మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఫేజ్-IIని ప్రారంభించిన కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి
అట్టడుగు స్థాయిల్లో సామాజిక మార్పునకు యువత ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు
Posted On:
25 OCT 2021 4:10PM by PIB Hyderabad
కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ రెండవ దశను ప్రారంభించారు. రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ ఫెలోషిప్ యువత, చైతన్యవంతులైన వ్యక్తులకు అట్టడుగు స్థాయిలో నైపుణ్యాభివృద్ధికి దోహదపడే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ రెండు సంవత్సరాల ఫెలోషిప్ విద్యా భాగస్వామి అయిన ఐఐఎమ్‌ల తరగతి గది సెషన్‌లను జిల్లా స్థాయిలో ఇంటెన్సివ్ ఫీల్డ్ ఇమ్మర్షన్‌తో కలిపి విశ్వసనీయమైన ప్రణాళికలను అందిస్తుంది. ఆ మేరకు ఉపాధి, ఆర్థిక ఉత్పత్తిని పెంచడంలో అడ్డంకులను గుర్తించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి ప్రయత్నాలను కొనసాగించడం ద్వారా అట్టడుగు స్థాయిలో సామాజిక మార్పుకు ఉత్ప్రేరకాలుగా వ్యవహరించాలని సహచరులకు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లు మరియు అకడమిక్ భాగస్వామి ఐఐఎమ్‌లకు ఫెలోలను సులభతరం చేయాలని మరియు ఈ ఫెలోషిప్ ద్వారా మార్పు యొక్క విజయ కథను స్క్రిప్ట్ చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ వైపు వెళ్తున్నామని ఆయన తెలిపారు. అన్ని రంగాలలో చోటుచేసుకుంటున్న విపరీతమైన పరివర్తనాలు కొత్త నైపుణ్యాలు మరియు మరింత నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం డిమాండ్‌ను సృష్టిస్తాయి. తద్వారా జిల్లా స్థాయిలో నైపుణ్య మ్యాపింగ్ కోసం పిలుపునిస్తుంది మరియు తదనుగుణంగా నైపుణ్యాభివృద్ధి ప్రయత్నాలను నిర్దేశిస్తుందని వెల్లడించారు.
21 వ శతాబ్దం యొక్క అవసరాలు మరియు స్థానిక వాస్తవాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి ప్రయత్నాలలో స్థానిక భాషను సమగ్రపరచడంతోపాటు ప్రపంచ ఆలోచన మరియు స్థానిక విధానంతో పనిచేయాలని శ్రీ ప్రధాన్ సహచరులకు పిలుపునిచ్చారు.
శ్రీ ప్రధాన్ జాతీయ విద్యా విధానం-2020 " విద్య మరియు నైపుణ్యాల మధ్య బలమైన కలయికను సృష్టించే దృక్పథాన్ని మరియు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌తో సహా ఈ దిశలో ఇటీవలి కార్యక్రమాలను వివరించారు. జాతీయ విద్యా విధానంపై అవగాహన కల్పించాలని ఆయన ఐఐఎంలకు పిలుపునిచ్చారు.
శ్రీ రాజేష్ అగర్వాల్, కార్యదర్శి, ఎంఎస్‌డీఈ; శ్రీమతి అనురాధ వేమూరి, జాయింట్ సెక్రటరీ, ఎంఎస్‌డీఈ; శ్రీ అశ్విన్ గౌడ్, మిషన్ డైరెక్టర్, కర్ణాటక నైపుణ్యాభివృద్ధి సంస్థ (కెఎస్‌డిసి); శ్రీ స్వప్నిల్ టెంబే, జిల్లా కలెక్టర్, ఈస్ట్ గారో హిల్స్, మేఘాలయ; శ్రీ పి. సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్, విజయపుర, కర్ణాటక మరియు ప్రొఫెసర్ అర్నాబ్ ముఖర్జీ, ఐఐఎం బెంగళూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ గురించిన వివరాలు:
మిషన్‌ను అమలు చేయడానికి మరియు దేశంలో నైపుణ్య శిక్షణ డెలివరీ మెకానిజమ్‌ను బలోపేతం చేయడానికి, స్కిల్ అక్విజిషన్ మరియు నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్‌లీహుడ్ ప్రమోషన్ (సంకల్ప్), ప్రపంచ బ్యాంకు రుణ సహాయక కార్యక్రమాన్ని జనవరి 2018 లో స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల సరఫరా మరియు డిమాండ్ మధ్య అసమతుల్యతను సమర్థవంతంగా తగ్గించడానికి జిల్లా నైపుణ్య కమిటీలతో (డిఎస్‌సిలు) సంకల్ప్ నిమగ్నమై ఉంది. తద్వారా యువత పని చేయడానికి మరియు సంపాదించడానికి తగిన అవకాశాలను సృష్టిస్తుంది.
సంకల్ప్ కింద ఎంజిఎన్‌ఎఫ్ ప్రోగ్రామ్ జిల్లా స్థాయిలో నిపుణుల కేడర్‌ను అందించడానికి రూపొందించబడింది, వీరికి సాధారణంగా పాలన మరియు ప్రజా విధానం గురించి మాత్రమే కాకుండా వృత్తి విద్య గురించి కూడా తెలుసు. ఎంజిఎన్‌ఎఫ్ అనేది ఐఐఎం క్యాంపస్ మరియు జిల్లాలలో వరుసగా నిర్వహించబడే అకడమిక్ మరియు వర్క్-బేస్డ్ ట్రైనింగ్ యొక్క విశిష్ట సమ్మేళనం. అకడమిక్ మాడ్యూల్ ఫెలోలకు మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ మరియు డిస్ట్రిక్ట్ స్కిల్స్ ఎకోసిస్టమ్ నుండి భావనలను పరిచయం చేస్తుంది. ఫీల్డ్‌వర్క్ (జిల్లా ఇమ్మర్షన్) సమయంలో జిల్లా నైపుణ్య సమస్యలను పరిష్కరించడంలో డిఎస్‌సి అధికారులతో సభ్యులు జిల్లాలోనే పని చేస్తారు. డీఎస్‌స్సీ అధికారులతో పాటు వారు జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు (డిఎస్‌డిపిలు) మరియు అమలు రోడ్ మ్యాప్‌లను రూపొందించాలి. ఎంజిఎన్‌ఎఫ్‌లు సాక్ష్యం ఆధారిత ప్రణాళిక మరియు జిల్లాల్లో నైపుణ్యం నిర్వహణపై జిల్లాలకు సహాయం చేస్తాయి. స్థానిక అవసరాల కోసం నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించడం "లోకల్ ఫర్ లోకల్"కి ప్రేరణనిస్తుంది. పరిశ్రమకు సంబంధించిన నైపుణ్య స్థావరాన్ని నిర్మించడం కూడా "ఆత్మనిర్భర్ భారత్"కి దోహదపడుతుంది.
ఎంజిఎన్‌ఎఫ్ అనేది స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ డెలివరీని మెరుగుపరచడానికి జిల్లా పరిపాలనకు ఉత్ప్రేరక మద్దతును అందించడానికి ఇప్పటికే కొంత స్థాయి విద్యా లేదా వృత్తిపరమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్న 21-30 సంవత్సరాల వయస్సు గల యువతీ,యువకులకు ఒక అవకాశం.
ఎంజిఎన్‌ఎఫ్ ఫేజ్ -1 (పైలట్): ఐఐఎం బెంగుళూరు అకడమిక్ పార్టనర్‌గా ఇది ప్రారంభించబడింది. 69 మంది ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో పనిచేస్తున్నారు.
ఎంజిఎన్‌ఎఫ్ ఫేజ్-II (నేషనల్ రోల్ అవుట్): దేశంలోని అన్ని జిల్లాల్లో 661 ఎంజిఎన్ఎఫ్‌లతో అక్టోబర్ 25న ప్రారంభించబడుతోంది.9 ఐఐఎంల్లోని 8 ఐఐఎంలు ఇందులో చేరాయి. (ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం-జమ్ము, ఐఐఎం కోజికోడ్, ఐఐఎం లక్నో, ఐఐఎం నాగ్‌పూర్, ఐఐఎం రాంచీ, ఐఐఎం-ఉదయ్‌పూర్ మరియు ఐఐఎం విశాఖపట్నం)
******
(Release ID: 1766417)
Visitor Counter : 184