ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోమ్ లో జ‌రుగుతున్న జి 20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి మారియో డ్రాఘిని క‌లుసుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 29 OCT 2021 10:40PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , రోమ్‌లో జి20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 29 ,2021న  ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి , హిజ్ ఎక్స‌లెన్సీ, మారియో డ్ర‌ఘితో స‌మావేశ‌మ‌య్యారు. వీరిరువురూ క‌లుసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. జి 20 స‌మావేశాన్ని , ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా కోవిడ్ మ‌హమ్మారి ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి విజ‌య‌వంతంగా జి 20 స‌మ్మేళ‌నం నిర్వ‌హించినందుకు ,  ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ను అభినందించారు. గ్లాస్‌గోవ్‌లో కాప్ -26 స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డంలో యుకె తో ఇట‌లీ భాగ‌స్వామ్యం వ‌హిస్తోంది.

     ఇరువురు నాయ‌కులు, వాతావ‌ర‌ణ మార్పుల నుంచి ఎదురౌతున్న స‌వాళ్ల‌ను చ‌ర్చించారు. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ స‌మాజం క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని గురించి వారు చ‌ర్చించారు.
ఇండియా వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించి  ఇండియా చేప‌ట్టిన ప‌రివ‌ర్త‌నాత్మ‌క వాతావ‌ర‌ణ చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాల వాతావ‌ర‌ణ ఆర్ధిక చెల్లింపు హామీల‌కు సంబంధించిన ఆందోళ‌న గురించి కూడా ప్ర‌స్తావించారు.

 

ఇటీవ‌లి అంత‌ర్జాతీయ‌, ప్రాంతీయ ప‌రిణామాల‌పై ఇరువురు నాయ‌కులు త‌మ అభిప్రాయాల‌ను ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకున్నారు. ఆప్ఘ‌నిస్థాన్ , ఇండొ ప‌సిఫిక్ తో స‌హా ప‌లు అంశాలు వీరి మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఇండియా- యూరోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య బ‌హుముఖ స‌హ‌కారానికి మ‌రింత స‌న్నిహితంగా క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఇరువురు నాయ‌కులు పున‌రుద్ఘాటించారు.


ద్వైపాక్షిక అంశాల విష‌యంలో ఇరువురు నాయ‌కులు 2020 నవంబ‌ర్‌లో జరిగిన ఇండియా- ఇట‌లీ వ‌ర్చువ‌ల్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం నుంచి జ‌రిగిన ప‌రిణామాల‌ను స‌మీక్షించారు.  ఆ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో చేప‌ట్టిన 2020-25 కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లులో పురోగ‌తిపై ఇరువురు నాయ‌కులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ఆర్ధిక రంగాల‌లో వ్యూహాత్మ‌క ల‌క్ష్యాల‌కు సంబంధించి, అలాగే సైన్సు,టెక్నాల‌జీ, సాంస్కృతిక రంగాల‌లో రాగ‌ల ఐదు సంవ‌త్స‌రాల‌లో సాధించాల్సిన ల‌క్ష్యాల‌ను ఈ వ‌ర్చువ‌ల్ స‌మ్మిట్‌లో నిర్ణ‌యించారు.

ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్  పునరుత్పాదక ఇంధన రంగాలలో వాణిజ్యం  పెట్టుబడి సంబంధాలను మరింత విస్తరించేందుకు తమ చిత్త‌శుద్ధిని ఇరువురు నాయ‌కులు పునరుద్ఘాటించారు. పునరుత్పాదక , ప‌రిశుద్ధ ఇంధ‌నం విష‌యంలో ద్వైపాక్షిక సహకారానికి తాజా ప్రేరణను అందించడానికి ఇండియా, ఇట‌లీ ఒక సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. ఇంధ‌న ప‌రివ‌ర్త‌న విష‌యంలో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి సంబంధ‌ఙంచి ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది. భారీ గ్రీన్ కారిడార్ ప్రాజెక్టులు, స్మార్ట్ గ్రిడ్‌లు, ఇంధ‌న నిల్వ ప‌రిష్కారాలు, గ్యాస్ ర‌వాణా, స‌మీకృత వృధా నిర్వ‌హ‌ణ‌, ( వేస్ట్ టు వెల్త్‌), గ్రీన్ హైడ్రోజ‌న్ అభివృద్ధి, వాడ‌కం, బ‌యో ఫ్యూయ‌ల్స్ ప్ర‌మోష‌న్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇండియా , ఇట‌లీలు టెక్స్ టైల్ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌పై  ఈ స‌మావేశం సందర్భంగా సంత‌కాలు చేశారు.

ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి డ్రాఘిని ఇండియాలో అధికారికంగా ప‌ర్య‌టించేందుకు వీలైనంత త్వ‌ర‌లో రావ‌ల‌సిందిగా భార‌త ప్ర‌దాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించారు.

 

***
.

 


(रिलीज़ आईडी: 1768362) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam , Malayalam