రక్షణ మంత్రిత్వ శాఖ
భారత పదాతి దళాధిపతి ఇజ్రాయెల్ సందర్శన
Posted On:
14 NOV 2021 9:52AM by PIB Hyderabad
భారత పదాతి దళాధిపతి జనరల్ ఎం.ఎం.నరవాణే 2021 నవంబరు 15 నుంచి 19 వరకూ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారు. ఆయన ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కాగా, ఇజ్రాయెల్ సైనిక-పౌర నాయకత్వంలోని సీనియర్ నేతలను కలుసుకుంటారు. ఈ సందర్భంగా భారత-ఇజ్రాయెల్ రక్షణ సంబంధాలను మరింత విస్తరించేందుకుగల అవకాశాలపై వారితో చర్చిస్తారు. అలాగే ఇజ్రాయెల్-భారత్‌ల మధ్యగల అద్భుత ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించే దిశగా ఆర్మీ చీఫ్ కృషి చేస్తారు. ఇందులో భాగంగా భద్రత వ్యవస్థలోని సీనియర్ అధికారులతో పలు సమావేశాల్లో పాల్గొని, వివిధ రక్షణ సంబంధిత అంశాలపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాకుండా వివిధ సైనిక బలగాల ప్రధానాధికారులతో సంభాషించడంతోపాటు ఇజ్రాయెల్ రక్షణ బలగాలకు చెందిన ‘గ్రౌండ్ ఫోర్సెస్ ఎలిమెంట్’ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు.
***
(Release ID: 1771632)
Visitor Counter : 203