రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
అందుబాటుధరలో ఔషధాలు, ఆవిష్కరణ: అందరికీ నాణ్యమైన ఔషధాలు అనే అంశంపై జరిగిన వెబినార్‌కు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కె. విజయరాఘవన్
వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, పర్యావరణ మార్పుల సవాళ్లను భారత ఫార్మా రంగం ఎదుర్కొవలసి ఉంటుంది : ప్రొఫెసర్ రాఘవన్
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2021 1:10PM by PIB Hyderabad
భారత స్వాతంత్ర 75 వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడవునా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా డిపార్టమెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్ కింద గల నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), ఒక వెబినార్ ను ఏర్పాటు చేసింది. అందుబాటు ధరలో ఔషధాలు, ఆఇష్కరణలు, అందరికీ నాణ్యమైన ఔషధాలు ఇతివృత్తంతో 2021 అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ వెబినార్‌కు భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డిపార్టమెంట్ ఆఫ్ పార్మాసూటికల్స్ కార్యదర్శి శ్రీమతి ఎస్ .అపర్ణ పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, అకాడమియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రైస్ మానిటరింగ్ రిసోర్స్ యూనిట్లు (పిఎంఆర్ యులు), పౌర సమాజానికి చెందిన వారు, దేశవ్యాప్తంగా గల పేషెంట్ అడ్వకసీ గ్రూప్‌లకు చెందిన వారు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.
వాతావరణ మార్పు, జీవవైవిధ్యం పర్యావరణ ప్రభావాల వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ఫార్మా పరిశ్రమ సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ తన ప్రసంగంలో, నొక్కి చెప్పారు. పరిశ్రమ అకాడెమియా మధ్య బలమైన లింకేజీల ఆవశ్యకత, కొత్త ఔషధ ఆవిష్కరణకు పురికొల్పడానికి కంప్యూటేషనల్, ప్రయోగాత్మక పని కాంబినేటోరియల్ విధానం గురించి ప్రస్తావించారు..
ఈ సందర్భంగా డిపార్టమెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్ కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ మాట్లాడుతూ.పేషెంట్లకు అందుబాటు ధరలో మందులు అందేవిధంగా ప్రభుత్వ దృఢనిర్ణయాన్ని అమలు చేయడంలో ఎన్ పిపిఎ ముందువరుసలో ఉంటూ వస్తున్నదని అన్నారు. పిఎల్ ఐ పథకం ద్వారా ఈ పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు గురించి కూడా ఆమె పేర్కొన్నారు. బయోలజిక్స్, జీన్ సెల్ థెరప, సంక్లిష్ట జెనిరికస్, భవిష్యత్ ఔషధాలు తదితరాల విషయంలో సామర్థ్యాల పెంపునకు సంబంధించి ఆవిష్కరణలకు పిఎల్ ఐ పథకం ద్వారా ఔషధ పరిశ్రమకు మద్దతు నిస్తున్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.
ఎన్.పి.పి.ఎ ఛైర్మన్ శ్రీ కమలేష్ కుమార్ పంత్ స్వాగతోపన్యాసం చేస్తూ, ప్రజలకు ఔషధాలు అందుబాటు ధరలో లభ్యమయ్యేలా చేయడంలో ఎన్ పిపిఎ పోషిస్తున్న కీలక పాత్ర గురించి వివరించారు. ప్రస్తుత ఉత్పత్తులు, ఇంక్రిమెంటల్ విలువతో నూతన ఆవిష్కరణలు చేపడుతున్న వాటికి ఎక్కువధరల ప్రతిపాదనలను ఆమోదించనున్నట్టు తెలిపారు.
ఈ పేనల్ చర్చలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్చువల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారిఇలో డాక్టర్ వై.కె. గుప్త, వైస్ ఛైర్, ఎస్ .ఎన్.సి.ఎం, మెంబర్, ఎస్ సిఎఎంహెచ్‌పి,శ్రీ పంకజ్ పటేల్ ఛైర్మన్ జైడు కాడిల, డాక్టర్ ఎస్ చంద్ర శేఖర్, డైరక్టర్ ,సిఎస్ఐఆర్,ఐఐసిటి, ,శ్రీ మనోజ్ జలాని, డైరరరక్టర్ డిపార్టమెంట్ ఆఫ్ యుహెచ్‌సి హెల్త్ సిస్టమ్స్, లైఫ్ కోర్సు, రీజనల్ ఆఫీస్ ఫరరర్ సౌత్ ఈస్ట్ ఏసియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, శ్రీ దీపకకక్ బగ్లా, మేనేజింగ్ డైరక్టర్, సిఇఒ, ఇన్వెస్ట్ ఇండియా, డాక్టర్ రత్నాదేవి, ఛైర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అలయెన్స్ ఆఫ్ పేటెంట్ ఆర్గనైజేషన్ (ఐఎపిఒ) ఉన్నారు.
అందుబాటు ధరలో ఔషధాలు, ఆవిష్కరణలకు సంబంధించి పల కోణాలను పేనలిస్టులు ప్రస్తావించారు. దేశంలో బలమైన ఆవిష్కరణల వాతావరణం ఉండాలని వారు అంగీకరించారు. ఇందుకు సంబంధించి బహుముఖ వ్యూహం, విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి మోడరేటర్‌గా వ్యవహ రించిన ప్రొఫెసర్ జావేద్ ఇక్బాల్ మాట్లాడుతూ, బలమైన రీతిలో పరిశ్రమకు, అకడమిక్ సంస్థలకు మధ్య అనుసంధానత ఉండాలన్నారు.పరిశోధనలు పరిష్కారాలు సాధించడమే కాక, అవి చవకైన, సమర్దమైన వాటికి వీలు కల్పిస్తాయన్నారు.
వెబినార్ లో డాక్టర్ వినోద్ కొత్వాల్, మెంబర్ సెక్రటరీ, ఎన్ పిపిఎ వందన సమర్ఫణ చేశారు. పిఎస్ఎకు, ముఖ్యఅతిథికి, డిపార్టమెంట్ ఆఫ్ పార్మాసూటికల్ కార్యదర్శికి , మోడరేటర్; పేనలిస్టులకు, ఈ వెబినార్ లో పాల్గొన్నవారికి తమ కృతజ్ఞతలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 1768383)
సందర్శకుల సూచీ సంఖ్య : : 183