పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఈజీసీఏను (ఈ-గవర్నెన్స్ ఇన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

- డీజీసీఏ ప‌నులు, విధులను ఆటోమేషన్ చేయడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్టుయే జీసీఏ

- ఈ ప్రాజెక్ట్ నిర్బంధ నియంత్రణ నుండి నిర్మాణాత్మక సహకారానికి నమూనా మార్పును సూచిస్తుందిః మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

- పైలట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వ‌హ‌ణ‌ మొదలైన వివిధ డీజీసీఏ భాగస్వామ్యప‌క్షాల‌కు అందించే సేవలు ఈజీసీఏలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి

Posted On: 11 NOV 2021 1:08PM by PIB Hyderabad

స్వాతంత్ర్యం వ‌చ్చిన 75 ఏళ్ల శుభ‌త‌రుణాన్ని పురస్కరించుకుని దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లోని ఈ-గవర్నెన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఈజీసీఏను  కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా  సివిల్ ఏవియేషన్ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ రాజీవ్ బన్సాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శ్రీ అరుణ్ కుమార్, పౌర విమానయాన పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సింధియా మాట్లాడుతూ గౌరవనీయులైన ప్రధానమంత్రి డిజిట‌ల్ ఇండియా దార్శనికతను స్వీకరించి డీజీసీఏ తన ఈ-గవర్నెన్స్ ప్లాట్‌ఫారమ్ ఈజీసీఏను అమలు చేసిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ DGCA యొక్క ప్రక్రియలు మరియు విధులను ఆటోమేషన్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, డీజీసీఏకు చెందిన ప‌నుల‌లో 70 శాతం వ‌ర‌కు క‌వ‌ర్ చేసేలా ఇందులో 99 సేవలు అనుక‌రించ‌బ‌డినాయి. ప్రారంభ దశలో ఇవి అమలు చేయబడుతున్నాయి. త‌దుప‌రి ద‌శ‌ల్లో 198 సేవలు కవర్ చేయబడతాయి. ఈ సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్ చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌ మార్పును తీసుకువస్తుందని- కార్యాచరణ అసమర్థతలను తొలగించడం, వ్యక్తిగత పరస్పర చర్యను తగ్గించడం, రెగ్యులేటరీ రిపోర్టింగ్‌ను మెరుగుపరచడం, పారదర్శకతను పెంపొందించడంతో పాటుగా ఉత్పాదకతను పెంచుతుందని ఆయన అన్నారు. నిర్బంధ నియంత్రణ నుండి నిర్మాణాత్మక సహకారం దిశ‌గా  నమూనా మార్పుకు డీజీసీఏ నాంది పలికిందని ఆయన ప్రశంసించారు. తాము ఈ వేదిక వినియోగాన్ని ఇప్పుడే ప్రారంభించామ‌ని ప్రయాణం ఇంకా ముగియలేదని, ఈ పరివర్తన నుండి కస్టమర్లు ఎలా ప్రయోజనం పొందారు, ఇంకా ఏమి చేయాలి అనే దానిపై త్వరలో సమీక్ష జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. త‌మ‌ది ప్ర‌జా సంక్షేమానికి ప్రతిస్పందించే ప్రభుత్వమని అన్నారు.  మహమ్మారి విస్తృతంగా విస్త‌రిస్తున్న ఈ త‌రుణంలో  ఆ విప‌త్క‌ర కాలాన్ని కూడా ఒక ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ గారి ప్ర‌భుత్వం ఒక అవకాశంగా మార్చిందని శ్రీ సింధియా వివ‌రించారు. ఈ ప్రాజెక్ట్ ఐటీ మౌలిక సదుపాయాలు, సర్వీస్ డెలివరీ ఫ్రేమ్‌వర్క్‌కు బలమైన పునాదిని అందిస్తుందని తెలిపారు.  ఈ-ప్లాట్‌ఫారమ్ వివిధ సాఫ్ట్‌వేర్‌లోని అప్లికేషన్‌లు, అన్ని ప్రాంతీయ కార్యాలయాలతో అనుసంధానం చేయ‌డం, సమాచార వ్యాప్తి, సురక్షిత వాతావరణంలో ఆన్‌లైన్ మరియు వేగవంతమైన సేవ‌ల‌ డెలివరీని అందించడానికి ఒక 'పోర్టల్స‌ ఎండ్-టు-ఎండ్ పరిష్కారాన్ని అందిస్తాయ‌ని తెలిపారు.
ఈ ప్రాజెక్టు డీజీసీఏ అందించే వివిధ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. డీజీసీఏ అందించే విధుల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఈ ప్లాట్‌ఫార‌మ్ సర్వీస్ ప్రొవైడర్‌గా టీసీఎస్‌ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పీడ‌బ్ల్యుసీ తో ప్రాజెక్ట్ అమలు చేయబడింది. ప్రారంభించిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన మంత్రి డీజీసీఏ టేకాఫ్ ఆన్ ఎ డిజిటల్ ఫ్లైట్' అనే కేస్ స్టడీని కూడా ఆవిష్కరించారు, ఇది ఈజీసీఏ అమలు ద్వారా డీజీసీఏ సంస్థ ప్రయాణాన్ని మ‌రింత సంగ్రహిస్తుంది. డీజీసీఏ ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఈజీసీఏ ప్లాట్‌ఫారమ్ ద్వారా వీటిని పరిష్కరించడానికి తీసుకున్న చర్యలు ఈ కేస్ స్టడీలో పొందుపరచబడ్డాయి. ఈ వేదిక ద్వారా దరఖాస్తుదారులు ఇప్పుడు వివిధ ర‌కాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వారి పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ దరఖాస్తులను డీజీసీఏ అధికారులు ప్రాసెస్ చేస్తారు. అనుమతులు మరియు లైసెన్స్‌లు ఆన్‌లైన్‌లోనే  జారీ చేయబడతాయి. పైలట్లు మరియు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు వారి ప్రొఫైల్‌లను వీక్షించడానికి మరియు ప్రయాణంలో వారి డేటాను నవీకరించడానికి మొబైల్ యాప్ కూడా దీనిలో ప్రారంభించబడింది. ఈజీసీఏ  చొరవ డీజీసీఏ యొక్క డిజిటల్ పరివర్తన ప్రయాణంలో ఒక మైలురాయి వంటిది. ఇది డీజీసీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల వారి  అనుభవాన్ని సుసంపన్నం చేస్తుంది. డీజీసీఏ కోసం ఇది 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' దిశలో ముందడుగు వేసింది. ఈ డిజిటల్ పరివర్తన డీజీసీఏ యొక్క భద్రతా నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌కు గణనీయమైన విలువను కూడా జోడిస్తుంది.
                                                                                   

***(Release ID: 1771072) Visitor Counter : 31