భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

కేరళ.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాల శాసనమండలి సభ్యుల ఉప ఎన్నిక-సంబంధితం

प्रविष्टि तिथि: 31 OCT 2021 12:42PM by PIB Hyderabad

   కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల శాసన మండళ్లకు దిగువ పేర్కొన్న వివరాల మేరకు రెండు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది:-

రాష్ట్రం

సభ్యుని పేరు

ఖాళీ కారణం

ఖాళీ అయిన తేదీ

పదవీకాలం

కేరళ

శ్రీ జోస్‌ కె.మణి

రాజీనామా

11.01.2021

01.07.2024

పశ్చిమబెంగాల్‌

శ్రీమతి అర్పిత ఘోష్‌

రాజీనామా

15.09.2021

02.04.2026

2. దేశంలో కోవిడ్‌-19 రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో కేరళ, పశ్చిమ బెంగాల్‌ శాసన మండళ్లలో ఖాళీల భర్తీకి ఉప-ఎన్నికల నిర్వహణ సరికాదని, మహమ్మారి పరిస్థితులు  గణనీయంగా మెరుగుపడిన తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్‌ 28.05.2021 నాటి తన పత్రికా ప్రకటన సంఖ్య.ECI/PN/67/2021లో తెలిపింది.

3. కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో పరిస్థితులను తిరిగి అంచనా వేయడంతోపాటు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ రెండు రాష్ట్రాల శాసనమండళ్లలో పైన పేర్కొన్న రెండు స్థానాలకు సభ్యుల ఉప-ఎన్నికలను కింద నిర్దేశించిన కార్యక్రమం మేరకు నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయించింది:-

వ.సం

కార్యక్రమం

తేదీలు

 

నోటిఫికేషన్‌ జారీ

2021 నవంబరు 9 (మంగళవారం)

 

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

2021 నవంబరు 16 (మంగళవారం)

 

నామినేషన్ల పరిశీలన

2021 నవంబరు 17 (బుధవారం)

 

అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ

2021 నవంబరు 22 (సోమవారం)

 

పోలింగ్‌ తేదీ

2021 నవంబరు 29 (సోమవారం)

 

పోలింగ్‌ సమయం

ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00

 

ఓట్ల లెక్కింపు

2021 నవంబరు 29 (సోమవారం) సాయంత్రం 05:00 గం॥

 

ఎన్నికలు ముగియవలసిన తేదీ

2021 డిసెంబరు 1 (బుధవారం)

 

4. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కోవిడ్‌-19పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీచేసిన విస్తృత మార్గదర్శకాలుసహా 28.09.2021న కమిషన్‌ జారీచేసిన పత్రికా ప్రకటనలోని పేరా 6కింద నిర్దేశించిన అందరు వ్యక్తులకూ వర్తించే మార్గదర్శకాల (https://eci.gov.in/candidate-political-parties/instructions-on-covid-19/)ను ప్రతి ఒక్కరూ తప్పక అనుసరించాలి.

 

5. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే అమలులోగల కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి సూచనలను పాటించేలా చూడటం కోసం రాష్ట్రంలోని ఒక సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

 

***


(रिलीज़ आईडी: 1768198) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Malayalam