విద్యుత్తు మంత్రిత్వ శాఖ
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వానికి రూ. 249.44 కోట్ల తుది డివిడెండ్ చెల్లించిన ఎన్‌హెచ్‌పీసీ
Posted On:
26 OCT 2021 2:08PM by PIB Hyderabad
ప్రధాన హైడ్రో విద్యుత్ ఉత్పత్తి సంస్థ, భారత ప్రభుత్వానికి చెందిన ‘మినీ రత్న’ కేటగిరీ-I సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీ 2020-21 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.249.44 కోట్ల మేర తుది డివిడెండ్ చెల్లించింది. అక్టోబర్ 21, 2021న సంస్థ ఈ చెల్లింపును జరిపింది. సంస్థ చెల్లించే ఈ తుది డివిడెండ్‌కు సంబంధించిన చెల్లింపు సమాచారాన్ని ఎన్‌హెచ్‌పీసీ సంస్థ సీఎండీ శ్రీ ఎ.కె. సింగ్ కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్‌కు అందజేశారు. 26.10.2021న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి (విద్యుత్) శ్రీ అలోక్ కుమార్, కేంద్ర ప్రభుత్వం అదనపు కార్యదర్శి (పవర్) శ్రీ ఎస్.కె.జి రహతేల సమక్షంలో ఈ చెల్లింపు సమాచారాన్ని న్‌హెచ్‌పీసీ సంస్థ సీఎండీ శ్రీ ఎ.కె. సింగ్ అందజేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 5వ తేదీన చెల్లించిన రూ. 890.85 కోట్ల మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. దీంతో మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన డివిడెండ్ రూ.1140.28 కోట్లకు చేరుకుంది. 10 జూన్ 2021న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.0.35 (అంటే ముఖ విలువలో 3.50%) మేర తుది డివిడెండ్‌ను చెల్లించాలని కూడా కంపెనీ డైరెక్టర్లు నిర్ణయించారు. సెప్టెంబర్ 29,2021న జరిగిన ఏజీఎంలో ఇది ఆమోదించబడింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.25 (అంటే ముఖ విలువలో 12.50%) మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని గతంలో నిర్ణయించారు. మార్చి 05,2021న ఇది చెల్లించబడింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్ షేరు ఒక్కింటికి రూ.1.60/- చేరింది. ఎన్‌హెచ్‌పీసీ సంస్థ ఏడు లక్షల మంది వాటాదారులను (సుమారుగా) కలిగి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంస్థ మొత్తం రూ.1506.76 కోట్ల డివిడెండ్‌ను చెల్లించగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను కలుపుకొని సంస్థ మొత్తం రూ. 1607.21కోట్ల మేర డివిడెండ్ చెల్లింపులు జరిపినట్టయింది. సీపీఎస్ఈల మూలధన పునర్నిర్మాణంపై మే 27, 2016న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ & పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ప్రతి సీపీఎస్‌యూ తన పన్ను చెల్లింపు అనంతరం లాభాలలో 30% లేదా నికర విలువలో 5% చొప్పున కనీస వార్షిక డివిడెండ్ చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మేరకు డివిడెండ్‌ను చెల్లించాలి. ఐడీఐడీ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎన్‌హెచ్‌పీసీ మొత్తం డివిడెండ్ రూపంలో రూ. 1607.21 కోట్లు చెల్లించింది. ఇది కంపెనీ నికర విలువలో 5.08 శాతం. మరియు 2020-21 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపు అనంతరం లభించిన లాభంలో 49.7 శాతంగా నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌హెచ్‌పీసీ నికర లాభం రూ. 3233.37 కోట్లుగా నిలిచింది. అంతకు ముందు ఏడాది ఇది రూ. 3007.17 కోట్లుగా నిలిచింది. .
***
(Release ID: 1766767)
Visitor Counter : 157