రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

“ఫార్మాస్యూటికల్స్ ,వైద్య పరికరాల రంగంలో అవకాశాలు మరియు భాగస్వామ్యాలు” అనే అంశంపై ఏర్పాటైన పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించి ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

' భారతదేశంలో ఫార్మా రంగం కేవలం పెట్టుబడుల రంగం కాదు: ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న రంగం. వసుదైక కుటుంబం స్పూర్తితో పనిచేస్తున్న రంగం'

' ఉత్పాదకత తో ముడిపడిన ప్రోత్సాహక పథకం ఫార్మా రంగ అభివృద్ధికి తోడ్పడి భారతదేశాన్ని ఫార్మా హబ్ గా రూపొందిస్తుంది'

Posted On: 27 OCT 2021 3:27PM by PIB Hyderabad

 ఫార్మాస్యూటికల్స్ ,వైద్య పరికరాల రంగంలో  అవకాశాలు మరియు భాగస్వామ్యాలు” అనే అంశంపై ఏర్పాటైన పెట్టుబడిదారుల సదస్సును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమరసాయనాలుఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజు ప్రారంభించి ప్రసంగించారు.కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం ఈ సదస్సును నిర్వహించింది.ప్రపంచ   ఫార్మా, వైద్య పరికరాల తయారీ  రంగంలో భారతదేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయాలన్న లక్ష్యంతో ఇన్వెస్ట్ ఇండియాతో కలసి ఫార్మాస్యూటికల్స్ విభాగం  ఈ సదస్సు నిర్వహించింది . 

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మాండవీయ భారతదేశానికి ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా గుర్తింపు లభించిందని అన్నారు. జనరిక్ ఔషదాల ఉత్పత్తిసరఫరాలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని అన్నారు. కోవిడ్-19 సమయంలో ప్రపంచంలో 150కి పైగా దేశాలకు భారత్ నుంచి ఔషధాల ఎగుమతి అయ్యాయని మంత్రి వివరించారు. భారతదేశంలో ఫార్మా రంగం కేవలం వ్యాపార రంగంగా పరిగణించడం లేదని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలతో ఫార్మా రంగం ముడిపడి ఉందని అన్నారు. వసుదైక కుటుంబం స్పూర్తితో పనిచేస్తున్న ఫార్మా రఁగం లాభాలను ఆర్జించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. 

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలో అన్ని దేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆహ్వానించారని డాక్టర్ మాండవీయ అన్నారు. దేశంలో పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ స్వేచ్ఛ ఉంటుందని ఆయన అన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా నియంత్రణ వ్యవస్థ పని చేస్తుందని ఆయన అన్నారు.  స్వతంత్ర న్యాయ వ్యవస్థదేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్య పాలన దేశాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చాయని అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఫార్మా రంగం  అత్యుత్తమ పెట్టుబడుల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు.ఫార్మా రంగంలో 2020లో పెట్టుబడులు 98% పెరిగాయని మంత్రి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 18% వృద్ధి చెందాయని అన్నారు. 

ఫార్మా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను డాక్టర్ మాండవీయ సదస్సుకు వివరించారు. ఉత్పాదకత తో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని ఫార్మా రంగంలో అమలు చేస్తున్నామనిదీనివల్ల ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.దేశంలో  ఔషధాలువైద్య పరికరాల మార్కెట్ రంగ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 10 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. ఈ పథకం వల్ల ఔషధాలువైద్య పరికరాలకు గిరాకీ పెరుగుతుందని మంత్రి వివరించారు. 

పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికిన ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పరిశ్రమల సామర్ధ్యం వల్ల దేశంలో ఫార్మా రంగం మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఫార్మా రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 

ఫార్మాస్యూటికల్స్ శాఖ , ఇన్వెస్ట్ ఇండియా సీనియర్ అధికారులు సదస్సులో పాల్గొన్నారు.  

***(Release ID: 1767037) Visitor Counter : 47