ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 NOV 2021 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 113.68 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,28,555. ఇది 527 రోజుల కనిష్ట స్థాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.37% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.28% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 12,134 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,38,73,890 కు పెరిగింది.
గత 24 గంటల్లో 10,197 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (0.82%) గత 44 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (0. 0.96%) గత 54 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 62.70 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1772537)
Visitor Counter : 139