భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఎఫ్‌సీఐ టెండర్‌ల‌లో బిడ్ రిగ్గింగ్, కార్టలైజేషన్‌కు పాల్పడినట్లు తేలిన సంస్థలపై నిలిపివేత, కాంట్రాక్ట్ విరమ‌ణ‌ ఉత్తర్వులు జారీ

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2021 10:51AM by PIB Hyderabad

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 29 అక్టోబర్ 2021న  జారీ చేసిన‌ తుది ఉత్తర్వులు.. పోటీ వ్యతిరేక ఒప్పందాలను నిషేధిస్తాయి. ఎఫ్‌సీఐ టెండ‌ర్ల‌లో పోటీ చట్టం, 2002లోని సెక్షన్ 3(1)లోని సెక్షన్ 3(3)(డి)తో చదవబడిన నిబంధనలను మొత్తం ఆరు సంస్థ‌లు ఉల్లంఘించినట్లు తేలింది.  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ధరలను నిర్ణయించడం, టెండర్లను కేటాయించడం, బిడ్ ధరలను సమన్వయం చేయడం మరియు బిడ్డింగ్ ప్రక్రియలో అవకతవకలు చేయడం ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సంస్థ‌కు తక్కువ నాణ్య‌త కలిగిన పాలీ ఇథిలిన్ కవర్‌లను (ఎల్‌డీపీఈ) సరఫరా చేసిన‌ట్టుగా తేలింది. ఈ అవ‌క‌త‌వ‌క‌ల్లో ఆరు సంస్థలు పాలుపంచుకున్నట్టు సీసీఐ  గుర్తించింది.  ఎఫ్‌సీఐ తరపున దాఖలు చేసిన రిఫరెన్స్ ఆధారంగా కేసు ప్రారంభించబడింది. ఈ నేపథ్యంలో, ఎఫ్‌సీఐ ద్వారా తేలిన టెండర్లలో బిడ్ రిగ్గింగ్,  కార్టెలైజేషన్‌కు పాల్పడినట్లు తేలిన ఆరు సంస్థలపై కాంట్ర‌క్ట్  విరమణ, విరమణ ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ సీసీఐ ఎటువంటి ద్రవ్య పెనాల్టీని విధించడం మానుకుంది, ఎందుకంటే ఆరు సంస్థలలో నాలుగు తక్కువ పెనాల్టీ దరఖాస్తులను దాఖలు చేశాయి. వారు చేసిన త‌ప్పును అంగీకరించాయి. దర్యాప్తు సమయంలో వారు చేసిన ఆక్ర‌మాల‌ను కూడా అంగీకరించాయి, తద్వారా సీసీఐ సహకరించారు. అంతేకాకుండా ఈ కంపెనీలు పరిమిత సిబ్బంది/ త‌క్కువ ట‌ర్నోవర్‌తో కూడిన ఎంఎస్ఎంఈ సంస్థ‌లు. కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ఉత్పన్నమైన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, మహమ్మారి నేపథ్యంలో ఎంఎస్ఎంఈ రంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ఎఫ్‌సీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. రిఫ‌రెన్స్‌. నం. 07 ఆఫ్ 2018ల ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డ‌రు కాపీ http://www.cci.gov.inలోని CCI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.


(రిలీజ్ ఐడి: 1768843) సందర్శకుల సూచీ సంఖ్య : : 205
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali