వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది- శ్రీ పీయూష్ గోయల్


ప్రపంచంలోనే అగ్రశ్రేణి సేవల ఎగుమతిదారుగా అవతరించే అవకాశం భారతదేశానికి ఉంది- శ్రీ పీయూష్ గోయల్

2020-21 ఆర్ధికసంవత్సరంలో $89 బిలియన్ల సేవల వాణిజ్య మిగులు

వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద రూ.56,027 కోట్లు విడుదలయ్యాయి

అసెంబ్లీ ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీకి భారతదేశ పరివర్తనను "సేవారంగం" పెంచుతోంది- శ్రీ పీయూష్ గోయల్

భారతదేశం 'బ్యాక్ ఆఫీస్' నుండి ప్రపంచపు 'బ్రెయిన్ ఆఫీస్'గా మారిపోయింది- శ్రీ గోయల్

Posted On: 09 NOV 2021 2:46PM by PIB Hyderabad

వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ గోయల్ ఈ రోజు మాట్లాడుతూ భారతదేశం 2030 నాటికి $1 ట్రిలియన్ల సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 'సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్- గ్లోబల్ సర్వీసెస్ కాన్క్లేవ్ 2021"లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

భారత ఆర్థికాభివృద్ధికి సేవలు కీలక చోదకమని మంత్రి అన్నారు.

సేవల రంగం దాదాపు 2.6 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తోందని మరియు భారతదేశం యొక్క మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో సుమారు 40% దోహదపడుతుందని ఆయన అన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో సేవల వాణిజ్య మిగులు $89 బిలియన్లు మరియు ఇది అతిపెద్ద ఎఫ్‌డిఐ గ్రహీత (2000-2021 ఎఫ్‌డీఐ ప్రవాహాలలో 53%) అని ఆయన తెలిపారు.

గ్లోబల్ సర్వీసెస్ కాన్క్లేవ్ 2021 యొక్క థీమ్ 'ఇండియా సర్వ్స్: ఎక్స్‌ప్లోరింగ్ పొటెన్షియల్ గ్రోత్ సెక్టార్‌ బియాండ్ ఐటి/ఐటిఈలు'.

నైపుణ్యాలు, స్టార్టప్‌లు మరియు ఐటి సొల్యూషన్‌ల ద్వారా ఆధారితమైన సేవా రంగం మా పోటీ ప్రయోజనమని నొక్కిచెప్పిన మంత్రి.. నేడు భారతీయ సేవలకు సార్వత్రిక ఆమోదం మరియు సార్వత్రిక ఆకర్షణ అనే జంట శక్తి ఉందని మంత్రి అన్నారు.

మహమ్మారి సమయంలో 'వర్క్ ఫ్రమ్ హోమ్'ను ప్రారంభించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను శ్రీ గోయల్ ప్రశంసిస్తూ.. ఇతర దేశాలలో సేవల వాణిజ్యం అణగారిన స్థితిలో ఉన్నప్పటికీ, భారతదేశ సేవల రంగం అపారమైన స్థితిస్థాపకతను కనబరిచిందని తెలిపారు.

"కొవిడ్-19" కారణంగా నష్టపోయిన పర్యాటకం, ఆతిథ్యం మొదలైన రంగాలు పునరుద్ధరణ సంకేతాలను చూపిస్తున్నాయి" అని ఆయన చెప్పారు.

ఈ రంగం ఎదుర్కొన్న కష్ట సమయాల్లో ఎదుగుదలకు దారితీసిన స్ఫూర్తిని అభినందిస్తూ..కష్ట సమయాలు ఉండవని, కఠినమైన వ్యక్తులు కొనసాగుతారని శ్రీ గోయల్ అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులందరి నిస్వార్థ సేవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

2020లో భారత్ ప్రపంచంలోనే 7వ అతిపెద్ద సేవల ఎగుమతిదారుగా అవతరించి రెండు స్థానాలు ఎగబాకిందని మంత్రి తెలిపారు. అక్టోబరు 21లో సర్వీసెస్ పీఎంఐ దశాబ్ద గరిష్ట స్థాయి 58.4కి పెరిగిందని ఆయన చెప్పారు.

ప్రపంచంలోనే అగ్రశ్రేణి సేవల ఎగుమతిదారుగా అవతరించే అవకాశం భారత్‌కు ఉందని నొక్కిచెప్పిన శ్రీ గోయల్..అసెంబ్లీ ఆర్థిక వ్యవస్థ నుండి విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు భారతదేశ పరివర్తనను సర్వీసెస్ ప్రోత్సహిస్తోందని అన్నారు.

గ్లోబల్ సెంటిమెంట్లు 'వై ఇండియా' నుంచి 'వై నాట్ ఇండియా'గా మారుతున్నాయని ఆయన అన్నారు.

భారతదేశం 'బ్యాక్ ఆఫీస్' నుండి ప్రపంచంలోని 'బ్రెయిన్ ఆఫీస్'గా మారిందని తెలిపిన శ్రీ గోయల్.. నేడు, భారతదేశ సేవల ఎగుమతి ఎక్కువగా ఐటి/ఐటీఈలను కలిగి ఉందని మరియు ఇతర వృద్ధి రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ఉన్నత విద్య వంటి అధిక వృద్ధి పథంలో భారతదేశ సేవల రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల కొన్ని కీలకమైన రంగాలను మంత్రి జాబితా చేశారు. యుఎస్, కెనడా మొదలైన దేశాల విద్యార్థులు వారసత్వం, కళ మరియు సంస్కృతి అధ్యయనాల కోసం భారతదేశాన్ని ఇష్టపడతారని ఆయన గుర్తు చేశారు.

మార్కెట్ యాక్సెస్ అవకాశాలను (ఎఫ్‌టిఎ) ప్రభుత్వం చురుకుగా కొనసాగిస్తోందని మరియు ఎస్‌ఇఐఎస్‌కు ప్రత్యామ్నాయ పథకంపై పని చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఎంఎస్‌ఎంఈలతో సహా వ్యాపారాల కోసం కొలేటరల్-రహిత ఆటోమేటిక్ లోన్‌ల ద్వారా ప్రభుత్వం సేవా రంగానికి మద్దతునిస్తుందని ఆయన అన్నారు. వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద రూ. 56,027 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారతదేశం యొక్క కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ఏఐ, బిగ్ డేటా, రోబోటిక్స్ మొదలైన అభివృద్ధి చెందుతున్న రంగాల గురించి ఆయన మాట్లాడారు.

జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా చేర్చి సమగ్ర ఎగుమతి వ్యూహాన్ని రూపొందించడంలో రాష్ట్రాలకు సహాయం చేయాల్సిన అవసరాన్ని మంత్రి ఎత్తిచూపారు.

శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రభుత్వం సులభతర మరియు ఎనేబుల్‌గా భారతీయ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎదగడానికి మరియు జీవితాలను స్పర్శించడానికి సహాయపడిందని అన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల ఐటీ రంగం రాణించగలుగుతున్నదని ఆయన ఉద్ఘాటించారు. ఈ రంగం ప్రోత్సాహకాలను కొనసాగించకుండా పోటీతత్వ బలంతో నిలదొక్కుకోవడం అభినందనీయమన్నారు.

ముందుకు వెళ్లే మార్గాన్ని వివరిస్తూ మనం మరిన్ని ప్రమాణాలను ప్రవేశపెట్టి నాణ్యతను మెరుగుపరచాలని మంత్రి అన్నారు. సేవల్లో వాల్యూ చైన్‌ను మనం పెంచుకోవాలి మరియు మన బలం ఉన్న ప్రాంతాలను ఎంచుకుని దానిని విస్తరించాలి అని ఆయన అన్నారు. లీగల్/అకౌంటింగ్ నిపుణుల కోసం మార్కెట్లను విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు.

శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయిని ఉటంకిస్తూ, శ్రీ గోయల్ "మన లక్ష్యం అంతులేని ఆకాశం అంత ఎత్తుగా ఉండవచ్చు, కానీ ముందుకు నడవడానికి మన మనస్సులో సంకల్పం ఉండాలి, చేయి చేయి కలిపితే విజయం మనదే అవుతుంది" అని శ్రీ గోయల్ అన్నారు.


 

***



(Release ID: 1770393) Visitor Counter : 200