వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మనం చారిత్రాత్మకంగా గరిష్ఠస్థాయిలో ఎగుమతులు,సేవలు సాధించాం- శ్రీ పియూష్ గోయల్
అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ప్రపంచం భారతదేశాన్ని ఒక విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా చూస్తోంది-- శ్రీగోయల్
లాక్‌డౌన్ సమయంలోనూ ఇండియా అంతర్జాతీయ కమ్యూనిటీకి ఏరకమైన సేవలు అందించడంలో ఎక్కడా తప్పలేదు-- శ్రీ గొయల్
ఇండియా తిరిగి కార్యకలాపాలను వేగవంతం చేసినట్టు ఐఐటిఎఫ్ చూపుతోంది - శ్రీ గోయల్
40వ ఐఐటిఎఫ్ ను ప్రారంభించిన శ్రీ పియూష్ గోయల్
Posted On:
14 NOV 2021 12:33PM by PIB Hyderabad
సరకుల ఎగుమతులు, సేవల విషయంలో మనం చరిత్రాత్మకంగా ఉన్నతస్థాయిలో ఉన్నామని కేంద్ర వాణిజ్య,పరిశ్రమలు,వినియోగదారుల వ్యవహారాలు,ఆహారంప్రజాపంపిణీ , టెక్స్‌టైల్ శాఖమంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. 40 వ ఐఐటిఎఫ్‌ను ప్రారంభిస్తూ మంత్రి , ప్రపంచదేశాలు ఇండియాను విశ్వసనీయమైన అంతర్జాతీయ భాగస్వామిగా చూస్తున్నాయని , అంతర్జాతీయ సరఫరా చెయిన్ లో చేరామన్నారు.
దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ అంతర్జాతీయ కమ్యూనిటీకి మద్దతునిచ్చే సేవల విషయంలోనూ ఇండియా వెనకడుగు వేయలేదని ఆయన అన్నారు. ఇండియా చారిత్రకస్థాయిలో గరిష్ఠంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలలలో మున్నెన్నడూ లేని స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించినట్టు తెలిపారు. ఇండియా తిరిగి తన కార్యకలాపాలను ముందుకుతీసుకుపోయే స్థితిలో ఉందని ఐఐటిఎఫ్ రుజువుచేస్తున్నదని అన్నారు.
భారతదేశానికి సంబంధించి శ్రీ గోయల్ ఐదుసూత్రాలను ప్రముఖంగా ప్రస్తావించారు.అవి ఆర్ధికవ్యవస్థ, ఎగుమతులు, మౌలికసదుపాయాలు, డిమాండ్, డైవర్సిటీ. మెరుగైన మౌలిక సదుపాయాలు, డిమాండ్, అభివృద్ధిలో వైవిధ్యం వంటివి మెరుగైన, నవ భారత ఆకాంక్షలకు అద్దం పడుతుందని అన్నారు..
ఉత్తరప్రదేశ్‌లో మున్నెన్నడూ లేనంతగా మౌలికసదుపాయాలు పెరగడం పట్ల శ్రీ గోయల్ ప్రశంసించారు. ఎగుమతుల అభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
ఐఐటిఎఫ్ మిషన్ ఆత్మనిర్భర్ భారత్ ను మరింత ముందుకు తీసుకుపోతుందని, ఓకల్ ఫర్ గ్లోబల్ ఆలోచనను ప్రోత్సహిస్తుందని అన్నారు.
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్నట్టు శ్రీ గోయల్‌చెప్పారు. ఇప్పటికే 110 కోట్లకు పైగా వాక్సిన్ డోస్‌లు వేసినట్టు తెలిపారు. వచ్చే ఏడాది 500 కోట్ల వాక్సిన్ డోస్‌లు ఉత్పత్తి చేయనున్నామని ఆయన అన్నారు. దేశంలో 5 లేదా 6 వాక్సిన్ లు వచ్చే ఏడాది ఉత్పత్తి చేయనున్నామన్నారు. అలాగే ప్రపంచంలోనే తొలి నాసల్ వాక్సిన్,తొలి డి.ఎన్.ఎ వాక్సిన్ కూడా ఇక్కడే ఉత్పత్తి కానున్నదన్నారు. ఇండియా వాక్సిన్ భద్రతను కల్పిస్తుందని, ప్రపంచాన్ని సురక్షిత ప్రాంతంగా నిలుపుతుందని ఆయన అన్నారు. ప్రపంచచంలోని ప్రతి ప్రాంతం సురక్షితంగా ఉండేందుకు సమానస్థాయిలో వాక్సిన్ పొందుతుందని ఆయన చెప్పారు.
ఐఐటిఎఫ్ ఏడాది తర్వాత తిరిగి తన 40 వ ఎడిషన్‌తో వచ్చిందని శ్రీ గోయల్ చెప్పారు. ఇది రెట్టింపు జోష్‌తో వచ్చిందని ,ఆత్మనిర్భరత, ఆజాది కా అమృత్ మహోత్సవ్ అనే రెండు ఇంజిన్లతో వచ్చిందని ఆయన అన్నారు. స్వల్ప వ్యవధిలో ట్రేడ్ ఫెయిల్ నిర్వహణకు ఐటిపిఒ కృషిని మంత్రి ప్రశంసించారు. ఇందులో 3 వేలమందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని చెప్పారు. ప్రపంచం ఇండియాను విశ్వసనీయమైన భాగస్వామిగా చూస్తున్నదన్నదానిని ఇది ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికి తొలి 4 నెలలలో మున్నెన్నడూ లేనంతటి స్థాయిలో 27 బిలియన్ డాలర్ల మేరకు ఎఫ్.డి.ఐలు తరలి వచ్చినట్టు శ్రీ గోయల్ తెలిపారు. ఇది 2020-21 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం ఎక్కువ. మున్నెన్నడూ లేనంతటి స్థాయిలో ఎగుమతులు జరిగాయి. మర్చండైజ్ ఎగుమతులు 2021 ఏప్రిల్ -అక్టోబర్ మధ్య 232 బిలియన్ డాలర్లు ( 2020 అక్టోబర్ తో పోలిస్తే 54 శాతం ఎక్కువ, 2019 ఏప్రిల్ అక్టోబర్‌తో పోలిస్తే 25 శాతం ఎక్కువ )
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడి సంస్థ ఇండియా సావరిన్ రేటింగ్ అంచనాలను నెగటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి పెంచినట్టు తెలిపారు. జిఎస్‌టి వసూళ్ళు అక్టోబర్ లో 1.3 లక్షలకు చేరుకున్నాయి. దివాలి సమయంలో 1.25 లక్షల కోట్ల రూపాయల రిటైల్ అమ్మకాలు జరిగాయి. తయారీ రంగ పిఎంఐ అక్టోబర్ లో 55.9 కి పెరిగిందన్నారు. సేవల పిఎంఐ దశాబ్దకాలపు గరిష్ఠస్థాయికి అంటే 58.4 కు గత నెలలో చేరింది. ఇండియా ప్రస్తుతం తన ఇన్వెస్టర్ అనుకూల విధానాలతో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారు.
***
(Release ID: 1772158)
Visitor Counter : 147