ఉక్కు మంత్రిత్వ శాఖ
“సమగ్రతతో స్వయం ప్రతిపత్తి” పేరిట విజిలెన్స్ అవగాహన వారోత్సవం - 2021ని నిర్వహిస్తున్న ఎన్ఎండీసీ
Posted On:
27 OCT 2021 12:45PM by PIB Hyderabad
భారత్ ఆజాదికా అమృతమహోత్సవ్‌ను జరుపుకుంటున్న శుభతరుణంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శుభతరుణంలో భాగంగా
విచ్చేసిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. భారతదేశ @75ని స్మరించుకుంటూ దేశ సమగ్రతపై వివిధ పోటీలు మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న ఎన్ఎండీసీ ఉద్యోగుల కోసం క్విజ్ పోటీతో ప్రారంభమయ్యాయి.అనేక కార్యక్రమాలు మరియు పోటీలు: స్లోగన్ రైటింగ్, ఎలోక్యూషన్, ఎస్సే రైటింగ్, బెస్ట్ హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ తదితర కార్యక్రమాలు ఈ వారంలో షెడ్యూల్ చేయబడ్డాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు NMDC “స్వతంత్ర భారతదేశం @75: సమగ్రతతో స్వయం ప్రతిపత్తి” అనే అంశంపై 26.10.2021 నుండి 01.11.2021 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవం – 2021 (వీఏడబ్ల్యు-2021)ను పాటిస్తోంది. వీఏడబ్ల్యు -2021 ప్రారంభ కార్యక్రమం సమగ్రత ప్రతిజ్ఞను నిర్వహించడం ద్వారా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ శ్రీ సుమిత్ దేబ్ ఈ ఉద్యోగులతో సమగ్రత ప్రతిజ్ఞను చేయించారు. సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ అమితవ ముఖర్జీ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు; శ్రీ సోమనాథ్ నంది, డైరెక్టర్ (టెక్నికల్) గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి సందేశాన్ని చదివారు; సంస్థ డైరెక్టర్ (ప్రొడక్షన్) శ్రీ డికె. యాంటీ గౌరవనీయులైన ప్రధాన మంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రొడక్షన్ & సేఫ్టీ) శ్రీ బి. సాహూ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ సందేశాన్ని చదివి వినిపించారు. ఎన్ఎండీసీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తోడు సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ - సాంకేతికను తగిన విధంగా వినియోగించుకోవడం, విజిల్ బ్లోవర్ మెకానిజంపై ఒక సెషన్ షెడ్యూల్ చేయబడింది. ఇందులో సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ అదనపు కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమారి సింగ్ రేపు కీలక ప్రసంగం చేయనున్నారు. ఇది విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ చివరి రోజున అంటే 01.11.2021న ముగింపు సమావేశం మరియు బహుమతి పంపిణీతో ముగుస్తుంది.
*******
(Release ID: 1767040)
Visitor Counter : 339