ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2021 9:12AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 108.47 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 11,451 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.24% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 13,204 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,37,63,104 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.42% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,42,826. ఇది 262 రోజుల కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.32%) గత 35 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (1.26%) గత 45 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 61.60 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(రిలీజ్ ఐడి: 1770017) సందర్శకుల సూచీ సంఖ్య : : 194
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam