వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కేంద్రం ప్రకటించిన వివిధ పి ఎల్ ఐ పథకాలపై పారిశ్రామిక రంగం నుంచి సానుకూల స్పందన.. శ్రీ గోయల్


రాష్ట్రాలవారీగా వ్యాపార ఖర్చులు మదించి ఆయా రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది... శ్రీ పీయూష్ గోయల్

ఉత్పత్తి ఎక్కువ చేయడానికి రూపొందించిన పిఎల్ఐ పథకాల ద్వారా ప్రయోజనం పొందడానికి కార్మిక చట్టాలు మార్పులు తీసుకురావాలని రాష్ట్రాలకు సూచించిన శ్రీ గోయల్

"డ్రోన్ రంగంలో అపారమైన అవకాశాలు": శ్రీ పీయూష్ గోయల్

భారతదేశం ప్రత్యేక రంగాలను ఎంచుకుని వాటిలో రాణించడానికి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దేశం అన్ని రంగాల్లో రాణించలేదని గుర్తించాలి.. శ్రీ గోయల్

స్థానికంగా విలువ జోడింపు చర్యలు ఎగుమతుల పురోగతిపై ఏర్పాటైన కమిటీ ఈ సమావేశంలో తాజా పరిస్థితిని సమీక్షించిన శ్రీ గోయల్

Posted On: 18 NOV 2021 1:19PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం  ఉత్పాదకత తో కూడిన వివిధ ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నదని  కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల ,వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ,ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ తెలిపారు. 

స్థానికంగా విలువ జోడింపు చర్యలు ఎగుమతుల పురోగతిపై ఏర్పాటైన కమిటీ  శ్రీ గోయల్ అధ్యక్షతన సమావేశం అయ్యింది. సమావేశంలో మాట్లాడిన శ్రీ గోయల్ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక పథకాలపై పారిశ్రామిక రంగం నుంచి సానుకూల స్పందన వస్తున్నదని అన్నారు. ఈ పథకాల ప్రభావం రవాణా,  వస్త్ర, వైట్ గూడ్స్ రంగాలపై కనిపిస్తున్నదని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఈ రంగాలలో ఉత్పత్తి పెరుగుతున్నదని ఆయన వివరించారు.

ప్రపంచ ఆటో విడి భాగాల తయారీ రంగంలో $1.3 ట్రిలియన్ వ్యాపారం జరుగుతున్నదని పేర్కొన్న మంత్రి దీనిలో మనదేశ వాటా $15 బిలియన్ల వరకు ఉందని అన్నారు.2026 నాటికి ఆటో విడి భాగాల ఎగుమతులను రెట్టింపు చేసి $30 బిలియన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి వివరించారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం దేశంలో పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరగవలసి ఉంటుందని శ్రీ గోయల్ అన్నారు. పోటీతత్వాన్ని అలవరచుకుని, పూర్తి సామర్ధ్యం మేరకు పరిశ్రమలు ఉత్పత్తి సాగించాలని ఆయన కోరారు. ప్రపంచ మార్కెట్లో స్థానం సంపాదించడానికి నాణ్యతతో రాజీ పడకుండా ఉత్పత్తి సాగించాలని అన్నారు. దీనికోసం ప్రపంచ స్థాయి ప్రయోగశాలలు అవసరమ ఉంటాయని అన్నారు.

ప్రపంచ మార్కెట్ లో పోటీ పడడానికి రావన్న ఖర్చులను తగ్గించక తప్పదని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రాల వారీగా చర్యలను అమలు చేయవలసి ఉంటుందని అన్నారు. ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి దోహదపడే విధంగా కేంద్రం రూపొందించిన ప్రోత్సాహక పథకాల ప్రయోజనాలను పొందడానికి కార్మిక చట్టాలలో అవసరమైన మార్పులు చేయాలని  ఆయన రాష్ట్రాలకు సూచించారు. వ్యాపార వ్యయాలను రాష్ట్రాల వారీగా సమీక్షించి తగిన చర్యలను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 

దేశంలో తక్కువ ధరకు లభిస్తున్న కార్మిక శక్తిని వినియోగించుకుని ప్రయోజనం పొందడానికి చర్యలు తీసుకోవాలని శ్రీ గోయల్ పరిశ్రమ వర్గాలకు సూచించారు. అన్ని రంగాలలో ఏ ఒక్క దేశం రాణించలేదన్న అంశాన్ని పారిశ్రామిక వర్గాలు గుర్తించాలని శ్రీ గోయల్ అన్నారు. 

దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని రంగాలను ఎంపిక చేసుకుని వాటిలో రాణించడానికి తగిన చర్యలను తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలను శ్రీ గోయల్ సూచించారు.

ఉత్పత్తి రంగంలో అభివృద్ధి సాధించడానికి భూమి, నైపుణ్యం రంగాల అభివృద్ధి, ప్రభుత్వం పరిశ్రమల మధ్య సహకారం, కార్మిక నిబంధనలు కీలకంగా ఉంటాయని శ్రీ గోయల్ అన్నారు. ప్రపంచ మార్కెట్ తో పోటీ పడటానికి ఈ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. 

లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించడానికి సాంకేతికత బదిలీ అంశానికి దేశంలో చిప్పులను ఉత్పత్తి చేయడానికి పరిశ్రమలు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ గోయల్ అన్నారు. అభివృద్ధి సాధించడానికి అనేక నూతన రంగాల్లో నూతన అవకాశాలు అపారంగా ఉన్నాయని శ్రీ గోయల్ అన్నారు. దీనికి ఉదాహరణగా డ్రోన్ల రంగాన్ని పెట్టుకోవచ్చని అన్నారు. కీలకమైన ఈ రంగం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించడానికి పౌర విమానయాన శాఖ అవసరమైన నిబంధనలు రూపొందించి సహకరించాలని ఆయన కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలను శ్రీ గోయల్ ప్రస్తావించారు. దీనికోసం టీవీ తయారీలో ప్రస్తుతం 28%గా ఉన్న  స్థానిక విలువ జోడింపును 43.7%కి పెంచాలని ఆయన సూచించారు. సెట్ టాప్ బాక్స్ , సీసీటీవీ, మొబైల్ హ్యాండ్‌సెట్‌లు మరియు టెలివిజన్ తయారీదారులు స్థానికీకరణ ఎక్కువ చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. 

ఎక్కువ స్థాయిలో స్వదేశీకరణ లక్ష్యాన్ని సాధించిన ఎయిర్ కండిషనర్ తయారీ రంగాన్ని ఆయన అభినందించారు. వాహన తయారీ రంగంలో స్వచ్ఛ ఇంధన వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆటోమొబైల్స్ రంగ ప్రతినిధులకు సూచించిన శ్రీ గోయల్ అయస్కాంతాలు, ఎలక్ట్రిక్ మోటార్ భాగాలను దేశంలో ఉత్పత్తి చేయాలని అన్నారు.  



(Release ID: 1772943) Visitor Counter : 128