వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి


ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్ మరియు ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రభుత్వం వసూలు చేస్తున్న 2.5% ప్రాథమిక సుంకాన్ని పూర్తిగా రద్దుచేసింది.

వంట నూనెల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు సోయాబీన్ నూనెలపై దిగుమతి సుంకాలను హేతుబద్ధం చేస్తోంది

ప్రధాన వంటనూనెల ధరలను హోల్సేల్ వ్యాపారులు కూడా రూ.4 నుంచి రూ.7 వరకు తగ్గిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీలక ప్రమేయం వంటనూనెల ధరలను తగ్గించడానికి దారితీసింది.

Posted On: 05 NOV 2021 4:17PM by PIB Hyderabad

గత ఏడాది కాలంగా వంటనూనెల ధరలు నిరంతరంగా పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ముడి పామాయిల్, ముడి  సోయాబీన్ ఆయిల్ మరియు ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక సుంకాన్ని 2.5% నుంచి పూర్తిగా  తగ్గించింది. ఈ నూనెలపై అగ్రి-సెస్‌ను ముడి పామ్‌ ఆయిల్‌పై 20% నుంచి 7.5%కి, ముడి సోయాబీన్‌ ఆయిల్‌,  ముడి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై 5%కి తగ్గించారు.

పైన పేర్కొన్న తగ్గింపు ఫలితంగా మొత్తం సుంకం ముడి పామాయిల్‌పై 7.5% మరియు ముడి సోయాబీన్ ఆయిల్ మరియు ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5%కి పరిమితమైంది. ఆర్‌బిడి పామోలిన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ మరియు రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక సుంకాన్ని ప్రస్తుత 32.5% నుండి 17.5%కి తగ్గించారు.

తగ్గింపుకు ముందు, అన్ని రకాల ముడి వంట నూనెలపై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ 20%. తగ్గింపు తర్వాత ముడి పామ్ ఆయిల్‌పై ప్రభావిత సుంకం 8.25%, ముడి సోయాబీన్ ఆయిల్ మరియు ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్పై 5.5% చొప్పున ఉంటాయి.

వంట నూనెల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు సోయాబీన్ నూనెలపై దిగుమతి సుంకాలను హేతుబద్ధం చేసింది, ఎన్సీడీఈఎక్స్లో ఆవాల నూనెలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ నిలిపివేయబడింది మరియు స్టాక్ పరిమితులు కూడా విధించ బడ్డాయి.

అదానీ విల్మార్ మరియు రుచి పరిశ్రమలతో సహా ప్రధాన వంట నూనెల  కంపెనీలు పండుగ సీజన్‌లో నూనె ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు టోకు ధరలను  లీటరుకు రూ.4 శాతం నుంచి -రూ.7శాతం  ధరలను తగ్గించారు.

జెమినీ ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ అండ్ సాల్వెంట్, విజయ్ సోల్వెక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ మరియు ఎన్‌కె ప్రొటీన్ కంపెనీలు కూడా వంట నూనెల ధరలను తగ్గించిన జాబితాలో ఉన్నాయి.  

అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన ప్రమేయం వంటనూనెల ధరలను తగ్గించడానికి కారణమైంది.

వంట నూనెల ధరలు ఏడాది క్రితం కంటే ఎక్కువగా ఉన్నాయి కానీ అక్టోబర్ నుండి తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సెకండరీ ఎడిబుల్ ఆయిల్స్, ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

31/10/2021 కంటే 03/11/2021 నాటికి రిటైల్ ధరలు (యూనిట్: రూ/కేజీ)

తగ్గిన పామ్ఆయిల్ ధరలు రూపాయల్లో
ఢిల్లీ - రూ. 6
అలీఘర్ - రూ. 18
జోవై, మేఘాలయ- రూ. 10
దిండిగల్, తమిళనాడు -రూ. 5
కడలూరు, తమిళనాడు -రూ. 7

తగ్గిన వేరుశెనగ నూనె ధరలు రూపాయల్లో..
ఢిల్లీ - రూ. 7
సాగర్, మధ్యప్రదేశ్ -రూ. 10
జోవై, మేఘాలయ - రూ. 10
కడలూరు, తమిళనాడు -రూ. 10
కరీంనగర్, తెలంగాణ- రూ. 5
అలీగఢ్, ఉత్తరప్రదేశ్ - రూ. 5


తగ్గిన సోయా ఆయిల్ ధరలు రూపాయల్లో

ఢిల్లీ రూ. 5
లూథియానా, పంజాబ్ - రూ. 5
అలీగఢ్, ఉత్తరప్రదేశ్ - రూ. 5
దుర్గ్, ఛత్తీస్‌గఢ్- రూ. 11
సాగర్, మధ్యప్రదేశ్ - -రూ.7
నాగ్‌పూర్, మహారాష్ట్ర - రూ. 7
జోవై, మేఘాలయ -రూ. 5

తగ్గిన సన్ఫ్లవర్ నూనె ధరలు
ఢిల్లీ - రూ.10
రూర్కెలా, ఒడిషా - రూ. 5
జోవై, మేఘాలయ - రూ. 20

***



(Release ID: 1769676) Visitor Counter : 174