రైల్వే మంత్రిత్వ శాఖ
పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సాఫీగా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే దాదాపు 668 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.
ప్రత్యేక రైళ్లు & సాధారణ రైళ్లలో కోచ్‌ల పెంపుతో పాటు, ప్రధాన స్టేషన్లలో జనం రద్దీని నియంత్రించడానిక ప్రాధాన్యం ఇస్తారు.
రైల్వే సెక్టార్లలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రత్యేక రైళ్లను వేశారు
Posted On:
26 OCT 2021 6:57PM by PIB Hyderabad
ప్రస్తుత ఈ పండుగ సీజన్‌లో తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణీకులు తమ కుటుంబాలతో పండుగలు జరుపుకోవడానికి భారతీయ రైల్వేలు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రయాణికులతో పండుగ ఆనందాన్ని పంచుతున్నాయి. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించడానికి రైల్వే ఈ సంవత్సరం దుర్గాపూజ నుండి ఛత్పూజ వరకు 110 ప్రత్యేక రైళ్లలో 668 ట్రిప్పులను నడుపుతోంది. ఈ పండుగ రద్దీ సమయంలో బెర్త్ లభ్యతను నిర్ధారించడానికి సాధారణ రైళ్లలో కోచ్‌లను పెంచింది. రైల్వే సెక్టార్లలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గమ్యస్థానాలను కలపడానికి ప్రత్యేక రైళ్లను వేశారు.
పూజ దీపావళి ఛత్ స్పెషల్స్– 2021 (26.10.21 నాటికి)
నోటిఫై చేసిన రైళ్లు
Railway
|
No. of Trains
|
Trips
|
NR
|
26
|
312
|
NCR
|
4
|
26
|
NER
|
4
|
24
|
NWR
|
4
|
4
|
ER
|
6
|
44
|
ECR
|
6
|
12
|
ECoR
|
8
|
24
|
SR
|
6
|
12
|
SER
|
8
|
46
|
SWR
|
2
|
10
|
CR
|
6
|
26
|
WR
|
18
|
102
|
WCR
|
12
|
26
|
Total
|
110
|
668
|
అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణికులు క్రమబద్ధంగా ప్రవేశించేందుకు ఆర్‌పిఎఫ్ సిబ్బంది పర్యవేక్షణతో టెర్మినస్ స్టేషన్‌ల వద్ద క్యూ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రద్దీని నియంత్రింవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం ప్రధాన స్టేషన్లలో అదనంగా ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. రైళ్లను సజావుగా నడిపేందుకు ప్రధాన స్టేషన్లలో ఎమర్జెన్సీ డ్యూటీలో అధికారులను నియమించారు. రైళ్ల సర్వీసులో ఎలాంటి అంతరాయం ఏర్పడినా త్వరగా హాజరు కావడానికి వివిధ విభాగాల్లో సిబ్బందిని నియమించారు. ప్లాట్‌ఫారమ్ నంబర్‌లతో రైళ్ల రాక/బయలుదేళ్ల వివరాలను తరచుగా , సకాలంలో ప్రకటించడానికి చర్యలు తీసుకోబడ్డాయి.
ప్రయాణీకులకు సరైన సహాయం మార్గదర్శకత్వం అందించడం కోసం ఆర్పీఎస్ సిబ్బందిని, టీటీఈలను నియమించారు. ముఖ్యమైన స్టేషన్లలో "మే ఐ హెల్ప్ యు" బూత్‌లు పనిచేస్తాయి. ప్రధాన స్టేషన్లలో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. పారామెడికల్ బృందంతో అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంది. సీట్లు కార్నర్ చేయడం, ఓవర్ ఛార్జింగ్, టౌటింగ్ వంటి అవకతవకలను అడ్డుకోవడానికి సెక్యూరిటీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది నిఘా ఉంచుతుంది. ఖచ్చితంగా పర్యవేక్షిస్తుంది. వెయిటింగ్ హాల్‌లు, రిటైరింగ్ రూమ్‌లలో, ప్రత్యేకించి ప్యాసింజర్ సదుపాయాల ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం ప్రాధాన్యం ఇవ్వాలని జోనల్ హెడ్‌క్వార్టర్స్ ద్వారా ఆదేశాలు వెళ్లాయి
***
(Release ID: 1766955)
Visitor Counter : 204