పోల్చి చూసినప్పుడు, సెప్టెంబర్ 2021లో అత్యంత అధికంగా 4.12 లక్షల మంది 22-25 వయసు మధ్య ఉన్నవారు నమోదు చేసుకున్నారు. తర్వాత, 1.8 లక్షల నికర నమోదులతో 18-21 మధ్య వయో వర్గం ఉంది. తొలి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారు పెద్ద సంఖ్యలో వ్యవస్థీకృత రంగంలో చేరి, సెప్టెంబర్ 2021లో మొత్తం చందాదారులలో 47. 39% దోహదం చేశారు.
వేతన పట్టికకు సంబంధించిన రాష్ట్రాల వారీ పోలికలో, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఎపిఎఫ్ కిందకు వచ్చే సంస్థలు దాదాపు 9.41 లక్షల చందాదారులను సెప్టెంబర్‌లో జత చేస్తూ ముందున్నారు. ఇది అన్ని వయోవర్గాల మొత్తం నికర వేతన పట్టికలో 61%గా ఉంది.
జెండర్ వారీ విశ్లేషణ ప్రకారం సెప్టెంబర్ నెలలో నమోదు చేసుకున్న మహిళల నికర వాటా సుమారు 3.27 లక్షలు. గత రెండు నెలలను పోల్చి చూసినప్పుడు 2.67 లక్షల మంది ఆగస్టు 21లో నికర చందాదారులను వేతన పట్టికతో పోలిస్తే దాదాపు 0.60 లక్షల పెరుగుదల మాత్రమే సెప్టెంబర్ నెలలో జరిగిందని తేలింది. ఇందుకు కారణం, ఆ నెలలో తక్కువ మంది మహిళా సభ్యులు నిష్క్రమించారు.
పరిశ్రమలవారీ వేతన పట్టిక డాటా ప్రకారం, ఈ నెలలో అదనంగా జత అయిన మొత్తం చందాదారులలో నైపుణ్యాల సేవలు ( మాన్‌పవర్ ఏజెన్సీలు, ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు, తదితరాలు) వర్గం 41.22%గా ఉంది. ఇదికాకుండా, వృత్తి వ్యాపార సంస్థలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, భవన నిర్మాణం,వస్త్రాల తయారీ, జౌళి, ఆసుపత్రులు, ఆర్థిక సంస్థల వంటి పరిశ్రమలలో నికర వేతన పట్టిక జోడింపులలో పెరుగుదల సరళి గమనించారు.
వేతన పట్టిక డాటా అనేది తాత్కాలికమైంది, ఎందుకంటే ఉద్యోగి రికార్డుల అప్‌డేషన్ అనేది నిరంతర ప్రక్రియ అయినందున డాటా ఉత్పత్తి అనేది నిరంతరం కొనసాగే పని. కనుక, గత డాటా ప్రతి నెలా అప్‌డేట్ అవుతూ ఉంటుంది. మే-2018 నుంచి, ఇపిఎఫ్ఎ సెప్టెంబర్ 2017 కాలానికి సంబంధించిన వేతన పట్టిక డాటాను విడుదల చేస్తోంది.
ఇపిఎఫ్ ఒ అనేది ఇపిఎఫ్&ఎంపి చట్టం, 1952 పరిధిలోని సభ్యులకు అనేక సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. తన భాగస్వాములకు ఆటంకం లేకుండా సేవలను అందించేందుకు కట్టుబడిన నూతన ఆవిష్కరణ ఆధారంగా సామాజిక భద్రతా సంస్థగా తన దార్శికతను ఇపిఎఫ్ఒ పునరుద్ఘాటిస్తుంది.
***
(Release ID: 1773672)
Visitor Counter : 174