ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
27 OCT 2021 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 103.53 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 13,451 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీ రేటు 98.19% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 14,021 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,35,97,339 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.48% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,62,661. ఇది 242 రోజుల కనిష్ట స్థాయి.
వారపు పాజిటివిటీ రేటు (1.22%) గత 33 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.03%) గత 23 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 60.32 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1766961)
Visitor Counter : 184