ఉక్కు మంత్రిత్వ శాఖ

ఎన్ఎండిసి అత్యుత్త‌మ అక్టోబ‌ర్ నెల ప‌ని తీరు

Posted On: 03 NOV 2021 1:48PM by PIB Hyderabad

ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్ఎండిసి) అక్టోబ‌ర్ నెల‌లో 3.35 ఎంటిల ఇనుప ఖ‌నిజ ఉత్ప‌త్తి, 3.58 ఎంటిల అమ్మ‌కాల‌తో గ‌తంలోక‌న్నా మెరుగైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శిస్తూ పురోగ‌మిస్తోంది. మైనింగ్ రంగంలో అగ్ర‌గామిగా ఉన్న సంస్థ 37% వృద్ధిని న‌మోదు చేసింది. ఇది సంస్థ ప్రారంభ‌మైన నాటి నుంచి ఏ అక్టోబ‌ర్‌లోనూ ఇంత అధిక వృద్ధిని న‌మోదు చేయ‌క‌పోవ‌డ‌మే కాదు, గ‌త ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మ‌కాల‌లో 42% పెరిగాయి.
ఆర్థిక సంవ‌త్స‌రం 2022 అక్టోబ‌ర్ 21 వ‌ర‌కు- తొలి ఏడు నెల‌ల‌కు సంచిత ఉత్ప‌త్తి, అమ్మ‌కాల గ‌ణాంకాలు 21.04 మెట్రిక్ ట‌న్నులు, 22.08 ఎంటిలుగా ఉంది. గ‌తంలో  ఏ అక్టోబ‌ర్ నెల‌లో లేనంత ఉత్త‌మ ప‌ని తీరును న‌మోదు చేసింది. ఉత్ప‌త్తిలో కంపెనీ 43% పెరుగుద‌ల‌ను సాధించింది. ఇందులో ఈ అక్టోబ‌ర్‌లో దోనిమ‌లైలో చేసిన 0.5 ఎంటిలు, గ‌త ఏడాదితో పోలిస్తే 43% అధికంగా అమ్మ‌కాలు ఉన్నాయి. 

 

(మిలియ‌న్ ట‌న్నుల‌లో)

 

 

 

October
2020

October

2021

Up by
%

Upto October

2020

Upto October 2021

Up by

%

Production

2.43

3.33

37%

14.66

21.04

43%

Sales

2.52

3.58

42%

15.43

22.08

43%

 

మ‌రొక‌సారి  అద్భుత‌మైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించిన ఎన్ఎండిసి బృందాన్ని అభినందిస్తూ, భార‌త‌దేశంలో భారీ స్థాయి ఇనుప ఖ‌నిజ ఉత్ప‌త్తిదారుగా ఎన్ఎండిసి ప‌నితీరు అన్న‌ది  మైనింగ్‌, ఉత్ప‌త్తి రంగాల ప్ర‌బ‌లంగా ఉన్న‌ సానుకూల మార్కెట్ సెంటిమెంట్‌ను సూచిస్తుంద‌ని ఎన్ెండిసి సిఎండి సుమీత్ దేబ్ పేర్కొన్నారు. .పండుగ‌ల నెల అయిన అక్టోబ‌ర్‌ను జ‌రుపుకోవ‌డానికి మ‌రొక కార‌ణ‌ముంద‌ని అంటూ, మ‌రొక అద్భుత‌మైన నెల‌కు సిబ్బందిని అభినందిస్తున్నాని అన్నారు. దీనితోపాటుగా ఎన్ఎండిసి కుటుంబం త‌రుఫున అంద‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు చెప్పారు.             

***

 



(Release ID: 1769355) Visitor Counter : 124