గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనులు మరియు ఖనిజాలపై జరగనున్న జాతీయ సదస్సులో ప్రసంగించనున్న కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి


గనుల తవ్వకాలను ప్రోత్సహించి, వేలం విధివిధానాలను ఖరారు చేసి, సుస్థిరమైన మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఏటా జరుగుతున్న సదస్సు

15 రాష్ట్రాలకు 52 నూతన మైనింగ్ బ్లాకుల అప్పగింత

Posted On: 20 NOV 2021 1:07PM by PIB Hyderabad

ఈ నెల 23వ తేదీన గనులు, ఖనిజాలపై ఏర్పాటైన జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గుగనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రసంగించనున్నారు.  దేశంలో మైనింగ్ రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. మైనింగ్ రంగానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాలను సదస్సులో చర్చించి, సులభతర వాణిజ్య విధానాలను రూపొందించి, రంగాన్ని అభివృద్ధి చేయడానికి అమలు చేయవలసిన ప్రణాళికను సదస్సులో చర్చించి రూపొందిస్తారు. 

గనులు, ఖనిజాల రంగానికి సంబంధించి ఏర్పాటైన  అయిదవ  జాతీయ సదస్సులో ప్రధానమైన అంశాలు చర్చకు రానున్నాయి. గనుల వేలం విధివిధానాలు ఖరారు చేయడం, మైనింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, దేశంలో దీర్ఘ కాలంలో అమలు చేయాల్సిన మైనింగ్ కార్యకలాపాలను సదస్సులో చర్చించడం జరుగుతుంది. మైనింగ్ కార్యకలాపాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన మైనింగ్ కేంద్రాలకు 5 స్టార్ రేటింగ్ ను ప్రకటించడం ఈ సదస్సులో ముఖ్య అంశంగా ఉంటుంది. 

గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2015 అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాయితీల మంజూరు కోసం నిర్వహిస్తున్న వేలం విధానం పారదర్శకంగా అమలు జరుగుతోంది. నూతన విధానం మైనింగ్ పరిశ్రమ, వేలం విధానాల్లో  విచక్షణను తావు లేకుండా చేసింది.  దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా మైనింగ్ రంగంలో సులభతర వ్యాపార నిర్వహణ’ కు నాంది పలికింది.  

దేశంలో 2016 నుంచి గనులుఖనిజ రంగంపై ప్రతి ఏటా సదస్సును నిర్వహించడం ప్రారంభం అయ్యింది. మైనింగ్ రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలు సదస్సులో పాల్గొంటాయి. విధాన నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల అధికారులువేలం ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనే వారుపరిశ్రమల రంగంపరిశ్రమ సంఘాల ప్రతినిధుల మధ్య అర్ధవంతమైన చర్చలు జరగాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా  సదస్సు నిర్వహిస్తున్నారు. 

గనులుఖనిజ రంగంలో సుస్థిర ప్రగతి సాధించడానికి దోహదపడే విధంగా విధాన నిర్ణయాలను రూపొందించడానికి రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రతి ఏడాది ఇటువంటి సదస్సులను నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన సదస్సులలో చర్చించి అమలు చేస్తున్న విధానాలు ఫలితాలు ఇస్తున్నాయి.

సుస్థిర అభివృద్ధి సాధించడానికి రూపొందించిన కార్యక్రమాలుప్రణాళికలను అమలు చేస్తున్న చర్యలకు గుర్తింపుగా 2016 నుంచి కేంద్ర గనుల శాఖ స్టార్ రేటింగ్ఇవ్వడం ప్రారంభించింది. గనులను లీజుకు తీసుకుని లక్ష్యాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న వారికి ఒకటి నుంచి అయిదు వరకు స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతోంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గనుల లీజుదారులు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. గత మూడు సంవత్సరాలుగా స్టార్ రేటింగ్ పొందిన వారిని ఈ ఏడాది జరగనున్న సదస్సులో సన్మానిస్తారు. దీని ద్వారా మైనింగ్ కార్యక్రమాల్లో సుస్థిర అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. 

జీదశలో ఖనిజ పరిశోధనలు జరుగుతున్న 52 గనులను గుర్తించి  వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు స్వాధీనం చేసే అంశంపై కూడా సదస్సులో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 54 మైనింగ్ కేంద్రాలు 15 రాష్ట్రాలలో ఉన్నాయి. వీటిలో రెండు బ్లాకులు ఈశాన్య రాష్ట్రాలుఆరు బ్లాకులు ఛత్తీస్‌గఢ్‌, ఆరు బ్లాకులు మహారాష్ట్రలో ఉన్నాయి. వివిధ పరిశ్రమల అవసరాలను తీర్చగల 8 సున్నపురాయి బ్లాకులు, 8 బంగారం బ్లాకులు, 8 ఇనుప ఖనిజ బ్లాకులతో సహా ఇతర ఖనిజ బ్లాకులు  వీటిలో ఉన్నాయి. ఈ బ్లాకులతో పాటు ఇటీవల వేలం వేసి సెప్టెంబర్ నెలలో లీజుదారులకు అప్పగించిన 100 బ్లాకుల్లో సాగే కార్యక్రమాల వల్ల దేశ ఖనిజ రంగం మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు. 

తవ్వకాలను ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల ఎంఎండీఆర్ చట్టానికి సవరణలు చేసి ప్రైవేట్ రంగానికి తవ్వకాల రంగంలో ప్రవేశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అధునాతన సాంకేతికతను ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. పారదర్శక మరియు కాగిత రహిత ప్రక్రియ ద్వారా ప్రైవేట్ అన్వేషణ సంస్థలు తమను తాము గుర్తింపు పొందేందుకు వీలుగా ఖనిజ రంగంలోని  ఏజెన్సీల అక్రిడిటేషన్ కోసం రూపొందించిన  ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సదస్సులో ప్రారంభిస్తారు.గుర్తింపును మంజూరు చేయడానికి గనుల మంత్రిత్వ శాఖ ఇటీవల  క్యూసిఐ -ఎన్ఏబిఈటీ పథకం రూపొందించింది. 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో   మినరల్ బ్లాక్‌లను విజయవంతంగా వేలం వేసిన  రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ఎంఈటీ నిధి నుంచి   లావాదేవీ సలహాదారు రుసుము’ (విజయవంతమైన వేలానికి రూ. 10.00 లక్షలు) గా సదస్సులో తిరిగి చెల్లించడం జరగుతుంది. 

సదస్సులో భాగంగా సాంకేతిక సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఇటీవల మైనింగ్ చట్టాలకు చేసిన సవరణలు, గనుల తవ్వకాన్ని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న చర్యలు అలాగే నేషన్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలను 

చర్చిస్తారు. 

వేలం ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ఖనిజ ఉత్పత్తిని మరింత ఎక్కువ చేయడానికి కొత్తగా గనులను గుర్తించి వాటిని వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.సదస్సులో పాల్గొనే రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉన్న గనుల వివరాలను అందించడానికి అవకాశం కలుగుతుంది. వీటిలో తవ్వకాలు చేపట్టడానికి గల అవకాశాలు, రవాణా సౌకర్యాలు, తాము అమలు చేస్తున్న గనుల విధానం, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై రాష్ట్రాలు వివరాలను అందిస్తాయి. వీటి ఆధారంగా పెట్టుబడిదారులు అవకాశాలను గుర్తించి పెట్టుబడులతో రావడానికి వీలవుతుంది. 

  సదస్సులో ఎక్కువ మంది పాల్గొనేలా చూడడానికి ఎటువంటి ప్రవేశ రుసుమును వసూలు చేయడం లేదు. పరిశ్రమలు, మైనింగ్ రంగంతో లాంటి సంస్థలు సంబంధం ఉన్నవారు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యేలా చూడడానికి గతంలో నిర్వహించిన సదస్సులో ప్రవేశ రుసుము వసూలు చేయలేదు. ఈ యాడెడి కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల గనుల శాఖలు, ఐబీఎం, డీజీఎం లాంటి నియంత్రణ సంస్థలు, జీఎస్ఐ, ఎన్ఎంఈటీ లాంటి అన్వేషణా సంస్థలు సదస్సులో మైనింగ్ దాని అనుబంధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు సాగిస్తారు. 

మైనింగ్ రంగంలో ఉన్న హెచ్ సిఎల్, నాల్కో లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, గనుల శాఖ పర్యవేక్షణలో పనిచేస్తున్న బాల్కో, హిందూస్తాన్ జింక్  తదితర సంస్థలు సదస్సు నిర్వహణలో గనుల మంత్రిత్వ శాఖకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

****


(Release ID: 1773563) Visitor Counter : 185