సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సర్ధార్ పటేల్ స్మారక 2021 ఉపన్యాసం ఇచ్చిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్
నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2021 11:02AM by PIB Hyderabad
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రసార భారతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా 2021 అక్టోబర్ 31 వ తేదీన ఆకాశవాణిలో ప్రతిష్టాత్మక సర్దార్ పటేల్ స్మారక 2021 ఉపన్యాసాన్ని దేశ మొదటి సైనిక దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, పివిఎస్‌ఎం, ఎవిఎస్‌ఎం, ఎస్‌యువై.ఎస్.ఎం. ఎస్ఎం విఎస్ఎం ఏడిసి వెలువరించారు. ' దేశాభివృద్ధిలో భారత సైనిక దళాల పాత్ర; అనే అంశంపై జనరల్ రావత్ ప్రసంగించారు.
దేశ ఘన చరిత్రను ప్రస్తావించిన జనరల్ రావత్ గతంలో మౌర్య రాజుల కాలంలో చిన్న చిన్న రాజ్యాలతో భారతదేశం ఉండేదని అన్నారు. వివిధ సంస్కృతులు, 22 అధికార భాషలు, 200 కి పైగా లిపులు, 12 కి మించి జాతులు , ఏడు ప్రధాన మతాలు, ఉప జాతులు, ఉప కులాలు, 68 కి పైగా సామాజిక సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న భారతదేశం మనోహరంగా, సంక్లిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సర్ధార్ పటేల్ తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిలిచిందని జనరల్ రావత్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా సవాళ్ళను ఎదుర్కొని బలమైన శక్తిగా భారతదేశం అభివృద్ధి సాధించాలన్న దృఢ సంకల్పంతో సర్దార్ పటేల్ పనిచేశారని అన్నారు.
565 రాచరిక సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశ నిర్మాణానికి సర్దార్ పటేల్ చేసిన కృషి, పట్టుదలతో అకుంఠిత దీక్షతో పనిచేసి విజయం సాధించారని జనరల్ రావత్ అన్నారు. భద్రత, న్యాయం, ఆర్థికాభివృద్ధి, ప్రజాస్వామ్య
విలువలు మూలస్తంభాలుగా స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందేలా సర్దార్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని జనరల్ రావత్ పేర్కొన్నారు. చాణక్య నీతిని ప్రదర్శించి భారతదేశంలో తమ సంస్థానాలను విలీనం చేయడానికి ఆనాటి సంస్థానాల అధిపతులను ఒప్పించడంలో సర్దార్ పటేల్ విజయం సాధించారని అన్నారు. భగవద్గీత లో చెప్పినట్టుగా ' నీ విధులను నువ్వు నిర్వర్తించు దేనికీ భయపడవద్దు' అన్న సూక్తిని ప్రేరణగా తీసుకుని భారత సాయుధ దళాలు పనిచేస్తున్నాయని జనరల్ రావత్ అన్నారు. దేశ భద్రత, గౌరవం, సంక్షేమం కోసం పనిచేస్తామని శిక్షణ పూర్తి చేసుకున్న సాయుధ దళాల్లో చేరే ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకుంటారని ఆయన అన్నారు. వ్యక్తిగత భద్రత, సౌకర్యాలకు కాకుండా దేశ రక్షణ, సమగ్రత, భద్రతకు సాయుధ దళాలు ప్రాధాన్యత ఇస్తాయని జనరల్ రావత్ స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి విధేయతతో ఉంటూనే లౌకికవాదం,
క్రమశిక్షణ, సమగ్రత, విధేయత, దళాల మధ్య అవగాహన వంటి అంశాలను అనుసరిస్తున్న భారత సాయుధ దళాలు దేశ రాజకీయ స్థిరత్వానికి దోహదపడతాయని జనరల్ రావత్ స్పష్టం చేశారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, నేషనల్
క్యాడెట్ కార్ప్స్ అందిస్తున్న సేవలు, వరదలు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయుధ దళాలు ప్రజలకు అందిస్తున్న సేవలు సహకారం అందిస్తూ దేశ సేవలో పాల్గొంటున్నాయని జనరల్ రావత్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కంటోన్మెంట్లు, సైనిక కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, దీనివల్ల ఆ ప్రాంతాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నాయని జనరల్ రావత్ వివరించారు.50వ దశకం నుంచి ఇంతవరకు ఐక్యరాజ్య సమితి శాంతి సాధనకు చేస్తున్న ప్రయత్నాలకు భారత సాయుధ దళాలు తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ ప్రయత్నాలలో పాల్గొంటున్నాయని జనరల్ రావత్ అన్నారు. భారత దేశ రక్షణ సహకార విధానం అంతర్జాతీయ దౌత్య నీతిగా గుర్తింపు పొంది ప్రశంసలు అందుతుందని అన్నారు. దేశ భిన్నత్వంలో ఏకత్వం చెక్కుచెదరకుండా ఉండాలని జనరల్ రావత్ స్[స్పష్టం చేశారు. దీనికోసం భారత సాయుధ దళాలు విధేయత, క్రమశిక్షణతో పనిచేసి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని జనరల్ రావత్ ప్రకటించారు.
1955 నుంచి దేశ ఉక్కు మనిషిగా గుర్తింపు పొందిన సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆకాశవాణి పటేల్ స్వారక ఉపన్యాసాలను నిర్వహిస్తోంది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో, సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించిన పటేల్ దేశ తొలి సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.
డాక్టర్ సి రాజగోపాలాచారి, డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం, డాక్టర్ కరణ్ సింగ్, డాక్టర్ కె. కస్తూరిరంగన్, శ్రీ అజిత్ దోవల్, డాక్టర్ ఎస్ జైశంకర్ వంటి ప్రముఖులు గతంలో సర్దార్ పటేల్ స్మారక
ఉపన్యాసాలను ఇచ్చారు.
జనరల్ బిపిన్ రావత్ చేసిన సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసం 2021 ఆల్ ఇండియా రేడియో నెట్‌వర్క్‌లో 31 అక్టోబర్, 2021న రాత్రి 9:30 గంటలకు ప్రసారం చేయబడింది. అదే రోజు రాత్రి 10 గంటలకు డిడి నేషనల్‌లో ప్రసారం చేయబడింది. ఈ ఉపన్యాసం ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానెల్ 'ఆకాశవానియర్'లో అందుబాటులో ఉంది.
***
(రిలీజ్ ఐడి: 1768483)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199