భారత ఎన్నికల సంఘం

ఉజ్బెకిస్తాన్ అధ్యక్ష ఎన్నికలకు (2021 అక్టోబర్ 21-25) అంతర్జాతీయ పరిశీలకునిగా హాజరైన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర

Posted On: 28 OCT 2021 11:16AM by PIB Hyderabad

ఉజ్బెకిస్తాన్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు 2021 అక్టోబర్ 24న జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికకు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర అంతర్జాతీయ  పరిశీలకునిగా వ్యవహరించారు. ఆయనతో పాటు ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఉజ్బెకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల పర్యవేక్షణ లో పాల్గొంది. ఈ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కల్పించాయి. ఆ దేశ నూతన ఎన్నికల నియమావళి ప్రకారం ఈ ఎన్నిక నిర్వహించారు.

పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ఎన్నికల సహకారంపై ఉజ్బెకిస్తాన్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ జైనిద్దీన్ ఎం  నిజాంఖోద్ జావ్  భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర అక్టోబర్ 21వ తేదీన చర్చలు జరిగాయి. తన ఆహ్వానాన్ని మన్నించి ఎన్నికల పర్యవేక్షణకు వచ్చిన శ్రీ సుశీల్ చంద్ర కు జైనిద్దీన్ ఎం  నిజాంఖోద్ జావ్ ధన్యవాదాలు తెలిపి తమ దేశంలో ఎన్నికల నిర్వహణకు అమలు  చేస్తున్న చర్యలను వివరించారు.  సింగిల్ ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాపోలింగ్ రోజున వ్యక్తిగత ఓటింగ్ కోసం ఏర్పాట్లు, ముందుగా ఓటు వేయడానికి కల్పిస్తున్న సౌకర్యాలు, కోవిడ్ భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను ఆయన వివరించారు. భారతదేశంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల వివరాలను వివరించిన శ్రీ సుశీల్ చంద్ర రెండు దేశాల మధ్య ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలిసి పనిచేయడానికి గల అవకాశాలను ప్రస్తావించారు. ఎన్నికల సహకారం పై రెండు దేశాల మధ్య అవగాహన కుదిరితే ఉజ్బెకిస్తాన్ ఎన్నికల అధికారుల కోసం శిక్షణ, సామర్థ్యం పెంపు కార్యక్రమాలను నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సందర్శకుల కార్యక్రమంలో ఉజ్బెకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రతినిధులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. వీరికి శిక్షణ కూడా ఇస్తున్నామని అన్నారు. 

ఉజ్బెకిస్థాన్ ఎన్నికల చట్టం ప్రకారం ఆ దేశ అధ్యక్షుని పదవీ కాలం అయిదు సంవత్సరాలుగా ఉంటుంది. దేశాన్ని ఒకే నియోజకవర్గంగా దీనికోసం పరిగణిస్తారు. ఉజ్బెకిస్తాన్‌లో మూడు అంచెల ఎన్నికల వ్యవస్థ అమలులో ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్, 14 జిల్లాల ఎన్నికల కమిషన్లు , 10,760 ప్రాంతీయ  ఎన్నికల కమిషన్లు  ఎన్నికల భాద్యతలను నిర్వర్తిస్తున్నాయి. దేశంలో 20 మిలియన్ ఓటర్లు ఉన్నారు.  3000 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలో ముందుగా ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించారు. అక్టోబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు కల్పించిన ఈ సౌకర్యాన్ని 421618 మంది ఉపయోగించుకున్నారు. వీరిలో విదేశాల్లో నివసిస్తున్న 120524 మంది ఉన్నారు. 

నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను నిలబెట్టడానికి అధికారం కలిగి ఉంటాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఒక మహిళతో సహా అయిదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల ప్రచార వ్యయాన్ని ప్రభుత్వం సమకూర్చింది. దేశంలోని ప్రధాన కేంద్రాలలో పోటీ చేసిన అయిదుగురు అభ్యర్థుల ఫోటోలు వారి వివరాలతో బోర్డులను ఏర్పాటు చేశారు. 

ఎన్నికల సంస్థాగత వివరాలను తెలుసుకోవడానికి భారత బృందం 7,14 జిల్లాల్లో పర్యటించి ఆ దేశంలో అమలవుతున్న నిబంధనలుఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించింది. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బృందం ఎన్నికల సరళిని పరిశీలించింది. ఎన్నికల జాబితాఓటర్లను గుర్తించడంముందుగా ఓటు వేసే సౌకర్యంపెద్దలు వికలాంగులకు కల్పించిన సౌకర్యాలుకోవిడ్ భద్రతా చర్యలుబ్యాలెట్ పత్రాల ఉపయోగం తదితర అంశాలను భారత బృందం పరిశీలించింది. 

పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ పార్టీలు/ అభ్యర్థుల ప్రతినిధులకు ప్రవేశం కల్పించిన అంశాన్ని భారత బృందం గుర్తించింది. పాసుపోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఓటర్లను గుర్తించడం జరుగుతోంది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారి వివరాలుఇళ్ల నుంచి ఓటు వేస్తున్న ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ విధానంలో అధికారులు గంటకు ఒకసారి ఓటింగ్ సరళిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. 

పర్యటనలో భాగంగా శ్రీ సుశీల్ చంద్ర ఉజ్బెకిస్థాన్‌లోని భారత రాయబారి శ్రీ మనీష్ ప్రభాత్ నేతృత్వంలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చలు జరిపారు.సర్వీస్  ఓటర్లు ఓటు వేయడానికి రూపొందించిన ఎలక్ట్రానిక్ బదిలీ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్  సౌకర్యాలను శ్రీ సుశీల్ చంద్ర వారికి వివరించారు. అనంతరం  తాష్కెంట్‌లో ఉన్న నాన్-రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిధులతో భారతీయ ఎన్నికల నిర్వహణపై  జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

తాష్కెంట్‌లోని భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం దర్శించిన ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆయనకు నివాళులు అర్పించారు. 

***



(Release ID: 1767158) Visitor Counter : 165