ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశ వ్యాక్సిన్లు , దేశంలో అమలవుతున్న టీకాల కార్యక్రమానికి ప్రపంచవ్యాప్త ఆమోదం
భారతదేశ టీకా సర్టిఫికెట్ కు 96 దేశాల ఆమోదం.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
09 NOV 2021 4:24PM by PIB Hyderabad
దేశంలో అర్హులైన వారందరికీ కోవిడ్-19 టీకాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల దేశంలో టీకాలు తీసుకున్న టీకాల కార్యక్రమం 2021 21న 100 కోట్ల మైలురాయి దాటింది. ఒకవైపు టీకాల కార్యక్రమం వేగంగా అమలు జరగడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్రం మరోవైపు టీకాల కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించి టీకాలు తీసుకున్నవారికి ప్రయోజనం కలిగేలా చూడడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విద్య, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం టీకాలు తీసుకున్నవారు సులువుగా ధైర్యంగా వెళ్లేలా చూడడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు తెలిపారు. ప్రస్తుతం 96 దేశాలు టీకాలు తీసుకున్న భారతీయులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. కోవిషీల్డ్/డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన/జాతీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్‌లను తీసుకున్నట్టు జారీ అయిన టీకా ధృవీకరణ పత్రాలను ఈ దేశాలు ఆమోదిస్తున్నాయని ఆయన అన్నారు. దీనికి సంఘీభావంగా ఈ దేశాల నుంచి వస్తున్న వారికి 2021 అక్టోబర్ 20వ తేదీన అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలలో ( https://www.mohfw.gov.in/pdf/GuidelinesforInternationalArrival20thOctober2021 ) కొన్ని మిహాయింపులను ఇస్తున్నామని మంత్రి తెలిపారు. విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్న వారు అంతర్జాతీయ వాక్సినేషన్ సర్టిఫికెట్ ను కోవిన్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని డాక్టర్ మాండవీయ తెలిపారు.
భారతదెశ కోవిడ్ టీకా సర్టిఫికెట్ ను కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బంగ్లాదేశ్, మాలి, ఘనా, సియెర్రా లియోన్, అంగోలా, నైజీరియా, బెనిన్, చాడ్, హంగేరీ, సెర్బియా, పోలాండ్, ది ఎస్ లో వక్ రిపబ్లిక్, స్లోవేనియా, క్రొయేషియా, బల్గేరియా, టర్కీ, గ్రీస్, ఫిన్లాండ్ , ఎస్టోనియా, రొమేనియా, మోల్డోవా, అల్బేనియా, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టెయిన్, స్వీడన్, ఆస్ట్రియా, మోంటెనెగ్రో, ఐస్లాండ్, ఈశ్వతిని, రువాండా, జింబాబ్వే, ఉగాండా, మలావి, బోట్స్వానా, నమీబియా, కిర్గిజ్మెన్ రిపబ్లిక్, బెలారస్,అర్మేనియా,ఉక్రెయిన్,అజర్బేజాన్, కజాఖ్స్తాన్ , రష్యా, జార్జియా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, అండోరా, కువైట్, ఒమన్, యూఏఈ , బహ్రెయిన్, ఖతార్, మాల్దీవులు, కొమొరోస్, శ్రీలంక, మారిషస్, పెరూ, జమైకా, బహామాస్, బ్రెజిల్ , గయానా, ఆంటిగ్వా బార్బుడా, మెక్సికో, పనామా, కోస్టా రికా, నికరాగ్వా, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే, కొలంబియా, ట్రినిడాడ్ టొబాగో, కామన్వెల్త్ ఆఫ్ డొమినికా, గ్వాటెమాల,ఎల్ సాల్వడార్, హోండురాస్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, నేపాల్, ఇరాన్, లెబనాన్, పాలస్తీనా , సిరియా, దక్షిణ సూడాన్, ట్యునీషియా, సూడాన్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, మంగోలియా, ఫిలిప్పీన్స్ దేశాలు ఆమోదిస్తున్నాయి.
సమస్యలు లేకుండా అంతర్జాతీయ ప్రయాణాలు సాగేలా చూడడానికి దేశ వ్యాక్సిన్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్ తీసుకున్న వారికి జారీ చేసే సర్టిఫికెట్ కు మిగిలిన దేశాల నుంచి ఆమోదం పొందడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.
***
(Release ID: 1770391)
Visitor Counter : 185