ఉక్కు మంత్రిత్వ శాఖ
ఎంఒఐఎల్ త్రైపాక్షిక పరిష్కారంపై సంతకాలు
Posted On:
17 NOV 2021 12:13PM by PIB Hyderabad
ఒక ప్రధాన పరిణామంలో భాగంగా మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఒఐఎల్) కార్మికుల వేతన సవరణకు సంబంధించి ఎంఒఐఎల్ యాజమాన్యం, గుర్తింపు పొందిన యూనియన్ ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక పరిష్కారంపై భారత ప్రభుత్వ ప్రధాన లేబర్ కమిషనర్ సమక్షంలో మంగళవారం శ్రమశక్తి భవన్‌లో జరిగిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో సంతకాలు చేశారు. దాదాపు 6000మంది కంపెనీ సిబ్బందికి లబ్ధి చేకూర్చే ఈ వేతన సవరణ 01.08.2017 నుంచి 31.07. 2027 వరకు దశాబ్దకాల వ్యవధికి వర్తిస్తుంది. ఈ పరిష్కారం ఎంఒఐఎల్ యాజమాన్యం, గుర్తింపు పొందిన ఎంఒఐఎల్ కామ్‌గార్ సంఘన్ (ఎంకెఎస్) మధ్య అవగాహనా పత్రం ఆధారంగా జరిగింది. ఈ ప్రతిపాదనలలో 20% ఫిట్‌మెంట్ బెనిఫిట్, 20% రేటున ప్రోత్సాహకాలు, అలవెన్సులు ఉన్నాయి. బేసిక్, డిఎల మధ్యంతర ఉపశమనం (ఇంటిరిమ్ రిలీఫ్)గా మే, 2019 నుంచి 12% పెంపును కంపెనీ అందించింది.
బకాయిలను ఏకమొత్తంలో కంపెనీ చెల్లించనుంది. ఆగస్టు 1, 2017 నుంచి 30 సెప్టెంబర్ 2021 కాలానికి చెల్లించవలసిన మొత్తం కారణంగా కంపెనీపై రూ. 218 కోట్ల రూపాయిలు భారం పడనుంది. ప్రతిపాదిత వేతన సరవణ మొత్తం ఆర్థిక ప్రభావం ఏడాదికి రూ. 87 కోట్లుగా ఉండనుంది. ఈ వేతన పెంపుకు సంబంధించి తన ఖాతా పుస్తకాలలో పూర్తి కేటాయింపులను ఎంఒఐఎల్ లిమిటెడ్ ఇప్పటికే చేసింది.
సంతకం చేసిన 60 రోజులలో దీనిని అమలు చేయాలని ఒప్పందం నిర్దేశిస్తుంది.
ఈ ఒప్పందం ఎంఒఐఎల్, దాని సిబ్బంది అభివృద్ధి, శ్రేయస్సుకు సంబంధించి నూతన యుగాన్ని ఆవిష్కరించనుంది. ఈ పక్రియ సిబ్బంది అధిక ఉత్పాదకతను, ఉత్పాదనను చేసేందుకు ప్రేరణను ఇచ్చి, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించి, దిగుమతులకు ప్రత్యాయం వంటి జాతీయ ప్రయోజనాలను అందించనుంది.
(Release ID: 1772669)
Visitor Counter : 154