ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రి ఆదేశాల మేరకు డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలు/యూటీలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది.
డెంగ్యూపై సమర్థవంతమైన నియంత్రణ మరియు నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు/యుటిలకు ఈ కేంద్ర బృందాలు సహాయం అందిస్తాయి
Posted On:
03 NOV 2021 9:57AM by PIB Hyderabad
డెంగూ వ్యాధి గుర్తింపు, చికిత్స, నిర్ధారణ పరీక్షల్లో వివిధ రాష్ట్రాలకు సహాయం అందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డెంగ్యూ ఎక్కువగా ఉన్నట్లు నివేదించిన 9 రాష్ట్రాలు/యుటిలకు ఉన్నత స్థాయి బృందాలను పంపింది. నవంబర్ 1, 2021న ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిపై సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. హర్యానా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మరియు జమ్మూ & కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి.
డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న అన్ని రాష్ట్రాలు/యూటీలకు సహాయం అందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 1,16,991 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
గత ఏడాది ఇదే కాలంలోని కేసుల సంఖ్యతో పోల్చితే కొన్ని రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో కేసులు ఈ అక్టోబర్‌లో నమోదయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో మొత్తం 15 రాష్ట్రాలు/యూటీలు తమ గరిష్ట కేసులను నివేదిస్తున్నాయి; అక్టోబర్ 31 వరకు దేశంలోని మొత్తం డెంగ్యూ కేసుల్లో 86% ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్న 9 రాష్ట్రాలు/యూటీలకు ఎన్ విబిడిసిపీ,ఎన్ సీడీసీ మరియు ప్రాంతీయ కార్యాలయాల నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపారు.
సమర్థవంతమైన ప్రజారోగ్య ప్రతిస్పందనను పెంచడానికి రాష్ట్రాలకు సహాయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఈ బృందాలు పని చేస్తాయి. వెక్టర్ నియంత్రణ స్థితి, కిట్‌లు మరియు ఔషధాల లభ్యత, ముందస్తుగా గుర్తించడం, ఔషధాల లభ్యత మరియు వినియోగం, యాంటీ లార్వా మరియు యాంటీ-వయోజన వెక్టర్ నియంత్రణ చర్యలు మొదలైన వాటిపై నివేదిక ఇవ్వాలని బృందాలను కోరింది. ఆయా బృందాల పరిశీలనలను రాష్ట్ర ఆరోగ్య అధికారులకు కూడా తెలియజేస్తారు.
****
(Release ID: 1769154)
Visitor Counter : 190