ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి వాటికన్ సిటీ పర్యటన
Posted On:
30 OCT 2021 6:04PM by PIB Hyderabad
గౌరవనీయులైన పోప్ ఫ్రాన్సిస్ 2021 అక్టోబర్, 30వ తేదీ శనివారం రోజు, వాటికన్ లోని అపోస్టోలిక్ ప్యాలెస్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించారు.
రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి, పోప్ ల మధ్య ఇదే తొలి సమావేశం. 2020, జూన్ నెలలో, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చివరిసారిగా వాటికన్‌ను సందర్శించి అప్పడు పోప్ గా ఉన్న, గౌరవనీయులు రెండవ జాన్ పాల్ ని కలిశారు. భారతదేశం మరియు హోలీ సీ మధ్య 1948లో దౌత్య సంబంధాల స్థాపన జరిగినప్పటినుంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. భారతదేశం ఆసియాలో రెండవ అతిపెద్ద క్యాథలిక్ జనాభా కలిగిన దేశంగా ఉంది.
ఈ రోజు జరిగిన సమావేశంలో, ఇద్దరు నాయకులు కోవిడ్-19 మహమ్మారి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజల పై దాని ప్రభావం గురించి చర్చించారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లు గురించి కూడా వారు చర్చించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి అలాగే ఒక బిలియన్ కోవిడ్-19 టీకా మోతాదులను అందించడంలో భారతదేశం సాధించిన విజయాల గురించి ప్రధానమంత్రి పోప్‌కు వివరించారు. మహమ్మారి సమయంలో అవసరమైన దేశాలకు భారతదేశం చేస్తున్న సహాయాన్ని గౌరవనీయులైన పోప్ ప్రశంసించారు.
భారతదేశాన్ని త్వరగా సందర్శించవలసిందిగా గౌరవనీయులైన పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధానమంత్రి ఆహ్వానించగా, ఆయన సంతోషంతో దాన్ని అంగీకరించారు.
శక్రటరీ అఫ్ స్టేట్, గౌరవనీయులు కార్డినల్ పియట్రో పరోలిన్ ను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కలిశారు.
*****
(Release ID: 1768202)
Visitor Counter : 198
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam