మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ప్రపంచ మత్స్య దినోత్సవం-నవంబర్ 21: స్థిరమైన నిల్వలు & ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు భరోసానిస్తూ ప్రపంచ మత్స్య సంపదను ప్రపంచం నిర్వహించే విధానాన్ని మార్చడంపై దృష్టి సారించే విధంగా వేడుకలు


మత్స్య పరిశ్రమలో 2020-21 సంవత్సరానికి అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు ప్రభుత్వం అవార్డును అందజేస్తుంది

నీలి విప్లవం ద్వారా ఆర్థిక విప్లవాన్ని తీసుకురావడానికి మత్స్య రంగాన్ని మార్చడంలో ప్రభుత్వం ముందంజలో ఉంది

ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) 2024-25 నాటికి 22 ఎంఎంటి చేపల ఉత్పత్తిని సాధించడంతోపాటు దాదాపు 55 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Posted On: 20 NOV 2021 3:59PM by PIB Hyderabad

 

భారత ప్రభుత్వ ఫిషరీస్ శాఖ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మరియు జాతీయ మత్స్య అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఒడిశా భువనేశ్వర్ మంచేశ్వర్‌లోని రైల్ ఆడిటోరియంలో 21 నవంబర్ 2021న ‘ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని’ జరుపుకోనున్నాయి. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్, శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్, మత్స్యశాఖ కార్యదర్శి, డాక్టర్. సి.సువరణ, ఎన్‌ఎఫ్‌డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్, శ్రీ సాగర్ మెహ్రా జాయింట్ సెక్రటరీలు (ఫిషరీస్) భారత ప్రభుత్వం, శ్రీ ఆర్. రఘు ప్రసాద్, కమీషనర్ & సెక్రటరీ, ఒడిశా ప్రభుత్వ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, ఒడిశా మరియు వివిధ రాష్ట్రాల మత్స్య శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖలు/మంత్రిత్వ శాఖలు, మత్స్యకార రైతులు, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, పారిశ్రామికవేత్తలు, వాటాదారులు, నిపుణులు, అధికారులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ఫిషరీస్ రంగంలో రెండవసారి భారత ప్రభుత్వం 2020-21లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు,  సముద్ర, కొండ & ఈశాన్య ప్రాంతం, లోతట్టు, సముద్ర, కొండ & ఈశాన్య ప్రాంతాలకు ఉత్తమ జిల్లా, ఉత్తమ  ప్రభుత్వం అవార్డులను అందజేస్తుంది. అలాగే ఉత్తమ సంస్థ/ ఫెడరేషన్/ కార్పొరేషన్/ బోర్డిన్‌ల్యాండ్, మెరైన్, హిల్లీ & ఈశాన్య ప్రాంతాలకు పురష్కారం లభిస్తుంది. అంతేకాకుండా, ఉత్తమ చేపల పెంపకందారు (లోతట్టు, సముద్ర మరియు కొండ & ఈశాన్య ప్రాంతం), ఉత్తమ హేచరీ (చేపలు, రొయ్యలు మరియు ట్రౌట్ హేచరీ), ఉత్తమ మత్స్య పరిశ్రమలు, ఉత్తమ మత్స్య సహకార సంఘాలు/ఎఫ్‌పిఓలు/ఎస్‌హెచ్‌జిలు, ఉత్తమ వ్యక్తులు, వ్యవస్థాపకులు, ఉత్తమ ఇన్నోవేషన్ ఆలోచన/టెక్నాలజీ ఇన్ఫ్యూషన్ అవార్డు సన్మానాలు ఉంటాయి.


                ఈవెంట్ సందర్భంగా, మధ్యాహ్నం సెషన్‌లో ఐకార్-సిఐఎఫ్‌ఏ శాస్త్రవేత్తలు పాల్గొనే సాంకేతిక సెషన్‌లు కూడా నిర్వహించబడతాయి. విస్తృత ప్రచారం కోసం మొత్తం కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.


దేశంలో నీలి విప్లవం ద్వారా మత్స్య రంగాన్ని మార్చడంలో మరియు ఆర్థిక విప్లవం తీసుకురావడంలో భారత ప్రభుత్వం ముందంజలో ఉంది. ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించడం, నాణ్యతను మెరుగుపరచడం మరియు వ్యర్థాలను తగ్గించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని రంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగం యొక్క సంభావ్యతను అంచనా వేసిన ప్రధాన మంత్రి, మే, 2020లో ఐదేళ్ల కాలానికి రూ.20,050 కోట్లకు పైగా బడ్జెట్‌తో “ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై)ని ప్రారంభించారు. 2024-25 నాటికి ప్రస్తుత 15.0 ఎంఎంటి నుండి 22 ఎంఎంటి చేపల ఉత్పత్తిని సాధించడం మరియు ఈ రంగం ద్వారా దాదాపు 55 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలను కల్పించడం  పిఎంఎంఎస్‌వై లక్ష్యంగా పెట్టుకుంది.

నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు, చేపల పెంపకందారులు మరియు సంబంధిత వాటాదారులందరితో సంఘీభావాన్ని ప్రదర్శించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 1997లో ప్రారంభమైంది. "వరల్డ్ ఫోరమ్ ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ & ఫిష్ వర్కర్స్" న్యూ ఢిల్లీలో సమావేశమై 18 దేశాల ప్రతినిధులతో "వరల్డ్ ఫిషరీస్ ఫోరమ్" ఏర్పాటుకు దారితీసింది మరియు స్థిరమైన ఫిషింగ్ పద్ధతులు మరియు విధానాల ప్రపంచ  కోసం వాదిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేసింది. ఈ కార్యక్రమం ఓవర్ ఫిషింగ్, నివాస విధ్వంసం మరియు మన సముద్ర మరియు మంచినీటి వనరుల సుస్థిరతకు ఇతర తీవ్రమైన బెదిరింపులపై దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థిరమైన నిల్వలు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను నిర్ధారించడానికి ప్రపంచ మత్స్య సంపదను ప్రపంచం నిర్వహించే విధానాన్ని మార్చడంపై ఈ వేడుకలు దృష్టి సారించాయి.

 

*****



(Release ID: 1773658) Visitor Counter : 195