ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఆనంద్ శంకర్ పాండ్య కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 NOV 2021 9:11AM by PIB Hyderabad
ప్రముఖ రచయిత, మేధావి శ్రీ ఆనంద్ శంకర్ పాండ్యా గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘శ్రీ ఆనంద్ శంకర్ పాండ్యా గారు ఒక చేయి తిరిగిన రచయిత, అంతే కాక మేధావి కూడా. చరిత్ర ను గురించి, పబ్లిక్ పాలిసీ ని గురించి, ఆధ్యాత్మికత ను గురించి ఆయన విస్తృతం గా రచనలు చేశారు. భారతదేశం వృద్ధి చెందాలి అని ఆయన ఎంతగానో ఆకాంక్షించే వారు. విహెచ్ పి లో ఆయన చురుకు గా వ్యవహరించారు. నిస్వార్ధం గా సమాజానికి సేవ చేశారు. ఆయన మరణించడం తో నేను దు:ఖిస్తున్నాను.
శ్రీ ఆనంద్ శంకర్ పాండ్య గారి తో పలు సందర్భాల లో జరిపిన సంభాషణ లు నాకు మళ్ళీ మళ్లీ గుర్తు కు వస్తూ ఉన్నాయి. గొప్ప స్వాతంత్య్ర యోధుల తో భేటీ అయినప్పటి ఆయన మాటామంతీ గురించి, విభిన్న అంశాల పైన ఆయన అంతర్ దృష్టి గురించి తెలుసుకొంటూ ఉండడం మనస్సు ను సంతోషం తో నింపివేసేది. ఆయన కుటుంబం తో మాట్లాడాను; ఆయన మరణం పట్ల నా సంతాపాన్ని వ్యక్తం చేశాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1770926)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam