ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 NOV 2021 9:13AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 111.40 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 11,850 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.26% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 12,403 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,38,26,483 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.40% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,36,308. ఇది 274 రోజుల కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.94%) గత 40 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (1.05%) గత 50 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 62.23 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

****


(Release ID: 1771462) Visitor Counter : 164