భారత ఎన్నికల సంఘం
మహారాష్ట్ర శాసన సభ్యుల కోటాలో శాసనమండలికి ఒక ఉప ఎన్నిక-సంబంధితం
Posted On:
31 OCT 2021 1:15PM by PIB Hyderabad
మహారాష్ట్ర శాసనసభ్యుల కోటాకింద శాసనమండలిలో ఒక స్థానానికి ఏర్పడిన ఖాళీ భర్తీకి దిగువ పేర్కొన్న వివరాల మేరకు ఉప-ఎన్నిక నిర్వహించబడుతుంది:-
వ.సం॥
|
సభ్యుని పేరు
|
ఎన్నిక పద్ధతి
|
ఖాళీ తేదీ-కారణం
|
పదవీకాలం
|
1.
|
శ్రీ శరద్ నామ్‌దేవ్ రాన్‌పైజ్
|
ఎమ్మెల్యేలద్వారా
|
23.09.2021
మరణం
|
27.07.2024
|
2. మహారాష్ట్ర శాసనమండలిలో పైన పేర్కొన్న ఖాళీకి సంబంధించి శాసనసభ్యులద్వారా కింది కార్యక్రమం ప్రకారం ఉప-ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
వ.సం॥
|
కార్యక్రమం
|
తేదీలు
|
|
నోటిఫికేషన్ జారీ
|
2021 నవంబరు 9 (మంగళవారం)
|
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
2021 నవంబరు 16 (మంగళవారం)
|
|
నామినేషన్ల పరిశీలన
|
2021 నవంబరు 17 (బుధవారం)
|
|
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ
|
2021 నవంబరు 22 (సోమవారం)
|
|
పోలింగ్ తేదీ
|
2021 నవంబరు 29 (సోమవారం)
|
|
పోలింగ్ సమయం
|
ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00
|
|
ఓట్ల లెక్కింపు
|
2021 నవంబరు 29 (సోమవారం) సాయంత్రం 05:00 గం॥
|
|
ఎన్నికలు ముగియవలసిన తేదీ
|
2021 డిసెంబరు 1 (బుధవారం)
|
4. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కోవిడ్-19పై కేంద్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన విస్తృత మార్గదర్శకాలుసహా 28.09.2021న కమిషన్ జారీచేసిన పత్రికా ప్రకటనలోని పేరా 6కింద నిర్దేశించిన అందరు వ్యక్తులకూ వర్తించే మార్గదర్శకాల (https://eci.gov.in/candidate-political-parties/instructions-on-covid-19/)ను ప్రతి ఒక్కరూ తప్పక అనుసరించాలి.
5. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే అమలులోగల కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి సూచనలను పాటించేలా చూడటం కోసం రాష్ట్రంలోని ఒక సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
***
(Release ID: 1768199)
Visitor Counter : 147