ప్రధాన మంత్రి కార్యాలయం
కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని , శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి
“కొన్ని అనుభవాలు చాలా అతీంద్రియమైనవి, అవి మాటల్లో చెప్పలేనంత అనంతమైనవి, బాబా కేదార్‌నాథ్ ధామ్‌లో నాకు ఈ విధంగా అనిపిస్తుంది"
"ఆది శంకరాచార్యుల వారి జీవితం అసాధరణమైనది,సామాన్యుల సంక్షేమానికి అంకిమైనది"
భారతీయ తాత్వికత మానవాళి సంక్షేమం గురించి మాట్లాడుతుంది , జీవితాన్ని సంపూర్ణంగా దర్శిస్తుంది. ఆదిశంకరాచార్య ఈ సత్యాన్ని సమాజానికి తెలిపే కార్యక్రమాలు చేపట్టారు”
మన సాంస్కృతిక వారసత్వ విశ్వాస కేంద్రాలు సగర్వంగా చూడబడుతున్నాయి.
“అయోధ్యలో అద్భుత శ్రీ రామ మందిరం రాబోతున్నది. అయోధ్యకు పూర్వవైభవం తిరిగి వస్తున్నది.”
“ ఇవాళ ఇండియా ఇందుకు తనకు కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నది.
గడువులు , లక్ష్యాల విషయంలో పట్టనట్టుండడం ఆమోదయోగ్యం కాదు"
"ఉత్తరాఖండ్ ప్రజల అపారమైన సామర్థ్యం పైన , వారి సామర్థ్యాలపై గల పూర్తి విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ అభివృద్ధి 'మహాయజ్ఞ'లో పాలుపంచుకుంది"
Posted On:
05 NOV 2021 11:27AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్ర శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని . అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కేదార్ నాథ్‌లో అమలు జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనులను ప్రదానమంత్రి పరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేదార్ నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహింయారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్‌లు, దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాలలో కేదార్ నాథ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను కేదార్ ధామ్ ప్రధాన కార్యక్రమంతో అనుసంధానం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, భారతదేశానికి చెందిన గొప్ప రుషుల పరంపరను గుర్తు చేసుకున్నారు. కేదార్ నాథ్ సందర్శన తనకు అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కోన్నారు. నిన్న నౌషెరాలో సైనికులతో దివాళీ సందర్భంగా మాట్లాడినపుడు 130 కోట్ల మంది భారతీయుల భావాలను వారికి చేరవేశానన్నారు.ఇవాళ గోవర్ణన పూజ రోజున , తాను సైనిక వీరుల గడ్డపైన ,బాబా కేదార్ దివ్య ధామంలో ఉన్నానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రామచరిత మానస్ లోని పంక్తులను ఆలపించారు. అంటే కొన్ని అనుభవాలు చాలా అతీంద్రియమైనవని, చాలా అనంతమైనవని, వాటిని పదాలలో వ్యక్తీకరించలేమని అన్నారు. బాబా కేదార్‌నాథ్ ఆశ్రయంలో తాను ఇలాంటి భావనకు గురయ్యానని చెప్పారు.
కేదార్ నాథ్‌లో కల్పిస్తున్న నూతన సదుపాయాలైన షెల్టర్, పశ్రీసిలిటేషన్ ఏంద్రాలు వంటివి అక్కడి పురోహితుల, భక్తుల సులభతర జీవనానికి వీలు కలిగిస్తుందని, ఇవి భక్తులు దైవ కార్యకలాపాలలో పూర్తిగా మునిగితేలడానికి ఉపకరిస్తాయని అన్నారు. 2013 లో వచ్చిన కేదార్ నాథ్ వరదల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కొద్ది సంవత్సరాల క్రితం వరదల వల్ల జరిగిన నష్టం ఊహించలేనంతగా ఉందని అన్నారు.
కేదార్ నాథ్ సందర్శనకు వచ్చిన ప్రజలు, మళ్లీ కేదార్ నాధ్ కోలుకోగలదా అనుకునేవారు. కానీ నా అంతర్ వాణి మాత్రం, కేదార్‌నాథ్ ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా తిరిగి వైభవాన్ని పొందగలదని చెబుతూ ఉండేది అని ఆయన అన్నారు. కేదార్ నాధుని ఆశీస్సులు, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులు, భుజ్ భూకంపం తర్వాత పరిస్థితులను చక్కబరచడంలో అనుభవం వంటివి ఆ క్లిష్ట సమయంనుంచి బయటపడడానికి ఉపకరించాయని అన్నారు. ఇంతకు ముందు తనను పెంచి పోషించిన స్థానానికి సేవ చేయడం తన జీవితంలో వరంగా భావిస్తున్నానని అన్నారు. కేదార్ ధామ్ అభివృద్ధి పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్న కార్మికులు, అర్చకులు, అర్చకుల కుటుంబీకులు, అధికారులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. డ్రోన్ ల ద్వారా, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖ్యమంత్రి ఇక్కడి కార్యకలాపాలను ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ ప్రాచీన పుణ్యభూమిలో ఆధునికత, అనంత తత్వాల మేళవింపు, ఈ అభివృద్ధి పనులు భగవంతుడైన శంకరుడి కృప ఫలితమేనని ఆయన అన్నారు.
ఆది శంకరాచార్య గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, శంకర్ అనే పదానికి సంస్కృతంలో అర్ధం "शं करोति सः అని, అంటే, లోక కల్యాణకారకుడని అర్థమన్నారు. శంకరాచార్యల వారు అక్షరాలా దీనిని నిజం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆదిశంకరాచార్యుల వారు అసాధారణమైన మహానుభావుడని, వారు సామాన్యుడి సంక్షేమానికి అంకితమయ్యారని ఆయన అన్నారు.
ఆధ్యాత్మికత మతం మూస పద్ధతులతో పాత పద్ధతులతో ముడిపడి ఉండటం ప్రారంభించిన ఒకానొక కాలాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అయితే, భారతీయ తత్వశాస్త్రం మానవ సంక్షేమం గురించి మాట్లాడుతుందని, జీవితాన్ని సమగ్ర దృష్టితో చూస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ వాస్తవాన్ని సమాజం గుర్తించేలా కార్యలాపాలను ఆదిశంకరాచార్యులవారు చేపట్టారని ప్రధానమంత్రి చెప్పారు.
ఇవాళ, మన సాంస్కృతిక వారసత్వ కేంద్రాలు గర్వకారణమైన కేంద్రాలుగా చూడాల్సిన రీతిలో చూడబడుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. అయోధ్యలో భారీ శ్రీరామ మందిరం రూపుదిద్దుకుంటున్నదని ప్రధానమంత్రి తెలిపారు. అయోధ్య తిరిగి తన పురా వైభవాన్ని పొందుతున్నదన్నారు. సరిగ్గా రెండు రోజుల క్రితం ప్రపంచం మొత్తం అయోధ్యలో దీపోత్సవాన్ని తిలకించిందని ప్రధానమంత్రి తెలిపారు.
భారతదేశం ప్రాచీన సాంస్కృతిక రూపం ఎలా ఉండేదో ఈ రోజు మనం ఊహించవచ్చు” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశం తన ఘన వారసత్వంపై ఎంతో విశ్వాసంతో ఉందని ప్రధాన మంత్రి అన్నారు. “ఈ రోజు, భారతదేశం తన కోసం కఠినమైన లక్ష్యాలను గడువులను నిర్దేశించుకుందని ఆయన అన్నారు..
గడువులు , లక్ష్యాల గురించి విశ్వాస రాహిత్యంతో ఉన్నట్టు వ్యవహరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్ర సమరయోధుల సహకారం గురించి ప్రస్తావిస్తూ, భారతదేశ ఉజ్వల స్వాతంత్ర సమరానికి సంబంధించిన ప్రదేశాలను , పవిత్రమైన పుణ్యక్షేత్రాలను ప్రజలు సందర్శించి భారతదేశ స్ఫూర్తిని తెలుసుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు..
21 వ శతాబ్దం మూడవ దశాబ్దం ఉత్తరాఖండ్ దే నని ప్రధానమంత్రి అన్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయని, అలాగే చార్ ధామ్ జాతీయ రహదారులతో అనుసంధాన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో భక్తులు కేదార్ నాథ్‌జీ దర్శనానికి కేబుల్ కార్‌లో వచ్చే విధంగా పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. మేమ్‌కుండ్ సాహిబ్ జి మందిరం ఇక్కడకు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి అన్నారు. హేమ్‌కుండ్ సాహిబ్ జి దర్శనాన్ని సులభతరంం చేసేందుకు రోప్‌వే నిర్మాణపనులు సాగుతున్నట్టు ఆయన తెలిపారు. "ఉత్తరాఖండ్ ప్రజల అపారమైన సామర్థ్యాన్ని , వారి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ అభివృద్ధి 'మహాయజ్ఞం'లో నిమగ్నమై ఉంది" అని ఆయన అన్నారు.కోవిడ్ పై పోరాటంలో ఉత్తరాఖండ్ చూపిన క్రమశిక్షణను ప్రధానమంత్రి కొనియాడాఉ. భౌగోళిక ఇబ్బందులను అదిగమించి ఇవాళ ఉత్తరాఖండ్ ప్రజలు నూరు శాతం సింగిల్ డోస్ కోవిడ్ వాక్సిన్ లక్ష్యాన్ని సాధించారని ఆయన అన్నారు. ఇది ఉత్తరాఖండ్ బలం, శక్తి అని ఆంటూ, ఉత్తరాఖండ్ ఎత్దైన ప్రదేశంలో ఉందని, ఉత్తరాఖండ్ దానిని మించి సమున్నత స్థాయికి ఎదగగలదని ప్రధానమంత్రి అన్నారు.
***
(Release ID: 1769678)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam