సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దీర్ఘకాలిక, విశాల దృష్టి కలిగిన అధికారులు ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ దార్శనికతను సాధించడానికి దోహదపడతారన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముస్సోరిలోని ఎల్‌బిఎస్ ఎన్ ఎఎ కామన్ మిడ్ కెరీర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారినుద్దేశించి కీలకోపన్యాసం చేసిన మంత్రి
Posted On:
26 OCT 2021 4:07PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల సహాయ (స్వతంత్ర) మంత్రి , కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫి్యాదులు, పెన్షన్, అణువ్యవహారాలు, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ముస్సోరిలోని ఎల్ బిఎస్ ఎస్ ఎన్ ఎఎకామన్ మిడ్ కెరీర్ కార్యక్రమంలో పాల్గొన్నవారినుద్దేశించి మాట్లాడుతూ, చొరవ తీసుకోగల సామర్ధ్యం, దీర్ఘకాలిక , విశాల దృక్పథం కలిగిన వారు, సమష్ఠి కృషిని సమీకరించగల వారు ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్‌ను సాధించగల దార్శనికత కలిగి ఉంటారని అన్నారు. ఈ కోర్సుకుచెందిన 150 మందికి పైగా అధికారులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన నవ భారత నిర్మాణానికి నిర్మాతలుకానున్నారని అన్నారు.
భారత స్వాతంత్ర 75 సంవత్సరాల సందర్భంగా ఆఫీసర్లు ఉమ్మడి శిక్షణపొందుతుండడం గొప్ప అవకాశం అన్నారు. భారతదేశం స్వాతంత్రం సాధించి శతవసంతాలకు చేరువ కావడానికంటే 25 సంవత్సరాల ముందు దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని వీరు కలిగి ఉన్నారని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి దార్శనికత అయిన దేశాన్ని అంతర్జాతీయంగా ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లి సాకారం చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని అన్నారు. మన దేశానికి అవసరమైన సమష్టి నాయకత్వం కోసం ఈ కోర్సులో శ్రద్ధగా వినడం, ఇతరుల పట్ల సానుభూతి, విచారణ, సమష్టి సృజనపై ఇది దృష్టి పెడుతుందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇదే రోజున 2017లో ఎల్‌బిఎస్ ఎన్ ఎఎను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, పాలన,సాంకేతికత, విధాన నిర్ణయం వంటి అంశాలను చర్చించడం జరిగిందని, అలాగే జాతీయ స్థాయి దార్శనికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారని గుర్తు చేశారు.
సమగ్ర విధానానంపై ప్రత్యేక దృష్టి ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, కోవిడ్ -19పై పోరాటం సమయంలో ఇది ప్రత్యేకంగా ప్రదర్శితమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం సవాళ్లతో కూడుకున్న కాలంలో మన నైపుణ్యాలను సమీకృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆలోచనా ప్రక్రియ, పని సంస్కృతికి సంబంధించి ఎవరికివారు వ్యవహరించే పద్ధతి పోయిందని అన్నారు. ఇండియా బహుళత్వ సంస్కృతికి సమాజానికి ప్రతిబింబమని అంటూ, పలు ఉమ్మడి విలువలు, వైఖరులను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. అందువల్ల ఉమ్మడి లక్ష్యాలు, వైఖరులను అభివృద్ధి చేయడం ద్వారా మన దేశాన్ని ఆర్థిక , సామాజిక, సంస్థాగతంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు.
. ఇది నైపుణ్యం, విజ్ఞానానికి సంబంధఙంచిన శకమని, సంబంధిత నైపుణ్యాలను నిరంతరం అప్ గ్రేడ్ చేసుకోవడం అవసరమని, ఇది పాలనలో నూతన సవాళ్లను ఎదుర్కోనేందుకు అద్భుత అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ప్ర ఒక్క అధికారి మిషన్ కర్మయోగి స్ఫూర్తితో స్వీయ మార్గ నిర్దేశంలో తమ మార్గాన్ని తాము నిర్దేశించుకోవాలని అన్నారు. నాయకత్వానికి సంబంధించి అవసరమైన అన్ని పార్శ్వాలను ఈ కోర్సు నేర్చుకునేందుకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. దీనితో ఆలోచనలో, భవిష్యత్‌లో వివిధ బృందాలలో పనిచేయబోయే పని విధానంలో మౌలిక మార్పును తీసుకురావడానికి ఇవది దోహదపడుతుందని ఆయన అన్నారు..
వివిధ విభాగాలు, మంత్రిత్వశాఖలు నడిపే పాత విధానాలు కోవిడ్ అనంతర ప్రపంచం అవసరాలకు అవకాశం ఇవ్వాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పైన పేర్కొన్న విధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా వ్యవహరించగలిగిన వారు, అలాగే నూతన నైపుణ్యాలు, భాగస్వామ్యం, వంటివి దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉపకరిస్తాయని అన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ( ఎల్‌బిఎస్ ఎన్ ఎఎ) డైరక్టర్ శ్రీ కె. శ్రీనివాస్ తమ ప్రసంగంలో ఈ కోర్సు ప్రాధాన్యతను వివరించారు. ఈ కోర్సును నాయకత్వం ప్రాముఖ్యతతో రూపొందించినట్టు తెలిపారు. మిడ్ కెరీర్ కొలాబరేటివ్ ఏర్పాటు ఉమ్మడి విధానాలు అనుసరించడానికి, ప్రస్తుత , భవిష్యత్ సవాళ్లను సమర్ధంగా ఎదుర్గోవడానికి ఉపకరిస్తుందని అన్నారు.
***
(Release ID: 1767370)
Visitor Counter : 175