మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నాలుగేళ్ల స‌మీకృత టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను నోటిఫై చేసిన విద్యా మంత్రిత్వ శాఖ

Posted On: 27 OCT 2021 4:35PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం 2020 ప్ర‌ధాన అమ‌లు విధానాల‌లో ఒక‌టైన  ద్వంద్వ ప్రధాన హోలిస్టిక్ బ్యాచిలర్స్ డిగ్రీని విద్యా మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. రెండు డిగ్రీ కోర్సుల‌ను క‌లుపుకొని నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో అందించేలా ఈ డిగ్రీ కోర్సును విద్యాశాఖ  త‌యారు చేసింది. ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రామ్‌ను (ఐటీఈపీ) నోటిఫై చేసింది. బీఏ, బీఈడీ/ బీఎస్‌సీ, బీఈడీ మ‌రియు బీకామ్‌, బీఈడీ  వంటి  వివిధ ఐటీఈపీ కార్య‌క్ర‌మాల‌ను నోటిఫై చేసింది. ఎన్ఈపీ,2020 ప్ర‌కారం  2030 సంవత్సరం నుండి ఉపాధ్యాయుల ఎంపిక‌లు కేవం ITEP ద్వారా మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 వివిధ ర‌కాల‌ సంస్థలలో ఇది మొదట ప్ర‌యోగాత్మ‌కంగా అందించ‌బ‌డుతోంది.  విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఈ కోర్సు యొక్క పాఠ్యాంశాలను రూపొందించింది, ఇది విద్యార్థి-ఉపాధ్యాయుడు విద్యలో డిగ్రీని పొందేందుకు అలాగే చరిత్ర, గణితం, సైన్స్ , కళలు, ఆర్థిక శాస్త్రం లేదా వాణిజ్యం.వంటి ప్రత్యేక విభాగాలను పొందేలా రూపొందించిన‌ కోర్సు.  ఐటీఈపీ విధానం అత్యాధునిక బోధనా శాస్త్రాన్ని అందించడమే కాకుండా, బాల్య సంరక్షణ మరియు విద్య (ఈసీసీఈ), ప్రాథ‌మిక‌ అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్‌), సమగ్ర విద్య, భారతదేశం మరియు దాని విలువలు/నైతికత/ కళలే/సంప్రదాయాలు ఇతరాల‌పై అవగాహనను క‌ల్పిస్తుంది.  బోధనను వృత్తిగా ఎంచుకునే విద్యార్థులందరికీ  సెకండరీ తర్వాత ఐటీఈపీ సంవత్సరం అందుబాటులో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రస్తుత బీఈడీ చేయాలంటే ఐదు సంవ‌త్స‌రాల కాలం ప‌డుతోంది. ఐడీఈపీని నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయడం ద్వారా ఒక సంవత్సర కాలం ఆదా అవుతుంది.  2022-23 అకడమిక్ సెషన్ నుండి నాలుగు సంవత్సరాల ఐటీఈపీ ప్రారంభం అవుతుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్‌సీఈడీ) ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీనికి సంబంధించిన త‌గు అడ్మిషన్‌ను నిర్వహిస్తుంది. ఈ కోర్సును మల్టీడిసిప్లినరీ సంస్థలు అందిస్తాయి. పాఠశాల ఉపాధ్యాయులకు కనీస డిగ్రీ అర్హతగా మారుతుంది. జాతీయ విద్యా విధానం 2020 యొక్క ప్రధాన ఆదేశాలలో ఒకదానిని నెరవేర్చడంలో నాలుగు సంవత్సరాల ఐటీఈపీ ఒక మైలురాయి లాంటిది. మొత్తం ఉపాధ్యాయ విద్యా రంగం పునరుద్ధరణకు ఈ కోర్సు గణనీయంగా దోహదపడుతుంది. భారతీయ విలువలు మరియు సంప్రదాయాలపై ఆధారపడిన బహుళ-క్రమశిక్షణా వాతావరణం ద్వారా ఈ కోర్సు నుండి ఉత్తీర్ణత సాధించే భావి ఉపాధ్యాయులు 21వ శతాబ్దపు అవసరాలను, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు మరియు అందువల్ల నూతన భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో చాలా వరకు సహాయపడుతారు.
                                                                                   

*****

 



(Release ID: 1767048) Visitor Counter : 215