ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టిబి ప్రతిస్పందన పునరుద్ధరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఎస్ఇఎఆర్ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ భారతీ పవార్
చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ, టీబీని అంత చేయాలన్న వ్యూహంలోని మైలు రాళ్ళను 2020 కోల్పోవడమే కాదు, తక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే 2022 కవరేజ్ లక్ష్యాలను కూడా సాధించలేకపోవచ్చు
టీబీ సోకేందుకు అవకాశమున్న జనాభా లో పౌష్టికాహార లోపాన్ని పరిష్కరించడం సహా సామాజిక రక్షణ చర్యలను బలోపేతం చేయడం, నివారణ, రోగనిర్ధారణ, చికిత్సా సేవలను పెంచాల్సిన అవసరం ప్రాంతంపై ఉంది
టీబీ ప్రతిస్పందనను ముందుకు తీసుకువెళ్ళేందుకు నూతన రోగనిర్ధారణ పద్ధతులు, వాక్సిన్లు, మందుల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాక, డిజిటల్ సాంకేతికతను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను, ఇతర ఆవిష్కరణలను పెంచాల్సిన ఆవశ్యకత
Posted On:
26 OCT 2021 12:02PM by PIB Hyderabad
టిబి ప్రతిస్పందన పునరుద్ధరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఎస్ఇఎఆర్ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రసంగించారు.
ఆరు ప్రాంతాలలో ఆగ్నేయ ఆసియా ప్రాంతం అత్యధికంగా టీబీ వ్యాధి భారాన్ని మోస్తున్న వాస్తవాన్ని కేంద్ర సహాయ మంత్రి పునరుద్ఘాటించారు. ఇది గత కొన్ని శతాబ్దాలుగా మరణాలకు ప్రధాన కారణంగా ఉంటూ, ప్రస్తుతం హెచ్ఐవి / ఎయిడ్స్, మలేరియాలను మించిపోయి, అంటువ్యాధుల ద్వారా మరణాలను కలిగించే మహమ్మారిగా ప్రపంచంలోనే అతిపెద్ద కారణమై కూర్చుందని ఆమె అన్నారు. ఈ మరణాలు ఎక్కువగా ఆర్థికంగా ఉత్పాదకత అధికంగా ఉండే 15-45 సంవత్సరాల వర్గంలో ఉన్నయువతలో సంభవిస్తూ, అధిక ఆర్థిక, సామాజిక పరిణామాలకు కారణమవుతున్నాయని ఆమె అన్నారు. జీవితాలు, ధనం, పనిదినాలు కోల్పోవడం పరంగా కేవలం టిబి వల్ల భారీగా ఆర్ధిక భారం అధికంగా ఉందని ఆమె చెప్పారు.
టిబిపై కోవిడ్ -19 ప్రభావాన్ని పట్టి చూపుతూ, 2020లో కోవిడ్ -19 మహమ్మారి మానవజీవితాలను, ఆర్ధిక, ఆరోగ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఉద్భవించడానికి ప్రపంచం సాక్షి అయిందని అన్నారు. కొద్ది నెలల్లోనూ, ట్యూబర్‌క్యులోసిస్ కు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని, సాధించిన పురోగతిని మహమ్మారి తిరోగమింపచేసిందని, మంత్రి అన్నారు. టిబి నిర్మూలన ప్రయత్నాలలో తోడ్పడే భారీ పాఠాలను మహమ్మారి మనకు అందించిందని ఆమె చెప్పారు.
టిబి నిర్మూలన పట్ల ప్రోత్సాహకరమైన రాజకీయ నిబద్ధత, టిబి నిర్మూలనా కార్యక్రమాలకు దేశీయంగా వనరుల కేటాయింపు పెంచడంగా పరివర్తన చెందిందని, ముఖ్యంగా భారత్, ఇండొనేషియాలు దేశీయ మూలాల ద్వారా 2020లో 43% బడ్జెట్‌ను కేటాయించాయని వివరించారు.
టిబి కేసులకు సంబంధించిన ప్రకటనలు 20-40% తగ్గాయని, ప్రత్యేకంగా కేసును గుర్తించడం, నివారణ చికిత్స, మానసిక, సామాజిక మద్దతుకు సంబంధించి చేరువయ్యే కార్యక్రమాలకు అంతరాయం కలిగిందని ఆమె అన్నారు. టిబిని అంత చేయడానికి మార్చి 2017లో ఇచ్చిన కార్యాచరణకు పిలుపు (కాల్ ఫర్ యాక్షన్) ఆగ్నేయాసియా ప్రాంత సభ్య దేశాలలో పునరుద్ధరించిన టిబి నిర్మూలన వ్యూహాల అమలుకు దారి తీసింది. సెప్టెంబర్ 2018లో ఐరాస అత్యున్నత స్థాయి సమావేశం (యుఎన్‌హెచ్ఎల్ఎం) జరుగనున్న నేపథ్యంలో మార్చి 2018లో ఢిల్లీలో నిర్వహించిన ఎండ్ -టిబి సదస్సులో దీనిని పునరుద్ఘాటించడం జరిగిందని ఆమె తెలిపారు.
చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ, టీబీని అంత చేయాలన్న వ్యూహంలోని మైలు రాళ్ళను 2020 కోల్పోయిందని, అంతేకాక తక్షణ ననివారణ చర్యలు తీసుకోకపోతే 2022 కవరేజ్ లక్ష్యాలను కూడా సాధించలేకపోవచ్చేని కేంద్ర సహాయ మంత్రి ఆందోళనను వ్యక్తం చేశారు. ఐరాస తదుపరి ఉన్నత స్థాయి సమావేశం 2023లో జరుగనున్నందున, పురోగతిని సమీక్షించాల్సిన తక్షణ అవసరం, తదనుగుణంగా ప్రతిస్పందనలను నిర్మించుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. నివారణ, రోగనిర్ధారణ, చికిత్స సేవలను పెంచి, టిబీ బారిన పడే జనాభాలో పౌష్టికాహార లోపాన్ని పరిష్కరించడం సహా సామాజిక రక్షణ చర్యలను తగినంతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఈ ప్రాంతానికి ఉందని ఆమె అన్నారు. సముచిత వనరుల మద్దతుతో సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన, పటిష్టమైన నిబద్ధతలతతో నూతన పద్ధతులను మనం అనుసరించాలని ఆమె చెప్పారు. టీబీ ప్రతిస్పందనను ముందుకు తీసుకువెళ్ళేందుకు నూతన రోగనిర్ధారణ పద్ధతులు, వాక్సిన్లు, మందుల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాక, డిజిటల్ సాంకేతికతను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను, ఇతర ఆవిష్కరణలను పెంచాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
అంతిమంగా, రాజకీయ నిబద్ధత, వనరుల సమీకరణ, టీబీ నిర్మూలన చర్యలు చేపట్టేందుకు మన బలాలను వినియోగించుకోవడానికి అందరూ ఐక్యం అయ్యేందుకు తిరిగి నిబద్ధతను ప్రకటించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియెసుస్, డబ్ల్యుహెచ్ఒ, ఎస్ఇఎఆర్ఒ డైరెక్టర్ డాక్టర్ సుమన్ రిజాల్, డబ్ల్యుహెచ్ఒ, ఎస్ఇఎఆర్ఒ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ కూడా పాల్గొన్నారు.
****
(Release ID: 1766743)
Visitor Counter : 163